[4/10, 07:09] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 16🌹
👌ఆత్మానంద స్థితి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 16. ఆత్మానంద స్థితి 🌹
✳️ విశ్వమంతా నిండిఉన్న దైవంయొక్క ఉనికి మనలోనూ ఉన్నదని తెలుసుకోవడం జ్ఞానం. తెలుసుకోవాలన్న ఇష్టమే భక్తి. తెలుసుకునే మార్గం సాధన. దాన్ని అనుభవించడం యోగం. ఆ అనుభవంలో ఉండిపోవడం ఆత్మానంద స్థితి. ఒక రూపంతో అంతటా వ్యాపించలేని ఆ భగవంతునికి విశ్వమంతా నిండి ఉండటం ఎలా సాధ్యం!
✳️ తానున్న చోటు నుండి కదలని సూర్యభగవానుడు సౌరకుటుంబాన్ని అంతటినీ తన తత్వమైన వేడితో, కాంతితో ఆవరిస్తాడు. అలాగే దైవం కూడా తన తత్వమైన చైతన్యంగా (చిత్ గా ) అంతటా వ్యాపించి ఉంటాడు. మనలో ప్రకటితమయ్యే దైవంయొక్క ఉనికినే చిత్ అంటాం. ఈ విశ్వమంతా చిత్ గా వ్యాపించాడు కనుకనే ఈశ్వరుడ్ని చిదంబరుడు అంటాము.
✳️ దైవాన్ని ఏ రూపంగానైన పరిమిత సమయం మాత్రమే దర్శించగలం, స్మరించగలం. మనలోనే చైతన్యంగా ఉన్న దైవాన్ని తెలుసుకోగలిగితే అది నిరంతరం నిలిచిపోయే అనుభవం అవుతుంది. శ్రీ రమణభగవాన్ భోధనలో చెప్పే “అసలు నేను” అంటే మనలోని ఆ చైతన్యమే. ఆ చైతన్యంతోనే పనిచేసేవే అయినా పంచేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నోరు చర్మాలకు అది తెలిసేది కాదు. అన్నింటికి అతీతంగా మనసుకు తెలియబడే బ్రహ్మానందమది. ఆకలి తెలిసినట్లుగానే నిరంతర సాధనలో ఆ చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అది అనాదిగా మనలో ఉన్నదేనన్న సత్యం తెలుస్తుంది. ఆ చిత్ నే మన సాధారణ భాషలో 'తెలివి' అంటాం. ఇక్కడ 'తెలివి' అంటే మనం అనుకొనే తెలివితేటలు కాదు.
✳️ మనకి ఈ ప్రపంచం తెలియాలంటే ముందు మనని మనం తెలుసుకొనే స్పృహ ఒకటి కావాలి. దానినే ప్రజ్ఞ, ఎరుక, చైతన్యం, తెలివి, చిత్ అని అంటాం. కోమాలో ఉండే వ్యక్తికి, గాఢ నిద్రలో ఉండే వ్యక్తికి ప్రాణం ఉంటుంది కానీ అది తెలివిగా వుండదు. మనం ఏది తెలుసుకోవాలన్నా ముందు భగవంతుడు, భావనవల్ల మరుగున మనలో నుండి ఆ తెలివిగా వ్యక్తం అవ్వాలి. అపుడు మాత్రమే మనం అనుకునే తెలివితేటలు పని చేస్తాయి.
✳️ ఒక సైంటిస్ట్, ఒక రైతు, ఒక కుక్క ఎత్తునుండి పడి దిమ్మెరపోతే వారందరూ తెలివికోల్పోయారని అంటాం. వారంతా తెలివిలోకి రాగానే ఎవరికి వారు తమతమ తెలివితేటలతో ప్రవర్తిస్తారు. మనలో నుండి ఆ తెలివి వ్యక్తమయ్యే కేంద్రబిందువే హృదయం. గాఢ నిద్రలోనూ, స్వప్నావస్థలోను అగ్గిపుల్లలో దాగిన నిప్పులా అణిగిఉండే చైతన్యం మెళుకువలో వ్యక్తం అవుతుంది. సాధన ద్వారా ఆ చైతన్యాన్ని అనుభవించగలిగితే అది (స్వప్న, జాగృతి, సుషుప్తి) మూడు అవస్థల్లోనూ ఉండేదేయని అర్థమౌతుంది. అదే తురీయం అంటే. మూడు అవస్థల్లోనూ ఉండే తురియాన్ని నిరంతరం అనుభవించ గలగటమే సహజ ధ్యానం.
✳️ మనలో నిరంతరం ఆలోచనా రూపంగా సాగే మనసు ఉండే స్థానమే ఆ భగవంతుని స్థావరం. ఆలోచనా పరంపర తగ్గితేనే మనసు తన మూలమైన దైవాన్ని తెలుసుకోగలుగుతుంది. దైవాన్ని ఏ రూపంలో కొలిచినా చివరికి అనుభవించ గలిగింది మనోమూలమైన చైతన్య తత్వంగానే. శ్రీ రమణ భగవాన్ బోధించే విచారణామార్గం అంతా దైవాన్ని తత్వంగా తెలుసుకొనే శాశ్వత అనుభవం కోసమే. నిరంతరం మనలోనుండి శక్తిగావ్యక్తం అయ్యే దైవాన్ని గుర్తించగలిగితే శాంతి వస్తుంది. మన శరీరంఅంతా దైవం శక్తిగానే వ్యాపించి ఉంటుంది. దైవం మనలోనే కాదు, ఈ సృష్టి అంతటా ఆ శక్తిగానే వ్యాపించి ఉంది. కంటికి కనిపించే ఆహారంలోని శక్తి కూడా అదృశ్యమే కదా!. మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోగలిగితే ఈ విశ్వమంతా నిండిన ఈశ్వరుడు మనకి అర్థం అవుతాడు.
✳️ మనసంతా కోర్కెలతో నిండిన మనం అవి తీరితేనే దైవానుగ్రహం ఉందని అంటున్నాం. కానీ మనం కోరకుండానే ఈ దేహాన్ని పోషించే దైవాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మనపై నిరంతరం వర్షించే భగవదానుగ్రహం తెలియాలంటే తెలివి రూపంలో మనలోనే నిలిచిన ఆయన దయ గుర్తించాలి. అప్పుడు అఖండ శాంతి మన సొంతం అవుతుంది. మన సాధన యావత్తు కొత్తగా భగవదనుగ్రహాన్ని పొందటానికి కాదు. ఉన్న దయను తెలుసుకోవటానికే. జన్మించినది మొదలు మరణించేంతవరకు ఏ ఆధారం లేని ఒక విద్యుత్ శక్తిగా దైవం మనలో నిలిచి ఉంటారు. ఆ దైవశక్తిని ఏకాగ్రత కోసం ఏదో ఒక రూపనామాలతో కొలుస్తాం. “దేవుడు రూప నామ రహితుడని అంటే ఒకపేరు, రూపానికి పరిమితం కాదని అర్థం. అసలు ఏవి లేవని అర్థం కాదు”. అని జిళ్ళేళ్లమూడి అమ్మవారు అంటున్నారు. అంటే అన్ని పేర్లు రూపాలు దైవానివేనని ఆమె తత్వబోధన. జబ్బు చేసిన కొడుక్కి ఐదురూపాయల ఐస్ క్రీమ్ కొనిపెట్టని తల్లి వైద్యం కోసం ఉన్నవన్నీ అమ్మేసేందుకైనా సిద్ధపడుతుంది. మనపై దేవుని ప్రేమ అలా ఉంటుంది. మన భవరోగాలను పోగొట్టటం కోసం దేవుని దయ ఎపుడూ అపారంగానే ఉంటుంది. మనమే అల్పత్వంతో అనవసరమైన వాటిని కోరతాం. అవి తీరలేదని దైవాన్ని నిందిస్తాం.
[4/10, 07:09] +91 73963 92086: ✳️ మనలోని ఆత్మజ్యోతి నుండి వెలువడే కోటి కిరణాలు నిరంతరం మనలో అనేక పనులు చేయించటం భగవదానుగ్రహమే. మనకి చిత్తశుద్ధి, మనోనిర్మలత్వం ఏర్పడితే గాని ఇది అర్థం కాదు. క్రమేణ మన భోగలాలసత్వాన్ని, సౌకర్యాలవాంఛను తగ్గించుకుంటే కేవలం అవసరాలకోసం స్పందించే గుణం ఏర్పడుతుంది. అది తృప్తికి మార్గం ఏర్పరుస్తుంది. సమ దృష్టి వస్తుంది. ఆవు ముందున్న గడ్డి, ఆవు పొదుగులోని పాలు, ఆవు వేసిన పేడ ఇవన్నీ రూపాంతరం చెందిన శక్తికి ప్రతిరూపాలే కదా అన్న అవగాహనతో కూడిన అనుభవమే సమదృష్టి అంటే. నిత్యం మనని ఆహారం, నీరు, గాలిగా అనుగ్రహించే పరమాత్మను వైకుంఠం, కైలాసంలో ఉన్నారన్న భావనతో పూజించినా చివరికి తత్వంగా గ్రహిస్తే తప్ప పరిపూర్ణత రాదు. *క్షణకాలం నిలిచే రూపదర్శనం కన్నా నిరంతరం ఉండే తత్వదర్శనం విశేషం.* మనలో మెళుకువగాఉండి చైతన్యంగా నడిపించే దైవం సృష్టి అంతా అదేకార్యంలో నిరంతరం నిమగ్నమై ఉన్నాడు. 'తెలివి'ని ప్రసాదించటమే దైవం మనపై చూపే తొలిఅనుగ్రహం.
✳️ మనకి మనం తెలియాలన్నా, ఈ ప్రపంచాన్ని గుర్తించాలన్నా, సాధకులకు సత్యదర్శనం కావాలన్నా ఆ 'తెలివి' ఉంటేనే సాధ్యం. నిద్రా, మెళుకువలు రావటంలో మన ప్రమేయం ఉండదు. మరితెలివి విషయంలో స్వతంత్రతలేని మనం నిర్వహించే పనులన్నింటికి కర్తృత్వం ఎలా వహించగలం?. ఇది గుర్తిస్తే అహంకారం నశిస్తుంది. యోగి మాత్రమే నిద్ర, కల, మెళకువలను తన ఇచ్చానుసారం స్వీకరించగలరు. అహంకారం పోతే యోగిలా కష్టసుఖాలు దైవలీలలుగా తెలుసుకొనేంత విశాలత్వం మనకీ వస్తుంది. వాహనంపై కూర్చుని, దాని ప్రయాణాన్ని మనది అనుకున్నట్లే, అన్నివిషయాల్లో కర్తృత్వ భావన మనని సత్యదూరం చేస్తుంది. మన ప్రతి కదలికకి, అనుభవానికి ఆధారమైన 'తెలివి’ గా భగవంతుడు మనని నడిపిస్తున్నాడన్న విషయం మన దేహత్మ పడుతుంది. తండ్రి చేయిపట్టుకొని తప్పటడుగులు వేసే పసివాడు తానే నడుస్తున్నాని పడేసంబరం లాంటిదే మనకర్తృత్వ భావన. మనలో తెలివిగా వ్యక్తమయ్యే భగవంతుడు మనఆలోచనకు కారణం అవుతున్నాడు. ఆలోచనల వల్లే మనం జీవుడిగామారి బద్ధులమౌతున్నాం. నిద్రలో తెలివి ఉపసంహారాన్ని, మెళకువలో తెలివి పుట్టుకను మనం గుర్తించగలిగితే మనలోని దైవత్వం అర్థం అవుతుంది.
🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment