Wednesday, April 8, 2026

******ధర్మపథం: గృహిణి గొప్పతనం - ఆధునిక స్వేచ్ఛా మాయాజాలం​. #drpasupathirajgurejala

ధర్మపథం: గృహిణి గొప్పతనం - ఆధునిక స్వేచ్ఛా మాయాజాలం​. #drpasupathirajgurejala

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=R9WgDU7m1IU



Transcript:
(00:00) ఇప్పటివరకు మనం మన క్రిందటి వీడియోస్ లో సమాజంలో ఉన్న మురికిని అధర్మాన్ని, పతనాన్ని విశ్లేషించాం. కానీ ఈ చీకటి అంతా చూసిన తర్వాత మీకు ఒక సందేహం రావచ్చు. అసలు ఈ లోకంలో ధర్మం అనేది ఇంకా ఉందా అందరూ ఇలాగే తయారయ్యారా అని ఖచ్చితంగా లేదు. ఒకవైపు అధర్మం తన వికృత రూపం చూపిస్తుంటే మరోవైపు నిశబ్దంగా అపారమైన సహనంతో అంకిత భావంతో ఈ సమాజాన్ని ఇంకా నిలబెడుతున్నది మన ధర్మబద్ధమైన స్త్రీలే ఇప్పటికీ తన కుటుంబం కోసం తన బిడ్డల భవిష్యత్తు కోసం నిశశబ్దంగా శ్రమిస్తున్న పవిత్రమైన గృహిణులు ఎంతో మంది ఉన్నారు.
(00:39) సో ఈ వీడియోను చివరివరకు చూడండి. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక వ్యక్తి గురించి కాదు ధర్మబద్ధమైన స్త్రీ పవిత్రమైన గృహిణి సంస్కారవంతమైన మహిళల గొప్పతనం మరియు ఆధునిక స్త్రీ యొక్క వినాశక బుద్ధుల పరిష్కార మార్గాల గురించి చూద్దాం ఇది మన సమాజం గురించి మన కుటుంబాల గురించి ముఖ్యంగా మన భావితరాల గురించి మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ ఆలోచనలో ఒక మార్పు రావచ్చు మీ కుటుంబంలో ఒక మార్పు మొదలవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ మీడియాలో
(01:20) రీల్స్ చేస్తూ గ్లామర్ ప్రదర్శించే ఆడవాళ్ళు కేవలం 1 శాతం లేదా 2 శాతం మాత్రమే ఉంటారు. కానీ వారు చేసే శబ్దం వల్ల వారు సంపాదించే ఆ పాపపు ధనం వల్ల అందరూ అలాగే ఉన్నారేమో అనే భ్రమ కలుగుతోంది. కానీ మన కళ్ళ ముందు మన ఇంట్లో మన పక్కింట్లో ఇప్పటికీ ఎంతో మంది గొప్ప ఆడవాళ్ళు ఉన్నారు. వారికి లక్షల్లో ఫాలోవర్స్ ఉండకపోవచ్చు.
(01:45) వారు బ్రాండెడ్ బట్టలు వేసుకోకపోవచ్చు. వారు ఖరీదైన రెస్టారెంట్లలో తింటూ ఫోటోలు పెట్టకపోవచ్చు. కానీ వారు ఉదయాన్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తమ కుటుంబం కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆ శ్రమలో ఉన్న పవిత్రత ముందు ఈ సోషల్ మీడియా కోర్ట్లో దిగదుడుపు. ఒక ధర్మబద్ధమైన స్త్రీ ఒక ఇంటికి ఎలా వెన్నెముకగా ఉంటుందో చూడండి.
(02:09) భర్త సంపాదన 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఆ ఉన్నదానిలోనే తృప్తి చెందుతూ ఇంటిని నందన వనంలా తీర్చిదిద్దుతుంది. పక్కింటి ఆవిడకు అది ఉంది. నాకు కావాలి అనే అసూయ ఆమెలో ఉండదు. తన భర్త కష్టపడి తెచ్చిన ఆ రూపాయికి ఆమె గౌరవం ఇస్తుంది. ఆ రూపాయిలో ఆమెకు భర్త చెమట కనిపిస్తుంది కానీ కేవలం ఒక కాయిత ముక్క కనిపించదు.
(02:32) ఇటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆమె ముఖంలో ఉండే ఆ ప్రశాంతత ఆ తేజస్సు వేల మేకప్ కిట్లు వేసుకున్న ఆ సోషల్ మీడియా స్టార్ల ముఖాల్లో కనిపించదు. ఎందుకంటే ఆ ప్రకాశం ధర్మం నుండి పుట్టింది. సైకాలజీలో అల్ట్రిస్టిక్ పర్సనాలిటీ అనే ఒక పదం ఉంది. అంటే తనకంటే తన కుటుంబం తన పిల్లల క్షేమం కోరే మనస్తత్వం. ధర్మబద్ధమైన స్త్రీకి తన శరీరం ఒక ఆస్తి కాదు.
(02:56) అది ఒక పవిత్రమైన క్షేత్రం. ఆమె తన అందాన్ని అపరిచితుల చూపుల కోసం వాడదు. కేవలం తన భర్త పట్ల ఉన్న అనురాగానికి చిహ్నంగా చూస్తుంది. ఆమె తన సమయాన్ని వ్యూస్ కోసం వెచ్చించదు. తన పిల్లలకు మంచి కథలు చెప్పడానికి వారికి సంస్కారం నేర్పడానికి కేటాయిస్తుంది. ఈరోజు మన సమాజంలో డాక్టర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు తయారవుతున్నారు అంటే వారి వెనుక ఇటువంటి ధర్మబద్ధమైన తల్లుల పెంపకం ఉంది.
(03:23) వారు తమ కోరికలను చంపుకొని పిల్లల ఉన్నత స్థితి కోసం తప్పించిన త్యాగమూర్తులు. మన శాస్త్రాల్లో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. కార్యేషు, దాసి, కరణేషు, మంత్రి, రూపేషు, లక్ష్మీహ క్షమయ ధరిత్రి, భోజ్యేషు, మాతా సయనేషు, రంభ షడ్ధర్మ యుక్త కులధర్మ పత్ని దీని అర్థం కేవలం సేవ చేయడం కాదు ఒక పనిలో దాసిల చురుకుగా ఉండటం ఆలోచనలో మంత్రితో సమానమైన వివేకం కలిగి ఉండటం, అందంలో లక్ష్మిల పవిత్రంగా ఉండటం, ఓర్పులో భూదేవితో సమానంగా ఉండటం ఇటువంటి ఆరు గుణాలు ఉన్న స్త్రీని కులధర్మ పత్ని అన్నారు.
(04:05) నేటి కాలంలో ఇలాంటి స్త్రీలు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఆఫీసులో పని చేస్తూనే ఇంటిని చక్కదిద్దే మహిళలు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించే తల్లులు చదువుకోకపోయినా నీతిగా బతకాలని చెప్పే అమ్మమ్మలు వీరంతా ఈ కోవకే చెందుతారు. వీరి పాదాల దగ్గర ఉండే ధర్మం ముందు ఈ ప్రపంచంలోని సంపద అంతా చిన్నదే చూడండి మిత్రులారా ఒక స్త్రీ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఆమె పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు.
(04:31) వారికి ఆడవాళ్లంటే గౌరవం ఉంటుంది. వారు పెద్దయ్యాక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు అవుతారు. అంటే ఒక స్త్రీ తన ప్రవర్తన ద్వారా ఒక ఉత్తమ తరాన్ని నిర్మిస్తోంది. అదే సోషల్ మీడియాలో ఎగిరే స్త్రీ ఏం చేస్తోంది కేవలం కామాన్ని. అసూయను ఆడంబరాన్ని మాత్రమే సమాజంలోకి నింపుతోంది. ధర్మబద్ధమైన స్త్రీ సంపాదించేది మర్యాద. అధర్మ మార్గంలో వెళ్లే స్త్రీ సంపాదించేది కేవలం డబ్బు డబ్బు ఖర్చైపోతుంది.
(04:59) కానీ మర్యాద తరతరాలకు నిలిచిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ధర్మబద్ధమైన స్త్రీకి స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసు ఆమెకు అదుపు లేనితనం స్వేచ్ఛ కాదు బాధ్యతతో కూడిన స్వతంత్రత స్వేచ్ఛ. ఆమె బయట ప్రపంచంలోకి వెళ్ళిన తన హద్దులను తాను గీసుకుంటుంది. ఆ హద్దులే ఆమెకు రక్షణ కవచాలు. ఒక గృహిణిగా ఆమె ఇంట్లో చేసే పనిని తక్కువగా చూడకండి. ఒక దేశాన్ని పాలించే రాజు కంటే ఒక ఇంటిని ధర్మబద్ధంగా పాలించే గృహిణి గొప్పది ఎందుకంటే రాజు ప్రజలను పాలిస్తే గృహిణి రేపటి పౌరులను తయారు చేస్తుంది.
(05:34) ఆధునిక కాలంలో హౌస్ వైఫ్ అనే పదానికి కొంతమంది చిన్నచూపు చూస్తారు. కానీ నిజానికి ఆమె ఒక హోమ్ మేకర్ ఆమె ఇంటిని మాత్రమే కాదు సమాజం యొక్క నైతికతను నిర్మిస్తుంది. తల్లి సంస్కారవంతురాలు అయితే ఆ ఇంట్లో తండ్రికి మనశశాంతి ఉంటుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అధర్మంగా సంపాదించే కోట్లు ఉన్నా ప్రశాంతత లేని ఇళ్లు ఎన్నో ఉన్నాయి.
(05:58) కానీ కష్టపడి సంపాదించిన 10 రూపాయలతో భర్తతో పంచుకొని పిల్లలకు ప్రేమతో అన్నం పెట్టే ఆ గృహిణి ఇంట్లో ఉండే తృప్తి వెలకట్టలేనిది. ఆ తృప్తి నుండే నిజమైన సుఖం పుడుతుంది. మరి ఈ అధర్మం నుండి మనం బయట పడటం ఎలా కేవలం విమర్శిస్తే సరిపోదు. మార్పు మన నుండే మొదలవ్వాలి. నైతిక విద్య. మన పిల్లలకు డబ్బు కంటే నైతిక విలువలు గొప్పవని నేర్పాలి.
(06:23) డిజిటల్ అవేర్నెస్ సోషల్ మీడియా అల్గారిథమ్స్ యువతను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పురుషుల బాధ్యత మగవాళ్ళు తమ చూపును నియంత్రించుకోవాలి. మీరు ఎంకరేజ్ చేయకపోతే అక్కడ ప్రదర్శన ఆగిపోతుంది. చట్టాల సంస్కరణ, విడాకులు, భరణం పేరుతో జరిగే దూపిడీని అరికట్టేలా చట్టాలు పటిష్టం కావాలి. మిత్రులారా ఈ మొత్తం విశ్లేషణ ఎవరినో కించపరచడానికి కాదు.
(06:46) నిజాన్ని నిర్భయంగా మీ ముందు ఉంచడానికి మాత్రమే స్త్రీలు తమ అసలైన గౌరవాన్ని గుర్తించాలి. మగవాడు తన బాధ్యతను తెలుసుకోవాలి. సమాజం తన కళ్ళను కప్పిన ఆ రంగు కాగితాల మాయ నుండి బయటకు రావాలి. మన శాస్త్రం ఒక గొప్ప సత్యం చెబుతుంది. ధర్మ ఏవహతో హంతి ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం చంపితే ఆ ధర్మమే మనల్ని చంపుతుంది.
(07:11) అదే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీలో కనీసం ఒక్కరి ఆలోచన మారినా ఒక్క కుటుంబం పతనం కాకుండా ఆగిపోయినా అది ఈ విశ్లేషణ సాధించిన విజయమే. నిజాన్ని చెప్పడం నా ధర్మం. దాన్ని పాటించడం మీ విజ్ఞత. భవిష్యత్తు తరాలకు మనం ఒక నీతివంతమైన సమాజాన్ని ఇద్దాం. అధర్మాన్ని ఎదిరిద్దాం ధర్మాన్ని రక్షిద్దాం. డెఫినిషన్ ఆఫ్ ఫ్రీడమ్ లాజికల్ గా వాస్తవాలను ఎండగడుతూ పదునైన విశ్లేషణతో ఇప్పుడు మనం ఒక అత్యంత వివాదాస్పదమైన కానీ ప్రాథమికమైన పాయింట్ దగ్గరకు వద్దాం.
(07:47) అదే స్వేచ్ఛ ఫ్రీడమ నేటి కాలంలో చాలా మంది ఆడపిల్లలు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంలో ఉన్నవారు స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారంటే అర్ధరాత్రి రోడ్ల మీద తిరగడం, తాగడం, ఊగడం లేదా బట్టలు విప్పి ప్రపంచం ముందు డాన్సులు చేయడం. ఇది స్వేచ్ఛ అని వారు బలంగా నమ్ముతున్నారు. కానీ మిత్రులారా ఇది స్వేచ్ఛ కాదు ఇది ఉన్మాదం. ఇది ఒక రకమైన మానసిక బానిసత్వం.
(08:13) అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎవరికీ భయపడకుండా నీ ధర్మాన్ని పాటించగలగడం. నీ మేధస్సుతో ప్రపంచాన్ని శాసించడం నువ్వు నీ శరీరాన్ని ప్రదర్శించకపోయినా నీ మాటతో నీ జ్ఞానంతో 10 మందిని ప్రభావితం చేయగలగడం కానీ ఈరోజు స్త్రీలు శరీర ప్రదర్శన అనే బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది మగవాడు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఇచ్చే డిజిటల్ జైలు నువ్వు నీ బట్టలు విప్పుతుంటే వాడు వ్యూస్ ఇస్తున్నాడు.
(08:41) అంటే వాడు నిన్ను నియంత్రిస్తున్నాడు. వాడు ఏది చూపిస్తే డబ్బులు ఇస్తాను అంటాడో నువ్వు అదే చూపిస్తున్నావు. ఇక్కడ నీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది నువ్వు కేవలం మగవాడి కోరికలకు అనుగుణంగా ఆడే బొమ్మవు నిజమైన స్వతంత్రురాలివి అయితే నీ శీలాన్ని నీ గౌరవాన్ని కాపాడుకుంటూనే నీవు ఎదిగి చూపించు అప్పుడు నిన్ను ఈ ప్రపంచం గౌరవిస్తుంది.
(09:02) సైన్స్ పరంగా ఆలోచిస్తే ఈ స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న విచ్చల విడితనం సమాజంలో సెరోటోనిన్ స్థాయిలను తగ్గించి కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ పెంచుతోంది. ఎందుకంటే ఒక స్త్రీ తన ప్రైవసీని కోల్పోయినప్పుడు ఆమె అంతర్గతంగా ఒక అభద్రతా భావానికి లోనవుతుంది. ఆ అభద్రతను కప్పిపుచ్చుకోవడానికే ఆమె ఇంకా ఇంకా ఎక్కువ ప్రదర్శన ఇస్తుంది. ఇది ఒక విష వలయం. నిజమైన స్వేచ్ఛ నీ మనసులో ఉండాలి.
(09:27) నీ ప్రవర్తనలో ఉండాలి. నువ్వు ఒక అపరిచితుడి కామపు చూపులకు బానిసవవుతూ నేను స్వతంత్రురాలిని అని అరవడం ఆత్మ వంచన. మగవాడు నిన్ను ఒక వస్తువుగా చూస్తున్నాడంటే దానికి నువ్వు ఇస్తున్న అవకాశమే కారణం వేదకాలంలో స్త్రీలకు ఎంతో స్వేచ్ఛ ఉండేది వారు శాస్త్ర చర్చలు చేసేవారు యుద్ధాలు చేసేవారు రాజ్యాలు పాలించేవారు కానీ ఆ స్వేచ్ఛలో ఒక గౌరవం ఉండేది గార్గి మైత్రేయి వంటి విదుషి మణులు తమ మేధస్సుతో గొప్ప గొప్ప పండితులనే ఓడించారు.
(10:00) వారు ఎక్కడా తమ శరీరాన్ని ప్రదర్శించలేదు. వారి జ్ఞానమే వారి ఆభరణం. నేడు మీరు ఆ జ్ఞానాన్ని వదిలేసి కేవలం చర్మాన్ని చూపిస్తూ ఇది మోడరనిజం అంటున్నారు. ఇది ప్రగతి కాదు ఇది తిరోగమనం మీరు నాగరికతలో వెనక్కి వెళ్తున్నారు. అసలైన స్వేచ్ఛ నీకు కాదు అని చెప్పే ధైర్యాన్ని ఇవ్వాలి. నేను డబ్బు కోసం నా గౌరవాన్ని అమ్ముకోను అని చెప్పగలగడమే నిజమైన స్వేచ్ఛ.
(10:25) నేను వ్యూస్ కోసం నా సంస్కారాన్ని వదులుకోను అని నిలబడడమే అసలైన శక్తి. కానీ దురదృష్ట వసత్తు. నేటి యువత స్వేచ్ఛను కేవలం అదుపు లేనితనంగా భావిస్తోంది. హద్దులు లేని నది ఊరిని ఎలా ముంచుతుందో హద్దులు లేని స్వేచ్ఛ సమాజాన్ని అలా నాశనం చేస్తుంది. సో మగవాడు తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఒకప్పుడు శారీరక బలాన్ని వాడేవాడు. కానీ నేడు వాడు మీ స్వేచ్ఛ వాంఛను వాడుకుంటున్నాడు.
(10:54) నువ్వు స్వేచ్ఛగా ఉండు బట్టలు విప్పు డాన్స్ చెయ్ అని వాడు మీకు లైక్స్ ఇస్తున్నాడు. ఎందుకు ఎందుకంటే వాడికి అది వినోదం మీ పతనం వాడికి వ్యాపారం మీరు వాడి వ్యాపారంలో పెట్టుబడిగా మారుతున్నారనే స్పృహ మీకు ఉందా మీ స్వేచ్ఛ మగవాడి జేబులు నింపుతుంటే అది మీ స్వేచ్ఛ ఎలా అవుతుంది అది వాడి విజయం మీ పరాజయం కాబట్టి స్వేచ్ఛకు సరైన నిర్వచనం తెలుసుకోండి.
(11:19) స్వేచ్ఛ అంటే నీ ఇంద్రియాలకు బానిస అవ్వడం కాదు నీ ఇంద్రియాలను జయించడం నీ శరీరం మీద నీకు అధికారం ఉండాలి అంటే దాన్ని ఎవరికీ పడితే వారికి చూపించకూడదు. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నువ్వు నిజమైన స్వతంత్రురాలివి. ఈ ప్రపంచం నిన్ను తలవంచి గౌరవించేలా నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకో అప్పుడు నీవు వేసే ప్రతి అడుగు ఒక చరిత్ర అవుతుంది.
(11:40) లేదంటే సోషల్ మీడియాలో వచ్చే మిలియన్ల వ్యూస్ లో నీవు ఒక అనామకమైన వస్తువుగా మిగిలిపోతావు. నిర్ణయం నీదే. స్వేచ్ఛ కావాలా లేక ఉన్మాదం కావాలా? భావి తరాలపై ప్రభావం మరియు మన మానవ వంశ వినాశనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే చివరి మరియు అత్యంత కీలకమైన అంశం మన పిల్లలు మన భవిష్యత్తు అధర్మంగా సంపాదించే స్త్రీలారా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు చేసే పనులు కేవలం మీతో ఆగిపోవు అవి మీ రక్తంలోకి మీ వంశంలోకి ఇంకిపోతాయి.
(12:13) మీరు సంపాదించే ఆ పాపపు సొమ్ము మీ ఇంట్లో పెరిగే పసిపిల్లల మనస్తత్వాలను ఎలా విషపూరితం చేస్తుందో మీరు ఊహించలేరు. ఒక తల్లి తన శరీరాన్ని అమ్ముకుని లేదా ఎదుటి వాడిని మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటే ఆ ఇంట్లో పెరిగే ఆడపిల్ల అదే కరెక్ట్ అనుకుంటుంది. మగపిల్లవాడు ఆడవాళ్ళను కేవలం ఒక వస్తువులా చూడటం మొదలు పెడతాడు. సైకాలజీలో అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనే సిద్ధాంతం ఉంది.
(12:41) పిల్లలు మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి ఎక్కువ నేర్చుకుంటారు. తల్లి గ్లామర్ కోసం పడే తపనను డబ్బు కోసం ఆమె చేసే దిగజారుడు పనులను చూసిన బిడ్డకు నీతి మీద నమ్మకం పోతుంది. కష్టపడి పని చేయడం కంటే అడ్డదారులు తొక్కడమే సులభం అనే భావం వారి మనసులో బలంగా నాటుకుపోతుంది. మీరు ఒక వంచక తరాన్ని తయారు చేస్తున్నారు. అధర్మ సంపాదనతో పెరిగే పిల్లలకు ఏ రోజు తృప్తి ఉండదు. వారికి విలువలు ఉండవు.
(13:08) రేపు ఆ పిల్లలే ఆ డబ్బు కోసం మిమ్మల్ని కూడా మోసం చేస్తారు. ప్రకృతి నియమం ప్రకారం మీరు ఈరోజు సమాజంలోకి ఏ విషాన్ని వదులుతున్నారో రేపు అదే విషం మీ వంశాన్ని దహిస్తుంది. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు తల్లిని చూసి కూతురిని తీసుకో అని ఎందుకు ఎందుకంటే తల్లి ఇచ్చే సంస్కారమే ఆ బిడ్డ జీవితానికి పునాది. నేడు ఆ పునాదులే కదిలిపోతున్నాయి.
(13:31) తల్లి సోషల్ మీడియాలో ఎగురుతుంటే కూతురు అంతకంటే ఎక్కువగా ఎగురుతోంది. ఒకప్పుడు తల్లులు పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నీతి కథలు చెప్పేవారు. ఈరోజు తల్లులు పిల్లలకు రీల్స్ ఎలా చేయాలి? కెమెరా ముందు ఎలా ఫోజులు ఇవ్వాలి అని నేర్పిస్తున్నారు. ఇది ఎంతటి దౌర్భాగ్యం మీరు మీ పిల్లలకు ఐఫోన్ ఇస్తున్నారు. బ్రాండెడ్ బట్టలు ఇస్తున్నారు.
(13:55) కానీ వారికి కావాల్సిన క్యారెక్టర్ ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అధర్మంగా సంపాదించే రూపాయి మీ ఇంట్లోకి వస్తే అది శాంతితో రాదు అది రోగాలతో గొడవలతో మనస్పర్ధలతో వస్తుంది. అన్యాయంగా సంపాదించిన ధనం పదే ఏళ్ళు బాగున్నట్లు అనిపించిన 11 ఏడు వచ్చేసరికి అసలతో సహా సర్వనాశనం అవుతుంది అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆ వినాశనం మీ పిల్లల రూపంలోనే రావచ్చు మీరు సంపాదించిన కోట్లు మీ పిల్లల వ్యసనాలకు వారి దుర్మార్గాలకు ఖర్చువుతాయి తప్ప వారికి ఉపయోగపడవు సంపాదనలో పవిత్రత లేకపోతే ఆ వంశం నిలబడదు.
(14:29) మీ బిడ్డలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ వారు తల ఎత్తుకొని తిరిగేలా ఒక గొప్ప చరిత్రను ఇవ్వండి. ఒక్కసారి ఆలోచించండి రేపు మీ బిడ్డకు పెళ్లి సంబంధం వస్తే మీ గత ప్రవర్తన గురించి ఆ అవతలి వారు ప్రశ్నిస్తే మీ బిడ్డ తలదించుకోవాలా ఆమెకు ఆ పరిస్థితిని కల్పించింది ఎవరు? మీరే కదా మీ క్షణికమైన ఆడంబరం కోసం ఆ వ్యర్థమైన లైక్స్ కోసం మీ బిడ్డ భవిష్యత్తును బలిపెడుతున్నారు.
(14:55) తల్లి అంటే ఒక త్యాగమూర్తి ఒక మార్గదర్శి కానీ ఈరోజు తల్లులు తమ స్వార్థం కోసం తమ లగ్జరీ కోసం పిల్లల సంస్కారాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది కేవలం మీ వ్యక్తిగత విషయం కాదు ఇది ఒక దేశం యొక్క భవిష్యత్తు మీద జరుగుతున్న దాడి. మిత్రులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ పిల్లలకు మీరు ఇచ్చే అతి పెద్ద ఆస్తి మీ సంస్కారం. మీ ప్రవర్తనను చూసి వారు గర్వపడేలా ఉండండి మా అమ్మ చాలా గొప్పది ఆమె ధర్మబద్ధంగా బతికింది అని వారు చెప్పుకోగలిగినప్పుడు మీరు నిజంగా సార్ధకత పొందుతారు లేదంటే మీరు సంపాదించిన ఈ కోట్లు ఈ బిల్డింగలు ఏవి వారిని కాపాడలేవు అధర్మపు పునాదుల మీద
(15:32) కట్టిన ఏ భవనమైనా కూలిపోవాల్సిందే మీ వంశం నిలబడాలి అంటే మీ సంపాదనలో పవిత్రత ఉండాలి. ముగింపుగా నా విశ్లేషణలో నేను చెప్పేది ఒక్కటే ఈ వీడియో ముగింపులో నేను చెప్పేది ఒక్కటే స్త్రీ ఈ ఇంటికి ఈ సమాజానికి వెన్నెముక ఆ వెన్నెముక బలంగా ఉంటేనే దేశం బాగుంటుంది. మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీ పిల్లల భవిష్యత్తును కాపాడండి.
(15:57) అధర్మ సంపాదనను తిరస్కరించండి. ధర్మబద్ధమైన జీవితాన్ని స్వీకరించండి. మన సంస్కృతిని మనమే కాపాడుకుందాం. భావితరాలకు ఒక గొప్ప వారసత్వాన్ని అందిద్దాం. చివరిగా మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చేసిన విశ్లేషణ కేవలం సమాజంలో పెరుగుతున్న అధర్మ సంపాదన మరియు మారుతున్న విలువలను ఎత్తిచూపడానికే అంతేకానీ ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేయాలని లేదా ఒక జెండర్ కు సపోర్ట్ చేస్తూ మరొకరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు.
(16:33) ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి నేను లేడీస్ గురించి మాట్లాడినప్పుడు కేవలం ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని భావించవద్దు. ఇది మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులపై చేసిన ఒక నిష్పక్షపాత విశ్లేషణ మాత్రమే. కాబట్టి నా మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే దయచేసి వాటిని కేవలం ఒక సామాజిక దృక్పదంతో మాత్రమే చూడవలసిందిగా కోరుతున్నాను.
(17:03) మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(17:31) అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment