*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🕉️ *కుండలిని ------> శ్రీ శార్వరి*🕉️
🔺 *చాప్టర్ --13:--- బ్రహ్మచర్యం* 🔺
🌹 *Part --3*🌹
🔹 యోగ శరీరాలలో ప్రతిదానికి తనలోపలున్న 3 శరీరాల ఎరుక ఏర్పడుతుంది. జ్ఞానం కలుగుతుంది. ముందుగా భౌతిక శరీరాన్ని తీసుకుందాం: యోగం చేసినప్పుడు భౌతిక ప్రజ్ఞ చెడకుండా భావ, భూత, మానస శరీరాల గురించి అవగాహన ఏర్పడుతుంది. భౌతిక శరీరస్పృహ పోగానే భావ శరీరం పైకి వస్తుంది. అధికారం చేతికి తీసుకుంటుంది. భావ శరీరంలో అనాహతం తర్వాతిదైన విశుద్ధి చక్రం వరకు జ్ఞానం కలిగిస్తుంది. అనగా ఆత్మ శరీరాన్ని స్పృశించగలదు భావ శరీరం. ఆ పైకి పోదు. భూత శరీరం కూడా విశుద్ధి వరకే పయనిస్తుంది. భావ, భూత శరీరాలు స్వాధిష్టానం పరిధిలోవి. ఆ తర్వాతిదైన మానస శరీరం సాధించిన యోగి, అంటే అనాహత కేంద్రాన్ని చేరిన సాధకుడు బ్రహ్మలోకం వరకు అంటే ఆజ్ఞా చక్రం వరకు వెళ్లగలడు. ఆ పై నున్న నిర్వాణ సుఖాన్ని చవిచూస్తాడు. అనాహత కేంద్రం తర్వాత శరీరాల అవసరం లేదు. శరీరాలు ఉండవు.
🔸 శక్తిపాతం జరిగేది భావ శరీరంపైనే అయినా, అది జరిగినట్లు గ్రహించేది ఇంద్రియాలు కనుక, ఆ పని భౌతిక శరీరంపైన జరిగినట్లు భావిస్తాం. భావన ప్రధానం అయినంత కాలం ఆ క్రియ జరిగేది భావ శరీర వేదికపైనే. మిగిలిన శరీరాలు ఎంత శక్తివంతాలైనా వాటికి వాహిక భౌతిక శరీరమే. మిగిలినవన్నీ సూక్ష్మశరీరాలు, కనిపించవు. ఈ సూక్ష్మ శరీరాలకు సంబంధించిన శక్తులు ఏవైనా ఇటు కుండలిని ఆధారంతో భౌతిక శరీరం ద్వారా బయట పడతాయి. లేదా అటు సహస్రారం ద్వారా బయటకు వస్తాయి. భౌతిక శరీరం ద్వారా అందుకోగలిగినప్పుడు అది శక్తిపాతం అవుతుంది. సహస్రార కేంద్రం ద్వారా అందుకున్నప్పుడు అనుగ్రహం అవుతుంది.
🔹నిజానికి భౌతిక, భావ, భూత శరీరాలు మానస శరీరంలోని సగభాగం, అనగా రూపం వరకు ఫిజికల్ గా చెప్పవచ్చు. ఇందులో భౌతిక శరీరం నశించినా మిగిలిన 3 శరీరాలు చాలాకాలం మనగలుగుతాయి. ఫిజికల్ ఇమ్మెర్టాలిటీ అంటే ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి చిరకాలం మనగలిగినా ఇమ్మోర్టాలిటీయే అవుతుంది. ఉదాహరణకు, మనం మాస్టరుగారి భావాల్ని అందుకోగలిగినా, రూపాన్ని చూడగలిగినా, మాస్టర్ గారు ఫిజికల్లీ ఇమ్మోర్టల్ అనే అర్ధం.
🔸 *ఉదాహరణకు :* ఇప్పుడు నా నుండి శక్తిపాతం జరిగింది అనుకుంటే అది నా భౌతిక శరీరం ద్వారానే జరిగినట్లు - స్పందన కానివ్వండి, వైబ్రేషన్ కానివ్వండి. శక్తి కానివ్వండి. అది నా ఎదురుగా వున్న వ్యక్తిలోకి ప్రవహిస్తుంది, స్పందన కలిగిస్తుంది. ఆ కలగటంలోనూ మూడు రకాలున్నాయి - 1)భావ శరీరాన్ని స్పృశించినప్పుడు, 2)భూత శరీరంతో సంబంధం ఏర్పడినప్పుడు, 3)మానస శరీరంపై ప్రభావం కలిగినప్పుడు చర్యలు భిన్నంగా ఉంటాయి.
🔹 ఈ స్పందన పురుషులలో కన్న స్త్రీలలో వేగంగా, తొందరగా జరుగుతుంది. స్త్రీకి సమర్పణ సులభం. స్త్రీ ఎప్పుడూ సమర్పణ భావంతోనే వుంటుంది. పురుషునిలో ప్రతిఘటన ఎక్కువ. ముందుగా ప్రతిఘటించి, తర్వాత తలవంచడం పురుష లక్షణం. పురుషులలో సమర్పణే కాదు అంకితభావమూ తక్కువే. అనుమానం, అహంకారం ఉన్నంతకాలం సమర్పణ సాధ్యం కాదు. అందువల్ల పురుషుల విషయంలో శక్తిపాతం కాస్త ఆలస్యం అవుతుంది. చాలా శ్రమతో గాని పురుషుల విషయంలో శక్తిపాతం సాధ్యపడదు. పూర్తిగా సరెండర్ అయినవారి విషయం వేరు. వారిలోకి శక్తిపాతం జరపడం సులభమే. ఎంత వినయం, విధేయత కనబరచినా పురుషునిలో *'అహం'* పాలు ఎక్కువ. అది ఒక పట్టాన మెట్టు దిగదు. తన వ్యక్తిత్వమే గొప్ప అనుకుంటారు. *'నేను'* అనేది పోతేనే సమర్పణ సాధ్యం. సమర్పణ జరిగితే తప్ప శక్తిపాతం సాధ్యం కాదు.
🔸 పురుషులు సరెండర్ కావడమే జరిగితే అది ప్రాయికంగా భావ శరీర లక్షణం అవుతుంది. పురుషుని భావ శరీరానికి సహజ స్త్రీ గుణాలుంటాయి. అంటే పురుషుడు భౌతిక శరీరం మొరాయించి ఎదురు తిరిగినా భావపరంగా సరెండర్ కాగలడు. అది గురు స్థానంలోని వ్యక్తి అంతర్దృష్టితో గ్రహిస్తాడు. సహజస్వభావం వల్ల, నైజం వల్ల స్త్రీ భగవంతునికి, పరమాత్మకు సరెండర్ అవుతుంది. పురుషుని విషయంలో ప్రతిఘటిస్తుంది. అది సహజం. అందుకే స్త్రీలలో శక్తిపాతం సులభం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
📕📗 *కుండలిని శార్వరి గారి పుస్తకం* మరియు *ఇతర అధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి whats app msg చేయగలరు📔📙
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🕉️ *కుండలిని ------> శ్రీ శార్వరి*🕉️
🔺 *చాప్టర్ --13:--- బ్రహ్మచర్యం* 🔺
🌹 *Part --4*🌹
🔹ఎంతటి మహా శక్తినైనా, అది ఎంత తీవ్రంగా వున్నా, స్త్రీ స్వీకరించి భరించగలదు, నిబ్బరంగా ఉండగలదు. అదే పురుషుడు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతుంటాడు. స్త్రీ ఎంతటి శక్తినైనా తీసుకుని తనలో భద్రంగా దాచుకోగలదు. తిరిగి ఇతరులకు పంచి ఇవ్వడం జరగదు. దానిని ప్రేమగా, అనురాగంగా, కరుణగా మార్చుకుంటుంది. పురుషులలో కారుణ్యం, అనురాగం, ప్రేమ తక్కువగా కనిపిస్తాయి. ఉన్నా పురుషాహంకారం వాటిని సున్నితంగా మననీయదు. అందువల్లనే మహర్షులైనా, మహా యోగులైనా పురుషులు కఠినంగా ప్రవర్తిస్తారు. కరకుగా మాట్లాడతారు, లేదా అసలు మాట్లాడరు.
🔹 అనుగ్రహానికి, శక్తిపాతానికి తేడా ఉండదు. అనాహత కేంద్రం నుండి శక్తి ఒక స్పందనగా, అదృశ్యంగా విడుదలైతే అది అనుగ్రహం అవుతుంది. అది సాధకునికి తెలియదు. పురుషుని 4 వ శరీరం అంటే మానవ శరీరం స్త్రీ గుణాలతో ఉంటుంది కనుక అనుగ్రహపాత్రమవుతుంది. స్త్రీలు అనుగ్రహంతో తృప్తిపడరు. వారికి డైరెక్టు *'శక్తి పాతం'* యిచ్చిన తృప్తి అనుగ్రహం వల్ల కలగదు. వెంటనే అది అనుభూతి కలిగించాలంటే శక్తిపాతం అవసరం. పురుషులు అనుభూతితో తృప్తి చెందరు. వారికి అనుభవం కావాలి. అనుభవం అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఒకరు దయతలచి యిచ్చే శక్తిని పురుష ప్రకృతి ఆమోదించదు. వాంఛించదు. గురువు అనుగ్రహం వుంటే చాలు శక్తిని తాముగా సంపాదించు కోవాలనుకుంటారు. గురువు నుండి అయినా స్త్రీ తన సహజ స్వభావంతో *'సమర్పణ'* తోనే శక్తిని స్వీకరిస్తుంది. అందువల్ల ఈ సమర్పణ ప్రాతిపదికగా భక్తిని, ప్రేమను పెంచుకుంటారు.
🔸ఆడవారిలో ఉన్నంత భక్తితత్పరత, ప్రేమానురాగాలు పురుషులలో కనిపించవు. అందువల్లనే ఎంతటి అసమర్థుడైన గురువు వద్దకైనా స్త్రీలు అధిక సంఖ్యలో చేరగలరు. స్వామీజీలు, బాబాలు తమలో పెద్దగా యోగ శక్తి, ఆధ్యాత్మికత లేకపోయినా ఆడవారిని ఆకర్షిస్తారు. వారితో వున్న ఏ కొంచెం శక్తినయినా స్త్రీలు అందుకోగలరు. పురుషులకు ఆ కొద్దిపాటి శక్తి చాలదు. వారి వద్ద శక్తిపాతం జరగదు. వారి అనుగ్రహం కలగదు. అందువలన ఆడవారు స్వతంత్రించి యోగ సాధన చేయరు. వారికి ఒక ఆసరా అవసరం. సమర్థుడు అయినా, కాకపోయినా ఒక గురువు ఆలంబన వారికి అవసరం. కనీసం జీవిత భాగస్వామి అయిన భర్త సహకారం అయినా కావాలి. కనుక ఆడవారు గురువులూ, మాస్టర్లు కావడం లేదు. 'మదర్' అవుతారు. అంటే తల్లిగా ప్రేమ పంచి పెట్టగలరు. యోగంలో బాగా పండినవారు వృద్ధాప్యంలో శక్తిపాతానికి అర్హులవుతారు. కానీ, వారి యోగ శక్తి పురుషులలోకి ప్రవహించదు. అది ప్రకృతి విరుద్ధం. వారి అనుగ్రహం మాత్రం ఎవరైనా పొందవచ్చు.
🔹 యోగ సాధనలో స్త్రీ పురుషుల మానసిక స్థితులలో భేదం వుంటుంది. స్త్రీలు ఎంతో నిర్మలంగా, నిష్కల్మషంగా మిగతా ప్రపంచాన్ని, సమస్యలను అవతల పెట్టి, ఏకాగ్రంగా ధ్యానం చేస్తారు. క్షణంలో తన్మయ స్థితికి చేరుకుంటారు. ప్రశాంత స్థితికి చేరడానికి ప్రయత్నించరు. ఏదో బలవంతంగా సాధన చేస్తున్నట్లే భావిస్తారు. గురువు కనిపించగానే లేదా గురువు సన్నిధికి రాగానే ఆడవారికి గురువు పట్ల ఆరాధన ఉబికి వస్తుంది. కళ్ళు చెమర్చి, పాదాభివందనం చేస్తేకాని స్థిమిత పడరు.
🔸 అదే మగవారు వెనకా ముందు ఆలోచిస్తారు. ఊగిసలాట ఎక్కువ. అహంకారం బయట పడుతుంది. తప్పనిసరిగా, మొక్కుబడిగా, అంటీ ముట్టనట్లు నమస్కరించి వెళ్ళిపోతారు. ఆడవారు అలా వెళ్ళిపోరు. అక్కడే గురువుకు సమీపంగా స్థానం వెతుక్కుని తన్మయంగా, ప్రశాంతంగా ఏదో ఆనందాన్ని అనుభవిస్తారు. పాదాభివందనం చేస్తే తమ ఆధిక్యత తగ్గిపోతుందని భావించే పురుషులు *'హల్లో'* అన్నట్లే ప్రవర్తిస్తారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
📕📗 *కుండలిని శార్వరి గారి పుస్తకం* మరియు *ఇతర అధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి whats app msg చేయగలరు📔📙
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🕉️ *కుండలిని ------> శ్రీ శార్వరి*🕉️
🔺 *చాప్టర్ --13:--- బ్రహ్మచర్యం* 🔺
🌹 *Part --5*🌹
🔹తలవంచనిది యోగం అబ్బదు. తలవంచడం *'తలవంపు'* కాదు. అదొక సంస్కారం విధేయత లక్షణం. విధేయత లేనివారు గురువు అనుగ్రహం ఎలా పొందగలరు! ఏ కాస్త యోగం అబ్బినా అదంతా తన కృషి ఫలితమేనని, గురువుగారి పాత్ర, ప్రమేయం లేదని అహంకరించే వారికి యోగం అబ్బదు. ఆడవారు ఎంత కాలంగా యోగం చేస్తున్న వారైనా, ఎంత శక్తి సంపాదించినవారైనా అహంకరించరు. అది గురువుగారి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం అని వినమ్రత చూపిస్తారు- *'యోగం ఇంకా సాధించవలసింది అనంతంగా వుంది, సాధించింది అత్యల్పం'* అని ప్రతి సాధకుడు అనుకుంటేనే ముందుకు పోగలడు. గర్వం, అహంకారం ప్రగతికి ఆటంకాలు.
🔸 శక్తిపాతం అటు భౌతిక శరీరంలోను, ఇటు మానస శరీరంలోను సంభవమేనని అనుకున్నాం. అది భౌతిక శరీర స్థాయిలో జరిగినప్పుడు కుండలిని ఒక్కసారిగా మేల్కొని బుసలు కొడుతుంది. నిద్రపోతున్న సర్పాన్ని తన్ని లేపినట్లవుతుంది. యోగసాధనలో క్రమవికాసం కలిగినప్పుడు అలా బుసలు కొట్టడం జరగదు. బయట శక్తి ఏదో ఒకటి దాని విషయంలో జోక్యం కలిగించుకున్నప్పుడే అది ఆగ్రహించినట్లు బుసకొడుతుంది, పడగ విప్పుతుంది. దానిని స్వాధీనం చేసుకోగల శక్తి ఉండాలి. స్వాధిష్టానం వరకు దాని ప్రతాపం చూపుతుంది. స్వాధిష్టానం ఒక విధంగా ఆరోగ్యకేంద్రం. మరొక విధంగా వాంఛా నిలయం. శారీరకమైన స్వస్థత కోల్పోవడం జరుగుతుంది. కామనలు విజృంభిస్తాయి. స్వాధిష్టాన చక్రంపై అధికారం సంపాదించగలిగితే తప్ప, లేకుంటే ఆ రెండు చాలు మనిషిని పతనం చెందించడానికి. గురువు ప్రక్కన వుంటే నాగస్వరం పట్టగలదు. ఆ త్రాచు అణగి మణగి వుంటుంది. దానిని వెంటనే కంట్రోల్ చేసి మూలాధారంలోకి పంపగలగాలి.
🔹 గురువు నుండి శక్తిపాతం జరిగినప్పుడు సాధకుడు కొన్ని నెలలు, సంవత్సరాలకుగాని పొందలేని కుండలినీ చైతన్యం నిమిషాలలో పొందడం జరుగుతుంది. ఈ శక్తిపాతాన్ని భరించి, నిలవరించడానికి మొదటి 3 శరీరాలు తయారై ఉండాలి. అందుకే *'అనుగ్రహం'* అని అంగలార్చినా, శక్తిపాతం కోరినా గురువు యివ్వడు. దానిని భరించే 3 శరీరాలు తయారు కావాలి. ఆ విషయం గురువైన వ్యక్తి గమనిస్తూ వుంటాడు. ప్రతి సాధకుని అభివృద్ధికి అవి పరీక్షలు, భౌతిక, భావ, భూత శరీరాలు రెక్టి ఫై కానప్పుడు శక్తిపాతం జరిగితే ప్రయోజనం కన్న ప్రమాదాలే ఎక్కువ.
🔸 భౌతిక సుఖాల కోసం, ప్రాపంచిక అవసరాల కోసం శక్తిని కోరేవారు భౌతిక శరీరాన్ని, దాని అవసరాలను మాత్రమే గుర్తిస్తారు. శక్తిపాతం జరిగినప్పుడు గురువు నుండి విడుదలైన శక్తి సాధకుని భౌతిక శరీరంలో ఆగిపోదు. ఆ శక్తిని భౌతిక శరీరం భరించలేదు. అక్కడ ఏ మాత్రం నిలవవున్నా ప్రమాదమే. అది భావ, భూత, మనో శరీరాలకు ప్రసరించాలి. సమంగా పంపిణీ జరగాలి. దాని వేగం అంత ఎక్కువ. భౌతిక శరీరాన్ని బోర్ చేసుకుంటూ భావ, భూత శరీరాల్ని చేరుతుంది. మానస శరీరంలో ఆ శక్తిని భద్రంగా దాచుకోగల వ్యక్తి యోగి అవుతాడు. ఆ శక్తి ఒక్కొక్క శరీరాన్ని దాటుతున్నప్పుడు సాధకుడు చాలా హైరానా పడతాడు. అనుభవాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ముందుకు పోలేడు. వెనక్కి పోడు. సాధన నుండి బయటపడలేక బిగుసుకు పోయినట్లు అవుతాడు. గురువు యాస్ట్రల్ టచ్ యిస్తే ఆ శక్తి నెమ్మదిగా అతని లోపలి సూక్ష్మశరీరాల్లోకి ప్రవహిస్తుంది. ఉపశమనం కలిగిస్తుంది.
🔹 అలా కాక, మూడు శరీరాలు బాగా సిద్ధమైనపుడు శక్తిపాతం జరిగితే సాధకునికి అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. ఆనందం అందుకోగలడు. కోరిన దేవుళ్లను, దేవతలను ప్రత్యక్షం చేసుకోగలడు. అప్సరసలతో అడుకోనూవచ్చు. అలా స్వర్గంలోని నందనవనానికి షికారు పోయి రావచ్చు. గురువుల శక్తిప్రసరణవల్ల కుండలిని చైతన్యం పొందితే సాధకుడు అనాహతం వరకు అనుభూతి చెందగలడు. ఆ తర్వాత ప్రయాణానికి స్వశక్తి అవసరం. గురువుగారి సహాయం సరిపోదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
📕📗 *కుండలిని శార్వరి గారి పుస్తకం* మరియు *ఇతర అధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి whats app msg చేయగలరు📔📙
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🕉️ *కుండలిని ------> శ్రీ శార్వరి*🕉️
🔺 *చాప్టర్ --13:--- బ్రహ్మచర్యం* 🔺
🌹 *Part --6*🌹
🔹 అనాహతం తర్వాత భయంకరమైన నైరాశ్యం ఆవహిస్తుంది. చీకట్లు క్రమ్ముకుంటాయి, దారి కనిపించదు. వెంట వస్తున్న గురువు నిష్క్రమిస్తాడు. అక్కడ ఒక చిరుదీపం వెలిగించుకోక తప్పదు. ఆ వెలుగు ఆసరాగా ఒంటరిగా ముందుకు నడవాలి. ఆత్మశక్తి పెరిగిన కొద్దీ ఈ వెలుగు పెద్దదవుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే వెలుగుబాట రాజబాట అవుతుంది. అక్కడ దృశ్యమే మారిపోతుంది. గతం జ్ఞాపకం రాదు. వెనకచూపు ఉండదు. వెనకడుగు ఉండదు. సాధకుని దృక్పథమే మారుతుంది. లక్ష్యం తెలుస్తుంది. గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు సాధకుని పూర్ణపరిణామానికి అవకాశం చిక్కుతుంది. కనుక గురువు యిచ్చే శక్తిని అంతవరకే ఉపయోగించుకోవాలి. పూర్తిగా గురుశక్తిపై ఆధారపడకుండా ప్రతిసాధకుడు స్వంతశక్తిని సమీకరించుకోవాలి.
🔸 చాలా మంది సాధకులు శ్రమపడడానికి ఇష్టపడరు. డిసిప్లిన్ అంటే భయం. వ్యసనాలకు బానిసలైనవారికి క్రమశిక్షణ, సాధన మరీ కష్టం. ఏమాత్రం శ్రమపడకుండా ఫలితాలు ఇబ్బడిముబ్బడిగా కలగాలని ఆశిస్తారు. యోగం కూడా ఉచితంగా, అప్పనంగా దొరకాలి. అలాంటి అల్పబుద్ధులకు ఏదీ రాదు. ఎవరైనా సరే శ్రమించక తప్పదు. సాధన చేయాలి. ఫలితం అనుభవించాలి. ఉచితంగా దేనినీ వాంఛించ కూడదు.
🔹 ఎప్పుడూ మనం ప్రతిఫలం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే గురుదక్షిణ అనేది ఏర్పరచారు. లోభికి, పిసినారికి యోగం అసలు అబ్బదు. వితరణ చాలా అవసరం. దయా ధర్మ గుణాలు మరీ ముఖ్యం. అర్హతలు మనం పెంచుకోవాలి. ఇతరులను చూచి, తెలుసుకొని ఆచరించాలి. అర్హతను మించి ఎవరికీ యోగం అబ్బదు. అర్హత లేనివారికి అసలు అబ్బదు. ఫలితాలు సాధనను బట్టి వుంటాయి. కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగినా, అవరోధాలు ఏర్పడినా పిరికితనంతో పారిపోకూడదు. కావాలనే గురువులు కొన్ని పరీక్షలు పెడుతుంటారు. ఆ పరీక్షల్లో నెగ్గకపోతే అంతే సంగతులు. రిజర్వేషన్ పనికిరాదు. రిజర్వ్ డ్ గా వుండేవారు గురువు అనుగ్రహానికి పాత్రులు కాలేరు. కృషి ప్రధానం, సాధన అవసరం. అప్పుడు మనం ఆశించిన దానిలో కొంతయినా దక్కుతుంది. సాధన ఎప్పుడూ వృధా కాదు. చేసుకున్న వారికి చేసుకున్నంత.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
📕📗 *కుండలిని శార్వరి గారి పుస్తకం* మరియు *ఇతర అధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి whats app msg చేయగలరు📔📙
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment