Dasara Navarathri Fasting | Spiritual Reasons |Nutripolitics|#shorts #ytshorts#vijayadashami#dasara
https://youtube.com/shorts/3UUUQu3g12g?si=S0ZqUCWFzaIfhoiN
కొంతమంది లేడీస్ వారానికి రెండు మూడు రోజులు ఫాస్టింగ్స్ ఉంటారు. కొంతమంది అయితే వారానికి రెండు మూడు రోజులు నాన్ వెజ్ తినరు. ఎందుకని అడిగితే వెంకటేశ్వర స్వామి కోసం అమ్మవారి కోసం ఆంజనేయ స్వామి కోసం అంటారు. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏంటి ఆ వెంకటేశ్వర స్వామికి వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇష్టమా మిగతా రోజులన్నీ ఆయనకి ఇష్టం లేదా అసలు అన్ని రోజులు క్రియేట్ చేసింది ఆయనని నువ్వే చెప్తావు కదా వారంలో రెండు మూడు రోజులు నాన్వెజ్ తినవా అంటే మిగతా రోజులన్నీ కోడిని, చేపని, రొయ్యని, మేకని, పొట్టేల్ని అడ్డంగా నరికేసి వాటికి మసాలా పెట్టేసి డీప్ ఫ్రై చేసేసి చప్పరించుకుంటూ తినమని చెప్పాడా. పొద్దు లేసిన దగ్గర నుంచి నీ చుట్టాల గురించి సాడీలు చెప్తావ్. నీ అత్త మామల గురించి సాడీలు చెప్తావ్. నీ మరిది గురించి వాళ్ళ ఆవిడ గురించి సాడీలు చెప్తావ్. ఆఫీసల కొలీగ్స్ మీద సాడీలు చెప్తావ్ ఇంటికి వస్తే అపార్ట్మెంట్ లో ఉన్న రిమైనింగ్ ఫ్లాట్ ఓనర్స్ మీద సాడీలు చెప్తావ్. హైక్ ఇవ్వలేదని టీమ్ లీడ్ మేనేజర్ ని తిడతావ్. పోలీసుని తిడతావ్, పొలిటీషియన్ తిడతావ్, లాయర్ ని తిడతావ్. మళ్ళీ ఏవి తెలియని నంగనాలాగా వారానికి మూడు రోజులు ఫాస్టింగ్ ఉంటా వారంలో మూడు రోజులు నాన్వెజ్ తినను. దేవుడా నేను చేసిన పాపాలన్నీ క్షమించి నన్ను మా ఆయన్ని నా పిల్లల్ని ఎల్లవేలలా కాపాడటం కోసం వెంకటేశ్వర స్వామికి ₹ రూపాయలు సమర్పించుకుంటా. పోనీ ఎంత యాక్టింగ్లు చేశవ్ మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా పిసిఓడి, థైరాయిడ్, సొరియాసిస్, ఎగ్జిమా, హార్ట్ స్ట్రోక్లు, క్యాన్సర్లు, ఆర్థ్రైటిస్, వెరికోస్ వీన్స్ ఫ్యాటీ లివర్లు క్రానిక్ కిడ్నీ డిసీస్లు రాకుండా ఎవరైనా కాపాడారా ఎందుకంటే నువ్వు చేసేది యాక్టింగ్లు అన్ని దేవుడికి కూడా తెలుసు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి ఎక్సర్సైజ్ చేస్తే మీ ఇంట్లో ఉన్నవాళ్ళకి రోగాలు తగ్గుతాయి కానీ నువ్వు ఫాస్టింగ్ చేస్తానో రెండు మూడు రోజులు నాన్వెజ్ తింటే మానేస్తే కాదు తగ్గేది. గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నిన్ను కాపాడేది డైట్ ఎక్సర్సైజ్ మాత్రమే మంత్రాలు తంత్రాలు కాదు.
No comments:
Post a Comment