ఇంత మంచి విశ్లేషణతో కూడిన కర్మ సిద్ధాంతాన్ని ఈరోజు అందించడం నా భాగ్యంగా భావిస్తున్నాను#@&. …
Author Name:cooking and vlogs smiley girl keerthi
Youtube Channel Url:https://www.youtube.com/@SivadurgaAdabala-d7o
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WoDC5SOchLM
Transcript:
(00:00) అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఒక బరువైన జీవితంలో మనందరికీ అవసరమైన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదు జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు అబద్ధాలా ఆడేవాడు మోసాలు చేసేవాడు బయట దర్జాగా బతికేస్తున్నాడు చీమకు కూడా హాని తలపెట్టని నాకేమో అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే వాడికి న్యాయం ఉందా ఇలాంటి డౌట్స్ అన్ని వస్తున్నాయా అయితే వీడియో అయిపోయే లోపు మీకు ఆ డౌట్స్ అన్నీ తీరిపోవచ్చు. కష్టం పట్ల మీ పర్స్పెక్టివ్
(00:30) మారిపోవచ్చు. మీకు వచ్చిన కష్టాలు అసలు కష్టంగా అనిపించకపోవచ్చు ప్రపంచాన్ని మీరు చూసే యాంగిల్ మారిపోవచ్చు. రెడీా ఈ ప్రశ్న మీ ఒక్కళళది కాదు పాస్ట్ లో చాలా మందికి వచ్చింది. యుగ యుగాలుగా ధర్మం కోసం న్యాయం కోసం బతికిన ప్రతి గుండెలో రగిలే ప్రశ్న ఆఖరికి దేవుడికి అత్యంత ఇష్టమైనవాడు కురువంశ పితామహుడైన భీష్ముడు కూడా సరిగ్గా ఇలాంటి డౌటే వచ్చింది.
(00:52) ఒక్కసారి కురుక్షేత్ర రణభూమికి వెళ్ళద్దాం. కురుక్షేత్ర రణభూమి భీష్ముడు అంపసయ్య మీద ఉన్నాడు ఆయన పడుతున్న నరకం మామూలుది కాదు శరీరం నిండా బాణాలు రక్తం కారుతున్న గాయాలు కదిలితే ప్రాణం పోయేంత పరిస్థితి అంతటి పుణ్యాత్ముడికి జీవితం మొత్తం ధర్మం త్యాగాల మయం అలాంటి మహాత్ముడికి ఇంతటి కష్టం ఏంటి అఫ్కోర్స్ ఆయన కావాలనుకున్నప్పుడు చావు వస్తుంది కానీ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఈలోపు శరీరానికి ఎందుకు అంత కష్టం దీని వెనకున్న కర్మ రహస్యం మన ఊహకు కూడా అందదు దేవుడి లెక్క ఎక్కడ ఎప్పుడూ తప్పదు ఈ చిన్న సంఘటన వింటే మన కష్టాల పట్ల
(01:26) మనకుఉన్న భయం దేవుడి మీద ఉన్న కోపం రెండు పోతాయి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది రణరంగం అంతా నిశబ్దం గద్దలు రాబందులు శవాలని పీక్కు తింటున్నాయి ఆ శవాల మధ్యలో అంపసయ్య మీద బెడ్ ఆఫ్ యరోస్ మీద భీష్ముడు పడుకొని ఉన్నాడు. ఒకసారి ఊహించండి ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వందలాది బాణాలు శరీరానికి ఒక వైపు నుంచి రెండో వైపుకు దూసుకవచ్చాయి అదే బాణాల మీద పడుకున్న ఆ ఉద్ధుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది ప్రతి ఊపిరి ఒక యుద్ధంలా ఉంది ప్రతి క్షణం ఒక నరకంలా ఉంది అలాంటి సిచువేషన్ లో అప్పుడు అక్కడికి జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు వచ్చాడు
(02:01) శ్రీకృష్ణుడిని చూడగానే భీష్ముడి కళ్ళలో నుంచి నీళ్లు ఉబవికి వచ్చాయి. గొంతు పెగుల్చుకొని అడిగాడు కృష్ణ వాసుదేవా నేను ఇప్పుడు అంపసయ్య మీద పడుకొని ఉన్నాను నరకం చూస్తున్నాను అయినా నా యోగ దృష్టితో గతానికి వెళ్లి చూసుకున్నాను ఒకటి కాదు రెండు కాదు 100 జన్మలు వెనక్కి వెళ్లి చూసుకున్నాను నేను ఎక్కడ ఎవరికీ ఏ హాని తలపెట్టలేదు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు ఎవ్వరికీ ద్రోహం చేయలేదు ధర్మాన్ని తప్పలేదు అయినా నాకు ఈ నరకం ఏంటి మంచిగా ఉండటమే నా తప్పా అని ఆవేదనతో ప్రశ్నించాడు భీష్ముడి ఆవేదన విన్నాక కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో అర్థం దాగి ఉంది.
(02:40) తాత నువ్వు నీ దివ్య దృష్టితో 100 జన్మల వెనక్కి వెళ్లి చూశవ్ కానీ కర్మ అనేది నువ్వు చూసిన దగ్గర ఆగిపోద్ది తాత నువ్వు 100 జన్మల దగ్గర ఆగిపోయావ్ కానీ నీ దృష్టితో ఇంకొంచెం వెనక్కిెళ్లి 101వ జన్మను చూడు అక్కడ ఉంది నీ ప్రశ్నకు సమాధానం అన్నాడు. భీష్ముడు తన శక్తినంతా కూడ తీసుకొని 100 జన్మల వెనక్కెళ్లి ఆ వెనకఉన్న 101వ జన్మలోని చీకటిలోకి వెళ్లి చూశడు ఒక దృశ్యం కనిపించింది.
(03:08) భీష్ముడు గుండె జారిపోయింది. ఏం జరిగింది ఆ 101వ జన్మలో ఆ జన్మలో భీష్ముడు యువరాజు అధికారం అహంకారం యవ్వనం ఒకరోజు అడవిలో గుర్రం మీద వేగంగా వెళ్తున్నాడు ఒక పాము దారికి అడ్డువచ్చింది. తను వెయిట్ చేయొచ్చు లేదా పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు కానీ యవ్వన మదం కదా అహంకారంతో నా దారికి అడ్డు వస్తుందా అనుకున్నాడు గుర్రం దిగాడు బాణం తీసుకున్నాడు ఆ బాణంతో ఆ పాముని ఎత్తి పైకి లేపి పక్కనున్న ముళ్ళ పొదల్లో ఇసిరేసాడు ఇప్పుడు అసలు నిజం వినండి కర్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందో చూడండి ముళ్ళ పొదల్లో పడిన పాము బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. తల ఎత్తితే పైనున్న
(03:44) ముళ్ళు పుచ్చుకుంటుంది తల దించితే కింద ఉన్న ముళ్ళు పుచ్చుకుంటుంది. అది బయటికి రాలేక ఊపి రాడక తన శరీరాన్ని తనే చూసుకుంటూ నరకం అనుభవించింది. ఇప్పుడు ఒకసారి కురుక్షేత్రం దగ్గరికి రండి బాణాల మీద పడుకున్నాడు భీష్ముడు అంపసయ్య మీద ఉన్నాడు తల ఎత్తుదాం అంటే మెళలో బాణం ఉంది వెత్తలేడు పక్కకు తిరుగుదాం అంటే భుజంలో బాణం ఉంది తిరగలేడు ఆ రోజు పాము ఎలా అయితే నరకం చూసిందో కరెక్ట్ గా ఈ కురువృద్ధుడు అదే పొజిషన్లో నరకం చూస్తున్నాడు.
(04:15) ఇప్పుడు చూడండి కర్మ రిఫ్లెక్షన్ నువ్వు ప్రకృతికి ఏమఇస్తావో ప్రకృతి నీకు అదే ఇస్తుంది. పువ్వు ఇస్తే పువ్వు ముల్లి ఇస్తే ముల్లు తేడా ఒక ఇంచు కూడా ఉండదు భీష్ముడికి ఇప్పుడు అర్థమయింది. కానీ మనందరికీ వచ్చే డౌటే భీష్ముడికి కూడా వచ్చింది. కృష్ణ నేను పాపం చేసింది 100 జన్మల క్రితం 101వ జన్మలో మరి ఇప్పుటిదాకా ఆ పాపం ఏం చేసింది ఎందుకు 100 జన్మలు వెయిట్ చేసింది దేవుడు నిద్రపోయాడా అని అడిగాడు.
(04:43) ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కృష్ణుడు చెప్పిన సమాధానం వింటే మన కళ్ళు తెరుచుకుంటాయి. కృష్ణుడు అన్నాడు తాత కర్మ వెయిట్ చేస్తుంది. నువ్వు ఆ పాపం చేసిన తర్వాత 100 జన్మలు నువ్వు చేసిన పుణ్య కార్యాలు నీ చుట్టూ ఒక రక్షణ కవచంలో ఏర్పడ్డాయి. నువ్వు చేసిన పుణ్యం ఎంత గొప్పది అంటే ఆ పాపం నిన్ను తాకలేకపోయింది కానీ ఆ కవచం ఎప్పుడు పగిలిపోయిందో తెలుసా తాత ఆ రోజు నిండు సభలో దుశాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చినప్పుడు ఆమె దీనంగా నీ వైపు చూస్తూ ఏడుస్తూ తాతా నన్ను కాపాడండి అని చేతులు చాచి అడిగింది కానీ నువ్వు ఏం చేశవ్
(05:20) నువ్వు వంశానికి పెద్దవి నీకు ఆ అన్యాయాన్ని ఆపే శక్తి ఉంది అధికారం ఉంది. కానీ నేను ఈ సింహాసనానికి కట్టుబడి ఉన్నాను అనే ఒకే ఒక్క సాకుతో మౌనంగా తలదించుకొని ఉండిపోయావు తాత ఆ క్షణమే ఆమె కళ్ళలో నుంచి వచ్చిన ఆవేదన ఒక అగ్ని జ్వాలలా మారి 100 జన్మల నీ పుణ్యఫల కవచాన్ని ముక్కల చేసింది తాత అన్యాయం చేయడం ఎంత పాపమో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండడం కూడా అంతే పాపం తాత ఆ రోజు నీ మౌనం 101వ జన్మలో నువ్వు చేసిన పాపానికి తలుపులు తెరిచింది.
(05:53) ఆ రోజు ఆ పాము శాపం ఇన్నాళ్లకు గుడ్డితో సహా నిన్ను చేరింది అన్నాడు. ఇప్పుడు భీష్ముడి కళ్ళల్లో భయం పోయింది. ఒక పశ్చాత్తాపం మిగిలింది. అప్పుడు కృష్ణుడు భీష్ముడు [నవ్వు] నుదిటి మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు. తాత ఇది శిక్ష కాదు శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ బంగారం మెరవాలంటే కొలిమిలో కాలాల్సిందే అంటే అగ్నిలో కాలాల్సిందే నువ్వు మోక్షానికి పూర్తిగా అరువుడివి నీ ఆత్మని అంటుకున్న కర్మనే మరకను తుడవడానికి ఈ వేదన అని చెప్పాడు ఈరోజుతో నీ లెక్క సరిపోయింది నీ శరీరం రక్తం కారుతూ ఉండొచ్చు కానీ నీ ఆత్మ వైట్ పేపర్లో మెరిసిపోతుంది ఇంక ప్రశాంతంగా వెళ్ళు తాత
(06:29) అన్నాడు ఆ స్పర్శ తగలగానే భీష్ముడి కళ్ళల్లో భయం పోయింది నరకం అనుభవిస్తున్న ఆ మనిషి చిన్న పిల్లా ప్రశాంతంగా నవ్వాడు. కృష్ణ నా భారాన్ని మొత్తం దీయించేసావు అని కళ్ళు మూసాడు. ఈ కథ విన్నాక మీకు ఇంకొన్ని డౌట్స్ రావచ్చు. సరే భీష్ముడు అంటే 101వ జన్మలో యువరాజు యవ్వన మదంతో ఉన్నాడు ఆ పాముని ఇసి అవతల పారేసాడు తెలిసే తప్పు చేశడు తనకి శిక్ష అనుభవించాడు.
(06:57) కానీ మన జీవితంలో మనం చాలాసార్లు తెలియక చాలా తప్పులు చేస్తుంటాం అవి తప్పులని కూడా తెలియదు వాటికి కూడా శిక్ష అనుభవించాల్సిందేనా సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక చిన్న కథ చెప్తాను కర్మ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా పని చేస్తుందో మనం తెలియక చేసిన తప్పులు కూడా ప్రకృతి ఎలా రియాక్ట్ అవుతుందో ఈ మాండవ్య మహర్షి కథ వింటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
(07:19) ఈ మహర్షి జీవితంలో ఒక సంఘటన జరిగింది. మాండయుడు ఒక గొప్ప ఋషి ఎప్పుడు మౌనంగా తపస్సు చేసుకునేవాడు చీమకు కూడా హాని తలపెట్టినవాడు కాదు. ఒకరోజు దొంగలు రాజుగారి సొమ్మును దొంగిలించి ఈయన ఆశ్రమంలో దాచిపెట్టి పారిపోయారు. రాజుబట్లు వచ్చి మౌనంగా కూర్చున్న ఋషిని దొంగని [గొంతు సవరించుకోవడం] పట్టుకున్నారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు.
(07:36) రాజుగారు విచారణ కూడా చేయకుండా వీడిని సోలానికి ఎక్కించండి అని చెప్పారు. రాజులు ఆ ఋషిని తీసుకెళ్లి సూలం మీద కూర్చోబెట్టారు. ఆ ఇనుము ఆయన శరీరాన్ని చీల్చుకొని పోయింది. రక్తం ఏరులై పారింది. కానీ ఆయన తన తపస్సు శక్తితో ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు కానీ నరకం చూశడు. కొన్నాళ్ళ తర్వాత మాండవ్య మహర్షి మరణించాడు. యమలోకానికి వెళ్ళాడు.
(07:56) అక్కడ యమధర్మరాజును చూడగానే ఆయన కోపం కట్టలు తెంచుకుంది. యమధర్మరాజా నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం చేయలేదు మౌనంగా తపస్సు చేసుకున్నాను చీమ కూడా హాని చేయలేదు దొంగిలించిన దొంగలేమో హ్యాపీగా పారిపోయారు నేను మాత్రం నరకం అనుభవించాను పైగా ఇప్పుడు యమలోకానికి వచ్చాను. ఏంటి ఈ న్యాయం మంచి వాళ్ళకేనా ఈ కష్టాలు అని నిలదీశడు. అప్పుడు యమధర్మరాజు చేతులు జోడించి ఒక కఠినమైన నిజాన్ని బయట పెట్టాడు. మహర్షి శాంతించండి.
(08:20) మీరు ఈ జన్మలో ఈ వయసులో ఏ పాపం చేయలేదు కానీ కర్మ అనేది మీరు చూసిన దగ్గర ఆగిపోదు. ఒకసారి మీరు మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి మీరు ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తుందా మీరు ఆడుకుంటూ ఒక తేనె టిగగును పట్టుకొని గడ్డి పూచతో దాని వెనక గుచ్చారు అది విలవిలలాడుతుంటే మీరు దాన్ని చూసి నవ్వుకున్నారు ఆ చిన్న ప్రాణికి గడ్డి పూచ సూలం లాంటిది స్వామి కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు అప్పుడు చేసిన పాపం పెరిగి పెద్దదై వడ్డీతో సహా మీకు ఇనప సూలమై గుచ్చుకుంది స్వామి అని చెప్పాడు.
(08:54) ఇప్పుడు విషయానికి వద్దాం భీష్ముడికి 100 జన్మలు పట్టింది మాండవి మహర్షికి 50 సంవత్సరాలు పట్టింది. కానీ కర్మ అనేది తిరిగి రావడం పక్క దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి కర్మ అనేది బ్యాంక్ అకౌంట్ లాంటిది మనం చేసే మంచి పనులు డిపాజిట్లు పాపాలు లోన్లు భీష్ముడు పుణ్యం చేశడు కాబట్టి పాపం పెండింగ్ లో ఉంది. సమయం వచ్చినప్పుడు బ్యాంకు వాడు వడ్డీతో సహా వసూలు చేశాడు.
(09:14) ఇప్పుడు మనం ఎపిసోడ్ బిగినింగ్ లో మాట్లాడుకున్న విషయానికి వద్దాం నేను మంచివాడిని నాకెందుకు ఈ కష్టాలు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని కదా మన డౌట్స్ సో ఇప్పుడు ఈ రెండు కథలు వింటే మనక ఏం అర్థం అవుతుంది మనకి ఇప్పుడు వచ్చే కష్టాలు ఒకప్పుడు మనం చేసిన కర్మల వల్ల వస్తున్నాయని ఇది అవగాహన అయితే ఇది అండర్స్టాండ్ అయితే కష్టాలు మన కష్టాలే మనకి తిరిగి వస్తున్నాయని మనం నమ్మితే 70% మీ కష్టాలు భారం తగ్గిపోతుంది.
(09:42) 30% మీరు సహనంతో ఆ కష్టాన్ని భరిస్తే సరిపోతుంది. బట్ట కంటుకున్న మురికి పోవాలంటే దాన్ని ఉతకాలి పెండాలి బండకేసి బాదాలి ఆ దెబ్బలు బట్టను చించడానికి కాదు దాన్ని శుభ్రపరచడానికి కష్టాలు కూడా అంతే ఈరోజు మీకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు మీకు శిక్షిస్తున్నాడు అని అర్థం కాదు మీ ఆత్మ అనే బట్టను అంటిన కర్మ అనే మురికిని పోగొట్టడానికి దేవుడు వేసే దెబ్బలే ఈ కష్టాలు సబ్బు పెట్టకుండా మురికి ఎలా పోదో కష్టం రాకుండా పాత కర్మ పోదు ఈ విషయం అర్థమైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(10:15) కాబట్టి జీవితంలో మీకున్న కష్టాలను చూసి లేదా రాబోయే కష్టాలను చూసి దేవుడా నాకే ఎందుకు అని ఏడవకండి. మీ పాత అప్పు క్లియర్ అయిపోతున్నందుకు మిమ్మల్ని శుభ్రం చేస్తున్నందుకు థాంక్స్ చెప్పండి. భీష్ముడు నవ్వుతూ బాణాల మీద పడుకున్నాడు. అలాగే నవ్వుతూ మీ కర్మను స్వీకరించండి. కష్టాన్ని చూసి పారిపోతే మిమ్మల్ని జన్మ జన్మలకి అది తరుగుతూ ఉంటుంది.
(10:35) అదే ఎదురు తిరిగి యక్సెప్ట్ చేస్తే అది కరిగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన కర్మ సిద్ధాంతం మీకు నచ్చితే ధైర్యాన్ని ఇస్తే కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీలాగే కష్టాల్లో ఉన్న చాలా మందికి ఈ వీడియో చేరాలంటే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు నమస్కారం.
No comments:
Post a Comment