Friday, April 28, 2023

ముక్తి కాంక్ష కలిగినవారికే జ్ఞానంతో పని. జ్ఞాన అభిలాష .. ముక్తి కాంక్ష ఉన్నప్పుడే పరమాత్మ సహాయం చేస్తాడు. లేకపోతే పరమాత్మ గోడ మీద చిత్రం.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏

ముక్తి కాంక్ష కలిగినవారికే జ్ఞానంతో పని. జ్ఞాన అభిలాష .. ముక్తి కాంక్ష ఉన్నప్పుడే పరమాత్మ సహాయం చేస్తాడు. లేకపోతే పరమాత్మ గోడ మీద చిత్రం. 

నిజంగా పరమాత్మ నీ జీవితంలో ప్రవేశిస్తే నీవుండవు ... ఎంతమంది సిధ్ధంగా ఉన్నారు తనను తాను పోగొట్టుకోవడానికి. 

ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు నేను చెప్పినట్లు ప్రకాశించాలంటే ఎలా సాధ్యం. 

కర్మ భక్తి. ..యోగ  మార్గం లో ప్రయాణం ... ఆర్తులు.. అర్థార్థులు... జిజ్ఞాసువులు గా ఉంటారు. 

జైమిని మహర్షి అందించిన ధర్మ సూత్రాలు .. ధర్మా చరణ ఏమిటో తెలియాలంటే ధర్మం అంటే ఏమిటో తెలియాలి. 

నోరు తెరిచి మాట్లాడుతున్నామంటే కర్మ.. భక్తి .. యోగ సూత్రాలు అందించే విధానానికి సరిపోవాలి. 

ముక్తి సాధన హేతువులు జ్ఞాన వైరాగ్యములు. 

శివ భక్తులు బంధువులు.. మహేశ్వరుడు తండ్రి ..మహేశ్వరి తల్లి. 

నీ మనసుని బాగా జల్లెడ పట్టి కేవల మోక్షం.. కేవల జ్ఞానం.. నిజ వైరాగ్యం మాత్రమే ఉన్నాయా పరిశీలించుకోవాలి. 

పర్వత రాజ కుమార్తె పార్వతి.. పతిలో అర్ధభాగం సతి .. ఓంకారమే శరీరంగా ధరించినది ఉమ ..

శంకర భగవత్పాదులు ఏమైనా చెప్పారంటే శబ్దార్థ ... వాచ్యార్థ... అనుభవార్థము .. లక్ధ్యార్థములు నాలుగూ ఉంటాయి. 

అష్టావక్రగీత శ్రవణం చేసేవారు తప్పని సరిగా మనో బుధ్ధులను ఆత్మ భావనలో లయం చేసినవారికే .. సమాధి నిష్ఠ లక్ష్యం గా కలవారికి ... సమాధి నుండి మేల్కొనాలనుకునేవారికి మాత్రమే. 

Enquiry.. Inquiry 
తనను తాను తెలుసుకొని .. తానైన స్థితిలో తానుండి ... తాను తప్ప అన్యంగా ఏమీ లేదని నిర్ణయం పొందాలి ఈ మూడు మాటలు నిలబెట్టుకొన్నవారికే విచారణ మార్గం. 

ఏ గ్రంధమైనా భగవత్ ప్రశంస... ఆశీర్వచనవాక్యాలతో ప్రారంభమవుతుంది ... అష్టావక్రగీత హెచ్చరికతో ప్రారంభమవుతున్నది. 

నీ హేదయంలో గురువు శాశ్వత నివాసము ఏర్పరచుకొని అనుక్షణం .. తండ్రి వలే హెచ్చరిక చేస్తున్నారు. 

పరమాత్మ పరోక్ధం అనుకొనేవారు జ్ఞానమార్గానికి పనికిరారు .. ఎవరికి పరమాత్మ ప్రత్యక్షమో వారికి మాత్రమే జ్ఞానమార్గం. 

నీవలే పరమాత్మను చూదుకోవాలి... పరమాత్మ వలే నిన్ను చూసుకోవటం జ్ఞాన మార్గంలో అధికారిత్వం. 

అడుగడుగునా ... అణువణువునా జ్ఞానిలా మాట్లాడాలి. 

నీ యొక్క పరిపక్వతా స్థితిని బట్టి గురువు నిన్నే వెతుక్కుంటూ వస్తాడు. 

మానవుడు తన మనసు కదలికల. వల్ల ఏ వస్తువునైనా కదిలించగలడు. 

ఆ కదలికలుడుగిపోవటం జ్ఞానం. 
జ్ఞానిమాటలు మొట్టి కాయల  వలే ఉంటాయి 

న కరోతి న లిప్యతే ... ఏమీ చేయడు అంటడు. 

ప్రకాశంలో నీ మనసెంత సేపు లయం అయ్యిందీ పరిశీలన చేసుకోవాలి .. అదీ ధ్యానం అంటే. 

బ్రహ్మ జ్ఞానమనే చట్రం నుండి దాటి రాకుండా నియమించ గలిగిన వారు దమం సిధ్ధించిన వారు. 

కైవల్యాశ్రమ సభ్యులందరూ  దమం సిధ్ధించేవరకు శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామి అందించిన మానసబోధ వినవలసినదిగా స్వామి నిర్భయానందులు ఆదేశించేవారు. 

శమాది షట్క సంపత్తి ఉన్నవారికి ఆ జన్మ లోనే ముక్తి 

శమము ... మనసును నిర్వీర్యం చేయటం. 
కదిలే మనసు స్వాధీనం చేసుకోవటం దమము. 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 
అష్టావక్రగీత -12

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐

No comments:

Post a Comment