*🌹🙏భక్తి - చాదస్తం!!🙏🌹*
*https://chat.whatsapp.com/D5mbp1H6R9MGFjE1wTTesD*
*🌸మనం నిత్యం భగవంతునికి పూజలు, పునస్కారములు ఆచరిస్తూ, ఆయన అనుగ్రహం పొందడానికి ఎన్నో తాపత్రయాలు పడుతుంటాము...*
*🌷ఒక్కసారి ఇది చదివితే, మనం పూజ భక్తితో నిర్వహిస్తున్నామ???, లేక అనవసరమైన చాదస్తంతో, ఆర్భాటాలు చేస్తున్నామ?? అర్థం అవుతుంది ...*
*🌷ఏది భక్తి??*
*🌸ఒక్కోసారి మనకు అర్ధంపర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి... పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే , పూజలో దొర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని, వాటికోసం పూజనే మానివేయడం తప్పు...*
*🌷దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి !*
*🌹1. భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి...? (జింక మాంసం..) అయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు, కాని... దేవుడు ఛీ నీచుడా... నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు.*
*🌸నువ్వు స్నానం చేసావా ముందు, విభూది కూడా పెట్టుకోలేదు., దూరం జరుగు అనలేదు,*
*పరమ సంతోషంతో స్వీకరించాడు... ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు..*
*🌸శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు, నువ్వు భక్తితో ఏది పెట్టిన భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించాలి...*
*🌸2. గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు..*
*🌸పైగా తను నిత్యం ధరించే శంకు చక్రాలను ధరించకుండా, లక్ష్మీ దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు... అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు, ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా...? నీ చావు నువ్వు చావు అనలేదు..*
*🌸ఇక్కడ మనం అర్థము చేసుకోవాల్సింది ఏమిటి..? ఆపదలో ఉన్నవాణ్ణి, ఆర్తితో పిలిచినవాడిని, నీవు తప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే..*
*🌸అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలోనైనా సరే వచ్చి కాపాడుతాడు, అదే ఆయన నైజం...*
*🌸3. ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు అన్నా శ్రీ కృష్ణా అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా...?*
*‼️నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజులు తరువాత పిలుస్తే వస్తాను, అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే, భక్తితో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు అని శరణు వేడితే తప్పకుండ ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు...*
*🌸ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది...*
*మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...*
*🌷ఇక మన చాదస్తం...*
*🌸దేవునికి ఇటు ముఖం ఉండాలి, అటు ముఖం ఉండాలి అని కొందరు, ఇవి నైవేద్యంగా పెట్టరాదు, అది పెట్టాలి అని కొందరు, (వీరికెప్పుడైన దేవుడు కనిపించి ఇది వద్దు అని చెప్పినట్లుగా చెబుతారు... )*
*🌸పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఏ దిక్కుకు తిప్పాలి... ఏ నూనెతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఇంకా మనం భగవంతుడుని ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతులం కావాలి..?,*
*🌸అందుకే ఎప్పుడైనా భక్తుడు అనేవాడు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి... భగవంతునికి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు...*
*🌸ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు..*
*https://chat.whatsapp.com/D5mbp1H6R9MGFjE1wTTesD*
*🌸తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏది దాయటం కుదరదు గాక కుదరదు...స్వస్తి...🚩🌞🙏🌹*
No comments:
Post a Comment