Why we are control,exploit & betray the people we loved the most||#philosophy#psychology#humannature
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x_Q1Do71MWA
Transcript:
(00:01) మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళనే ఎక్కువగా వాడుకుంటాం. ఇది వినడానికి కడువుగా ఉంది కదా కానీ ఇదే నిజం భర్త ఆఫీస్ లో బాస్ మీద చూపించలేని కోపాన్ని ఇంటికివచ్చి భార్య మీద చూపిస్తాడు. ఎందుకు బాస్ వదిలేసి పోతాడు. [సంగీతం] భార్య పోదు అని తెలుసు కాబట్టి అమ్మ లేటు గా తింటుంది. ఎందుకంటే [సంగీతం] అందరికీ వడ్డించాకే తను తింటుంది.
(00:28) పిల్లలు ఆ విషయం గమనించరు. [సంగీతం] ఎందుకంటే అది మామూలుగా మారిపోయింది. స్నేహితుడు అర్ధరాత్రి 12 ఇంటికి ఫోన్ చేసి [సంగీతం] గంటల తరబడి తన బాధలు చెప్తాడు. ఇంకో ఫ్రెండ్ కి ఫోన్ చేయడు. ఎందుకంటే వాడు వినడు. వీడు మాత్రం ఎప్పుడూ వింటాడు. ఇక్కడ పాటర్న్ గమనిస్తే [సంగీతం] మనం ఎవరిని వదిలేయమో ఎవరు మనల్ని వదిలేయరో వాళ్ళ మీదే మన అసలు భారం అంతా పడేస్తాం.
(00:55) [సంగీతం] స్ట్రేంజర్స్ మీద పడేయలేని కోపాన్ని అభద్రతని ఎక్స్పెక్టేషన్స్ ని మనం ప్రేమించే మనుషుల మీదే పడేస్తాం. క్షమించే గుణమే దోపిడికి ఆహారం అవుతుంది. [సంగీతం] ఈ విషయాన్ని అందరికంటే లోతుగా తవ్విన మనిషి జిడ్డు కృష్ణమూర్తి ఈయన బతికిన జీవితమే ఒక వైరుధ్యం [సంగీతం] చిన్నప్పుడే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఇతని ప్రపంచ గురువు అని ప్రకటించారు.
(01:21) లక్షల మంది భక్తుల్లా ఇతని వెనుక నడిచారు. కానీ 1929 లో ఆ మొత్తం ఆర్గనైజేషన్ ముందు నిలబడి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ని రద్దు చేసేసి ఇలా అన్నాడు. [సంగీతం] ట్రూత్ ఈస్ ఏ పాత్లెస్ ల్యాండ్ ఏ గురువు ఏ ఆర్గనైజేషన్ ఏ అథారిటీ నీకు సత్యాన్ని ఇవ్వలేదు అని చెప్పాడు. [సంగీతం] ఇది మామూలు మనిషి చేసే పని కాదు. లక్షల మంది తనని గాడ్లా చూస్తుంటే ఆ పొజిషన్ నే వదిలేసుకున్నాడు.
(01:51) ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం. ఇతని దగ్గర స్నేహితుడు రాజగోపాల్ భార్య రోసలిన్తో కృష్ణమూర్తికి దశాబ్దాల పాటు కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ ఉండేది. ఇది బయటకి రాకుండా చాలా ఏళ్లు గోప్యంగా ఉంచారు. డిటాచ్మెంట్ గురించి ప్రపంచానికి పాటలు చెప్పే మనిషే తన సొంత అటాచ్మెంట్ తో దాన్ని దాచడంతో కుస్తీ పట్టాడు. [సంగీతం] ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కృష్ణమూర్తి చెప్పిన అసలు పాయింట్ అర్థం కావాలంటే ఇది తెలియాలి.
(02:22) [సంగీతం] ఆయన ఇలా అన్నాడు నువ్వు ఆ మనిషిని ప్రేమించడం లేదు. ఆ మనిషి నీకు ఇచ్చే భద్రతని తోడుని [సంగీతం] గుర్తింపుని ప్రేమిస్తున్నావు. రిలేషన్షిప్ అంటే ఇద్దరు మనుషుల మధ్య ఉండేది కాదు. నీ ఇమేజ్ కి వాళ్ళ ఇమేజ్ కి మధ్య ఉండే వ్యవహారం ఆ సెక్యూరిటీని పోగొట్టుకోవడానికి వాళ్ళు మనల్ని వదిలి పెట్టరులే అని మన లోపల ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది.
(02:46) కాన్షియస్ గా కాదు సబ్కాన్షియస్ [సంగీతం] గా ఉంటుంది. కృష్ణమూర్తి దీన్ని రిలేషన్షిప్ ఈస్ ఏ మిర్రర్ అన్నాడు. ఎదుటి వాళ్ళు మనకి అద్దం లాంటి వాళ్ళు వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో చూస్తే [సంగీతం] మన లోపలి కండిషనింగ్ ఏంటో బయట పడుతుంది. ఒక ఊర్లో ఒక రైతికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవు రోజు ఇంటికి సరిపడా పాలిచ్చేది.
(03:10) రైతుకి ఆ ఆవు అంటే చాలా ప్రేమ. ప్రతిరోజు ఆవుని ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒక ఆలోచన వచ్చింది ఆ రైతుకి ఇంత మంచి ఆవు ఎటు పోదు ఇంకొంచెం మేత తగ్గిస్తే డబ్బులు మిగులుతాయి కదా అని మేత తగ్గించాడు. ఆవు అయినా పాలిస్తూనే ఉంది. కానీ తక్కువగా రైతుకి ఇంకా ధైర్యం వచ్చింది. [సంగీతం] ఆవు ఎటు పోదుగా అని ఇంకా మేత తగ్గించాడు. పైగా రోజుకి మూడు సార్లు పాలు పితకడం మొదలు పెట్టాడు.
(03:38) ఒకరోజు ఆవు లేచి నిలబడలేకపోయింది. పాలు రావడం మానేసాయి. రైతు ఏడుస్తూ ఊరందరికీ చెప్పాడు నా ఆవు నన్ను మోసం చేసిందని ఊర్లో ఒక ముసలైన నవ్వి ఇలా అన్నాడు ఆవు నిన్ను మోసం చేయలేదయ్యా నువ్వే దాని ఓపికని దోచుకున్నావు. [సంగీతం] పాలిచ్చే చేయునే కరుస్తాడు అని సామెత విన్నావా ఇక్కడ చేయి కరిచింది నువ్వే ఆవు కాదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మనైనా భార్యనైనా స్నేహితుడినైనా మనం దగ్గరైన మనిషిని ఎక్కువ దోచుకోవడానికి కారణం వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు [సంగీతం] మనకి సురక్షితం అనిపించడమే కారణం.
(04:21) వాళ్ళు వదిలి పెట్టరు అనే నమ్మకమే [సంగీతం] మనల్ని ఎంటైటిల్ గా మారుస్తుంది. కృష్ణమూర్తి చెప్పింది ఒకటే ఇది తప్పు అని జడ్జ్ చేయమని కాదు కేవలం గమనించమని అవేర్నెస్ వితౌట్ జడ్జ్మెంట్ ఎందుకంటే గమనించడమే మొదటి మార్పు జడ్జ్ [సంగీతం] చేసేస్తే దాన్ని దాచేస్తాం. కేవలం చూస్తే అది కరిగిపోతుంది. ప్రేమ అంటే వాడుకోవడం కాదు. కానీ చాలామందికి రెండిటికీ తేలా తెలియదు.
(04:51) [సంగీతం] ఎందుకంటే వాడుకోవడం కూడా ప్రేమ ముసుగులోనే వస్తుంది. [సంగీతం] ఇదే నిజం ఇదే మనుషుల మధ్య జరుగుతున్న అసలు కథ. [సంగీతం] ఓం
No comments:
Post a Comment