Wednesday, April 8, 2026

మాయ అంటే ఏమిటి? కబీర్ దాస్ నుండి మోడరన్ సైన్స్ వరకు.. మీకు తెలియని సంచలన నిజాలు!​

మాయ అంటే ఏమిటి? కబీర్ దాస్ నుండి మోడరన్ సైన్స్ వరకు.. మీకు తెలియని సంచలన నిజాలు!​

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uLSX-jA2xP8



Transcript:
(00:00) నమస్తే ప్రజలారా ఈరోజు మనం ఒక సంచలన నిజం గురించి మాట్లాడుకుందాం. మనం చూస్తున్న ఈ లోకం మనం నమ్ముతున్న ఈ బంధాలు మనల్ని రాత్రి పగలు పరిగెత్తిస్తున్న ఈ కోరికలు ఇవన్నీ నిజమేనా లేక మన కళ్ళ ముందు ఉన్న ఒక పెద్ద ఇంద్రజాలమా మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఒక పెద్ద మాయా ప్రపంచంలో బతుకుతున్నాం. అసలు ఈ లోకం నిజమేనా ఈ ప్రయాణం మన బయటి ప్రపంచం గురించి కాదు.
(00:25) మన లోపల ఉన్న భ్రమల గురించి ఈ మాయ గురించి తెలిస్తే ఈ ప్రపంచంలో మనం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నామో అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ జీవితం మీద మీకున్న అవగాహన పూర్తిగా మారిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మాయ అంటే ఏమిటి? కబీర్ దాస్ గారి అద్భుత సందేశం.
(00:53) మొదటగా మాయను ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పిన మహాత్మ కబీర్దాస్ గారి పద్యం గురించి మాట్లాడుకుందాం. ఆయన మాయను ఒక పెద్ద మోసగత్తగా అభివర్ణిస్తూ ఇలా చెప్పారు. మాయ మహాతగిని హంజాని తిరుగున ఫాస్లేయే కరడోలే బోలే మధురి బాని కేశవ్ కే కమలా హోయి బైటి శివకే భవన్ భవాని పండాకి మూరత్ హోయి బైటి తీరత్ హూమేపాని యోగికే యోగిని హోయి బైటి రాజాకే ఘర్ రాణ కాహుకే హీరా హోయి బైటి కాహుకే కౌడి కాని భక్తన్కే భక్తిని హోయి బైటి బ్రహ్మకే బ్రహ్మాని కహే కబీర్ సునో భాయ సాధో యహ సబ్ అకతా కహాని దీని అర్థం చాలా లోతైనది.
(01:29) ఓ సజ్జనులారా ఈ మాయ అనేది ఒక పెద్ద మోసగత్తే అని నేను తెలుసుకున్నాను. ఆమె తన చేతిలో సత్వరజ తమో గుణాలనే మూడు రంగుల దారాలను అంటే పాసాలను పట్టుకొని తీయని మాటలు పలుకుతూ లోకాన్ని భ్రమింపజేస్తోంది అని ఆయన హెచ్చరించారు. ఈ మాయాజాలం ఎంత విచిత్రమైనది అంటే అది ఎక్కడ ఏ రూపంలో ఉంటుందో ఊహించడం కష్టం. ఆమె విష్ణువు దగ్గర లక్ష్మీదేవిగా శివుని ఇంట్లో పార్వతీ దేవిగా ఉంటుంది.
(01:58) పూజ చేసేవాడికి విగ్రహంలా పుణ్య తీర్థాలలో నీటి రూపంలోనూ కనిపిస్తుంది. యోగుల దగ్గర యోగినిగా రాజుల కోటలో రాణిగా మారుతుంది. కొందరికి ఆమె వజ్రంల అమూల్యంగా మరికొందరికి కేవలం ఒక గవ్వలా పనికి రానిదిగా కనిపిస్తుంది. చివరికి భక్తుల హృదయాల్లో భక్తి రూపంలో బ్రహ్మదేవుడి దగ్గర బ్రహ్మణి రూపంలో ఉంటుంది. ఒక వేటగాడు పక్షిని పట్టడానికి ఎలాగైతే ఆహారం వేసి ఆకర్షిస్తాడో మాయ కూడా మనకు ఇలాంటి రకరకాల సుఖాలను రూపాలను చూపిస్తూ తీయని మాటలు చెబుతూ మనల్ని సంకెళ్ళతో బంధిస్తుంది.
(02:34) ఆ సంకెళ్ళు మన కంటికి కనిపించవు. కానీ అవి మనల్ని ఈ సంసార చక్రంలో తిప్పుతూనే ఉంటాయి. అందుకే కబీర్ చెబుతున్నాడు ఓ సాధువులారా వినండి ఈ మాయ యొక్క కథ వర్ణనాతీతమైనది. ఇది మాటలకు [సంగీతం] అందనిది. ఆధునిక సైన్స్ దృష్టిలో మాయ క్వాంటం ఫిజిక్స్ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వేల ఏళ్ల క్రితం మన పెద్దలు చెప్పిన ఈ మాయ గురించి నేటి ఆధునిక సైన్స్ కూడా అదే మాట చెబుతోంది.
(03:02) ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒకసారి ఏమన్నారంటే రియాలిటీ ఇస్ మిర్లీ యన్ ఇల్యూషన్ ఆల్బీట్ ఏ వెరీ పర్సిస్టెంట్ వన్ అంటే మనం చూస్తున్న ఈ నిజం అనేది కేవలం ఒక బలమైన భ్రమ మాత్రమే. నేటి క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మనం తాకుతున్న ఏ వస్తువు కూడా నిజానికి సాలిడ్ అంటే అంత ఘనంగా ఉండదు పరమాణు స్థాయిలో చూస్తే ప్రతి వస్తువులో 99.99% ఖాళీ స్థలమే అంటే ఎంటీ స్పేస్ ఉంటుంది.
(03:29) మరి మనకు అది గట్టిగా ఎందుకు అనిపిస్తుంది? అదంతా మన మెదడు సృష్టించే ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ మాత్రమే. నేడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సిములేషన్ థియరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే మనం ఒక అడ్వాన్సుడ్ కంప్యూటర్ గేమ్ లోని పాత్ర లాగా ఒక భ్రమలో బతుకుతున్నాం అని దీని అర్థం. సైన్స్ ఇప్పుడు ఏదైతే కనిపెడుతుందో దాన్నే మన పూర్వీకులు మాయ అని పిలిచారు.
(03:51) మాయ గురించి మాట్లాడేటప్పుడు జగద్గురువులు అద్వైత వేదాంత చక్రవర్తి ఆదిశంకరాచార్యుల ప్రస్తావన లేకుండా ఆ చర్చ పూర్తి కాదు. ఆయన ఈ ప్రపంచాన్ని మిధ్య అని కొట్టి పారేశారు. ఆయన రాసిన వివేక చూడామణిలో మాయను ఇలా వర్ణించారు. శ్లోకం సన్నాప్య సన్నాయు భయాత్మికానో భిన్నాప్య భిన్నాప్యు భయాత్మికానో సంాప్య నంగాప్య భయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప దీని అర్థం మాయ అనేది ఉన్నదా అంటే సత్ కాదు లేనిదా అంటే అసత్ అది కాదు ఇది ఒక వింతైన శక్తి ఇది భగవంతుడి కంటే వేరైనది కాదు అలాగని భగవంతుడు కాదు దీన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం అందుకే దీన్ని అనిర్వచనీయం
(04:34) అన్నారు. శంకరాచార్యుల ప్రసిద్ధ ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి మాయ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. చీకటి పడుతున్న సమయంలో దారిలో పడి ఉన్న ఒక తాడును చూసి భ్రమతో అది పాము అని అనుకుంటాం. ఆ క్షణంలో ఆ పాము మనకు నిజంగానే కనిపిస్తుంది. మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం వేస్తుంది చెమటలు పడతాయి.
(05:02) కానీ ఎప్పుడైతే ఎవరో ఒకరు వచ్చి టార్చ్ లైట్ వేసి చూపిస్తారో అప్పుడు అక్కడ ఉన్నది తాడు మాత్రమే అని అర్థమవుతుంది. ముఖ్యమైన పాయింట్ లైట్ వేయకముందు అక్కడ పాము లేదు లైట్ వేసిన తర్వాత పాము చనిపోలేదు అక్కడ ఎప్పుడూ తాడే ఉంది. కానీ మన అజ్ఞానం వల్ల లేని పామును చూసి భయపడ్డాం. అలాగే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మమే తాడు కానీ మన అజ్ఞానం వల్ల ఈ బంధాలు, కష్టాలు, కులాలు, మతాలు అనే పామును చూసి భయపడుతున్నాం.
(05:30) ఎప్పుడైతే జ్ఞానం అనే కాంతి వస్తుందో అప్పుడు ఈ మాయా జగత్తు అంతా పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది. ఆయన ఒక్క మాటలో తేల్చి చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్ మిధ్య అంటే పరమాత్మ ఒక్కడే సత్యం ఈ జగత్తు కేవలం ఒక తాత్కాలిక బ్రమ. ఈ మాయ కేవలం మనుషులకే పరిమితం కాదు. ఈ కులాలు, మతాలు, వర్గాలు, దేశాలు, రాష్ట్రాలు చివరికి మనం చూస్తున్న ఖండాలు పశుపక్ష్యాదులు సకల జీవరాశులు అన్నీ ఆ మాయా రూపాలే.
(06:01) మనం ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య గీసుకున్న సరిహద్దులు ఎంత నిజమో మన మనసులో మనుషుల మధ్య గీసుకున్న కుల మతాల గోడలు కూడా అంతే మాయ. ఒక పక్షికి లేని సరిహద్దులు. ఒక జంతువుకు తెలియని కులాలు. కేవలం విజ్ఞానం ఉందని చెప్పుకునే మనిషికి మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే మాయ మనిషి అహంకారాన్ని అంతలా కప్పేసింది. మనమంతా ఒకే సముద్రంలోని అలలం అని మర్చిపోయి [సంగీతం] ఈ అలై పెద్దది ఆ అలై చిన్నది అని కొట్టుకుంటున్నాం.
(06:30) కానీ సముద్రం దృష్టిలో అన్ని నీటి బుడగలే. వేదాలు ఈ సృష్టిని మాయామయం అని అంటాయి. మాయా ప్రకృతిం విద్యాత్ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతోంది. అంటే ఈ ప్రకృతి అంతా మాయే అని అర్థం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక రహస్యం చెబుతాడు దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దీని అర్థం ఏమిటంటే ఓ అర్జున నా ఈ మాయ దైవికమైనది మూడు గుణాలతో కూడుకున్నది.
(07:01) దీనిని దాటడం ఎవరికైనా చాలా కష్టం కానీ ఎవరైతే నన్ను అనన్య భావంతో శరణు వేడుకుంటారో వారు మాత్రమే ఈ మాయను దాటగలరు అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. మాయ అనేది భగవంతుడి యొక్క శక్తి. అది మనల్ని సత్యం వైపు చూడనివ్వదు. కేవలం ఈ తాత్కాలిక ప్రపంచం వైపు మాత్రమే మన దృష్టిని మళ్లిస్తుంది. వేదాలు కూడా ఈ సృష్టిని మిద్య అని అంటాయి. అంటే ఇది శాశ్వతం కాదు ఒక కల లాంటిది అని అర్థం.
(07:31) ఇప్పుడు మనం ఆధునిక కాలంలో మాయ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా రాజకీయాలు రాజకీయం అంటేనే ఒక పెద్ద మాయ ప్రపంచం. ఒక రాజకీయ నాయకుడికి అధికారం అంటే ఒక పిచ్చి ఆ కుర్చీ కోసం ఆ పవర్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. మాయ వాళ్ళను ఎలా మోసం చేస్తుందో గమనించండి. అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు తమను తాము దేవుళ్లుగా భావిస్తారు. ఈ లోకమంతా నా కాలి కింద ఉంది అనుకుంటారు.
(07:54) వేల కోట్లు సంపాదిస్తారు. ప్రత్యర్థులను అణచివేస్తారు. కానీ వాళ్ళు మర్చిపోయే ఒక విషయం ఏంటంటే ఆ అధికారం శాశ్వతం కాదు. మాయ వాళ్ళ కళ్ళకు గంతలు కడుతుంది. నువ్వు ఎప్పటికీ పవర్ లోనే ఉంటావు నీ మాట చెల్లుబాటు అవుతుంది అని నమ్మిస్తుంది. కానీ ఎన్నికలు రాగానే లేదా పదవీ కాలం ముగియగానే ఆ కుర్చీ పోతుంది. అప్పుడు గాని వాళ్ళకు అర్థం కాదు తాము ఇంతకాలం ఒక భ్రమలో ఉన్నామని ఆ పదవి కోసం చేసిన పాపాలు మాత్రం వాళ్ళ వెంట వస్తాయి.
(08:25) పదవి పోయాక అధికారం ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన జనం కూడా కనిపించరు. ఇదే రాజకీయ మాయ. పదవి ఉన్నప్పుడు ఉన్న హోదా. కీర్తి అంతా మాయే అవి నీటిమీద రాతల వంటివి. ఈ ప్రపంచంలో అతి పెద్ద మాయ డబ్బు డబ్బు ఉంటే అంతా ఉన్నట్లే అని మాయ మనల్ని నమ్మిస్తుంది. వ్యాపారవేత్తలు రాత్రి పగలు కష్టపడతారు. ఒక కోటి సంపాదిస్తే 10 కోట్లు కావాలంటారు. 10 కోట్లు వస్తే 100 కోట్లు కావాలంటారు.
(08:51) ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది ఎక్కడా ఆగదు. ఎందుకంటే మాయ అతనికి తృప్తిని ఇవ్వదు. డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కానీ మాయ దానిని ఒక గమ్యంగా చూపిస్తుంది. డబ్బు ఉంటేనే నీకు సమాజంలో గౌరవం. డబ్బు ఉంటేనే నీకు సుఖం అని నమ్మిస్తుంది. కానీ లోతుగా ఆలోచించండి. ఒక మనిషి ఒకేసారి ఎన్ని బెడ్ల మీద పడుకోగలడు ఒకేసారి ఎన్ని కార్లలో ప్రయాణించగలడు ఎంత సంపాదించినా తినేది అదే అన్నం.
(09:20) కానీ మాయ మాత్రం ఆ కాగితం ముక్కల వెనుక మనల్ని పరిగెత్తిస్తుంది. చావు దగ్గరకు వచ్చినప్పుడు [సంగీతం] ఆ బ్యాంకు బ్యాలెన్స్ కానీ ఆ ఆస్తులు కానీ ఏవి మన ప్రాణాన్ని కాపాడలేవు. చివరికి ఆ సంపాదించిన ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు అయినా సరే మనిషి ఆ మాయలో పడి మోసపోతున్నాడు. మాయ ప్రభావం స్త్రీల మీద ఒక రకంగా ఉంటుంది. ఆడవాళ్ళకి బంగారం, నగలు ఖరీదైన పట్టుచీరలు అంటే విపరీతమైన ఆకర్షణ.
(09:44) ఇది మాయ యొక్క ఒక రూపం ఒక కొత్త నెక్లెస్ చూసినప్పుడు [సంగీతం] లేదా ఒక పట్టు చీర చూసినప్పుడు అది తన దగ్గర లేకపోతే జీవితమే వెలితిగా అనిపిస్తుంది. అది కొనుక్కుంటేనే తన అందం పెరుగుతుందని సమాజంలో హోదా పెరుగుతుందని మాయ నమ్మిస్తుంది. పక్కా ఆవిడ వేసుకున్న నగ కంటే తన నగ పెద్దగా ఉండాలి అని తాపత్రయ పడతారు.
(10:06) దీనికోసం భర్త మీద ఒత్తిడి తెస్తారు. ఇంట్లో గొడవలు పడతారు. కానీ ఆలోచించండి. ఆ బంగారం ఏమైనా శాశ్వతమా అది కేవలం ఒక లోహం ఆ పట్టుచీర అనేది కొన్ని దారాల కలయిక ఇవి శరీరాన్ని అలంకరించగలవు కానీ ఆత్మకు ఏమైనా ఇస్తాయా ఈ వస్తువుల మీద పెంచుకునే ఆ మోహం ఆ ఆకర్షణ మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి దూరం చేస్తుంది.
(10:30) ఆ వస్తువులు ఉంటేనే గొప్ప అనే భ్రమ మాయ కలిగిస్తుంది. ఆ భ్రమలోనే సగం జీవితం గడిచిపోతుంది. మగవాడి విషయానికి వస్తే మాయ అతన్ని స్త్రీ ఆకర్షణలో పడేస్తుంది. ఒక అందమైన రూపం కనిపిస్తే ఆ ఆకర్షణలో పడి తన విజ్ఞానాన్ని తన క్యారెక్టర్ ని తన బాధ్యతలను కూడా మర్చిపోతాడు. ఆ క్షణికమైన సుఖమే శాశ్వతమని బ్రమపడతాడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్ప మేధావులు.
(11:00) యోధులు ఈ ఆకర్షణలో పడి సర్వస్వం కోల్పోయారు. పురాణాల్లో కూడా మనం చూస్తాం. విశ్వామిత్రుడు వంటి మహా తపస్వి మేనకను చూసి తన తపస్సును పక్కన పెట్టేసాడు. మాయ ఎంత బలమైనదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. శరీరం అనేది కేవలం పంచభూతాల కలయిక చర్మం కింద ఉన్నది కేవలం రక్తం, మాంసం, ఎముకలు మాత్రమే. కానీ మాయ మాత్రం ఆ శరీరాన్నే సర్వస్వం అని చూపిస్తుంది. [సంగీతం] ఆ బాహ్య సౌందర్యం మీద మోహం పెంచుకునేలా చేస్తుంది.
(11:30) ఈ ఆకర్షణ వల్ల మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అది తన పతనానికి దారి తీస్తుంది. ఇప్పుడు అందరికంటే క్లిష్టమైన విషయం బంధాలు ఇది నా తల్లి ఇది నా తండ్రి వీడు నా భర్త ఈమె నా భార్య వీళ్ళు నా పిల్లలు వీడు నా తమ్ముడు నా చెల్లి అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇవన్నీ కేవలం ఈ జన్మకు సంబంధించిన నాటకం మాత్రమే. కబీర్ దాస్ గారు దీనిని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఈ బంధాలు అనేవి మాయపన్నే ఒకవల.
(11:58) పోయిన జన్మలో వీళ్ళు ఎవరో మనకు తెలియదు. వచ్చే జన్మలో వీళ్ళు మనకు ఉంటారో లేదో తెలియదు. ఒక బస్ స్టాప్ లో కొంతమంది ప్రయాణికులు ఎలాగైతే కలుస్తారో ఈ జీవితం అనే ప్రయాణంలో ఈ బంధాలు కూడా అంతే కానీ మాయ మాత్రం వీళ్ళు నీ వాళ్ళు వీళ్ళు లేకపోతే నువ్వు లేవు. వీళ్ళు దూరమైతే నీ జీవితమే శూన్యం అని మనల్ని ఏడిపిస్తుంది. ఆ బంధాల మీద పెంచుకునే అతి మోహమే మనిషికి దుఃఖాన్ని మిగిలిస్తుంది.
(12:24) తల్లిదండ్రులను గౌరవించాలి, భార్య పిల్లలను ప్రేమించాలి. కానీ వాళ్ళు నా సొంతం వాళ్ళు శాశ్వతం అని అనుకోవడం మాత్రం మాయే ఎందుకంటే ఎవరైనా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే ఆ వెళ్ళిపోయినప్పుడు వచ్చే బాధే మాయ మనకు ఇచ్చే గొప్ప దెబ్బ మనం పుట్టినప్పుడు ఒంటరిగానే వస్తాం పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. మధ్యలో ఉన్న ఈ బంధాలన్నీ మాయ నాటకంలోని పాత్రలు మాత్రమే.
(12:49) ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈ కులాలు మతాలు దేశాల సరిహద్దులు ఇవన్నీ మనకు నిజమైన బంధువులా లేక మాయ మన కళ్ళకు కట్టిన గంతలా మనకు బాగా కావాల్సిన వాళ్ళు రేపు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆఖరి చూపులో ఉండే బాధను అనుభవించినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ రాజకీయం వ్యాపారం అంతస్తులు అన్నీ ఎంత అర్థం లేనివో ఈ జీవులంతా ఒకే ప్రయాణంలో ఉన్న బాటసారులు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన శాంతి విముక్తి లభిస్తాయిమా మాయ ఎంత బలమైనదో చెప్పడానికి ఒక గొప్ప పురాణ గాధ ఉంది.
(13:27) ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీమహా విష్ణువును ఒక ప్రశ్న అడిగాడు. స్వామి అసలు ఆ మాయ అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది నాకు ఒక్కసారి చూపించవా అని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి నారదుడిని భూలోకానికి తీసుకెళ్లి తనకు దాహం వేస్తోందని నీళ్లు తీసుకురమ్మని పంపాడు. నీళ్ళ కోసం వెళ్ళిన నారదుడు ఒక అందమైన యువతిని చూసి ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని 12 ఏళ్ళు సంసారంలో మునిగిపోయాడు.
(13:54) భార్య పిల్లలు ఇల్లు ఇవే లోకం అనుకున్నాడు. చివరకు ఒక తుఫాను వచ్చి అంతా కొట్టుకుపోయినప్పుడు నారదుడు ఒంటరివాడై ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు వెనక నుండి ఒక స్వరం వినిపించింది. నారదా నీళ్లుు తెమ్మంటే ఇంత ఆలస్యం చేశవేంటి? నాకు దాహం వేస్తోంది అని నారదుడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏ గ్రామం లేదు భార్య లేదు పిల్లలు లేరు కేవలం విష్ణుమూర్తి నిలబడి ఉన్నాడు.
(14:20) అప్పుడు నారదుడికి అర్థమయింది. ఈ 12 ఏళ్ల జీవితంంతా కేవలం కొన్ని క్షణాల మాయ అని మన జీవితం కూడా అంతే. మాయ మనల్ని ఎంత త్వరగా తనలో కలిపేసుకుంటుందో చూడండి. ఇక ఈ కలియుగంలో మాయ సరికొత్త రూపం దాల్చింది. అదే సోషల్ మీడియా. ఇస్గ్ర లో ఫోటోలు Facebook లో లైకులు YouTube లో వ్యూస్ ఇవే జీవితం అనుకుంటున్నాడు మనిషి ఒక అందమైన ఫోటో తీయడం కోసం ప్రాణాలకు తెగించి సెల్ఫీలు తీసుకుంటున్నాడు.
(14:49) ఎదురుగా ఉన్న మనిషితో మాట్లాడటం మానేసి ఎక్కడో ఉన్న అపరిచితుల కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఒక పెద్ద మాయాజాలం. మనం ఫోన్లో చూసే ప్రపంచం నిజం కాదు. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ లోపల ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది. మాయ మాత్రం మనల్ని వేరే వాళ్ళతో పోల్చుకునేలా చేసి మన దగ్గర ఉన్న సంతోషాన్ని దూరం చేస్తుంది.
(15:11) మన సమయాన్ని మన ఆలోచనలను ఈ వర్చువల్ ప్రపంచం దోచేస్తోంది. మనం రోజు అద్దంలో చూసుకునే ఈ శరీరం మీద మనకు ఎంత మమకారం. కానీ ఆలోచించండి. ఈ శరీరం శాశ్వతమా? చిన్నప్పుడు పాలు తాగే పిల్లాడిలా ఉన్నా మనం. ఈరోజు ఇలా ఉన్నాం. రేపు ముసలి వాళ్ళం అవుతాం. మాయ మనకు ఒక భ్రమను కలిగిస్తుంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే అందంగా ఉంటావు. నీకు చావు రాదు అని నమ్మిస్తుంది.
(15:37) మనం ఒక రోగిని చూసినప్పుడు లేదా ఒక శవాన్ని చూసినప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది. కానీ ఆ స్మసానం నుండి బయటకు రాగానే మళ్ళీ మాయ మనల్ని కమ్మేస్తుంది. ఈ శరీరం అనేది కేవలం ఒక అద్దె ఇల్లు లాంటిది. ఆత్మ అనే యాత్రికుడు ఇందులో కొంతకాలం ఉండి. ఆ ఇల్లు పాతబడగానే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ మాయ మాత్రం ఈ ఇంటినే నేను అని భ్రమ కలిగిస్తుంది.
(16:03) ఈ అజ్ఞానమే మన దుఃఖానికి కారణం. మాయను జయించినవాడు భక్తుడు. మాయలో చిక్కుకున్నవాడు అసురుడు. హిరణ్య కసిపుడు లోకాలను జయించి బ్రహ్మ దగ్గర వరం పొంది ఒక అహంకారంలో పడ్డాడు. నేనే దేవుడిని నాకు చావు లేదు అని నమ్మాడు. ఇది మాయ యొక్క పరాకాష్ట కానీ ప్రహ్లాదుడు అనే చిన్న బాలుడు ఆ మాయను చూడలేదు. అతను మాయకు వెనక ఉన్న భగవంతుని చూశాడు.
(16:27) తండ్రి ఈ అధికారం ఈ శరీరం ఈ లోకమన్నీ అశాశ్వతం ఆ హరి ఒక్కడే సత్యం అని చెప్పాడు. చివరికి ఆ మాయ రూపంలో ఉన్న అహంకారం నరసింహ స్వామి చేతిలో అంతమైపోయింది. మాయ మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంత వేగంగా కిందకు పడేస్తుంది. మనం చూస్తున్న ఈ చెట్లు పుట్టలు, ఇళ్లు, వాకిళ్లు అన్నీ మాయే. ఏది ఎప్పటికీ ఉంటుందో అది సత్యం. ఏది మారిపోతూ ఉంటుందో అది మాయ.
(16:57) మన శరీరం మన ఆలోచనలు మన కోరికలు నిమిష నిమిషానికి మారిపోతుంటాయి. ఈ సృష్టిలో ఏది స్థిరంగా ఉండదు. ఒక సినిమా స్క్రీన్ మీద బొమ్మలు ఎలాగైతే మారుతుంటాయో ఈ ప్రపంచంలో దృశ్యాలు కూడా అలాగే మారుతుంటాయి. కానీ మనం ఆ మారే బొమ్మలనే నిజమని నమ్మి అసలైన స్క్రీన్ ని అంటే భగవంతుడిని మర్చిపోతున్నాం. అజ్ఞానమే మాయకు పెట్టుబడి. మరి మాయ నుండి బయట పడటం ఎలా? మాయ చాలా శక్తివంతమైనది.
(17:21) దానిని జయించాలంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సత్సంగం జ్ఞానులతో తిరగడం వల్ల మనలోని బ్రమలు తొలుగుతాయి. ఆత్మ విచారణ నేను ఎవరు నా గమ్యం ఏంటి అని నిరంతరం ఆలోచించడం. నిష్కామ కర్మ ఫలితం మీద ఆశ లేకుండా బాధ్యతను నెరవేర్చడం. ఎప్పుడైతే మనం ఫలితం మీద ఆశపడతామో అక్కడ మాయ మనల్ని పట్టేస్తుంది. శరణాగతి మాయను సృష్టించిన ఆ పరమాత్మను శరణు వేడటం.
(17:48) మనం ఎప్పుడైతే భగవంతుడిని గట్టిగా పట్టుకుంటామో అప్పుడు మాయ మనల్ని ఏమి చేయలేదు. ముగింపుగా నా విశ్లేషణలో నేను చెప్పేది ఒక్కటే చివరగా ఒక్క మాట మనం చూస్తున్న ఈ రంగుల ప్రపంచం ఒక కల లాంటిది. రాజకీయం, వ్యాపారం, బంగారం, ఆకర్షణ, బంధాలు ఇవన్నీ మాయ వేసే ఎరలు. ఆ ఎరలో చిక్కుకోకుండా జీవితం అనే సముద్రాన్ని ఈదాలి. బంధాలు ఉండాలి. కానీ అవి బంధనాలు కాకూడదు.
(18:13) బాధ్యతలు ఉండాలి. కానీ అవి భారాలు కాకూడదు. కబీర్ దాస్ చెప్పిన ఆ మూడు రంగుల దారాలను తెంచుకొని సత్యం వైపు అడుగు వేద్దాం. ఈ మాయా లోకాన్ని చూసి మోసపోకండి. మేల్కొనండి. సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యమే మిమ్మల్ని శాంతి వైపు తీసుకెళ్తుంది. ఎండమావులను చూసి నీళ్లుు అనుకొని పరిగెత్తడం మానేసిన రోజే మనకు నిజమైన శాంతి లభిస్తుంది.
(18:36) సత్యమే పరమాత్మ, సత్యమే ఆనందం. ఈ వీడియో మీకు నచ్చితే, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న మాయా అనుభవాలను కింద కామెంట్ చేయండి. ఈ నిజాన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వారిని మేల్కొలపండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
(19:05) రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(19:30) అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసిన అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment