Tuesday, April 25, 2023

శ్రీ రమణీయం - 27🌹 👌మన ఉనికే నిజమైన సంతోషం👌

 [4/24, 07:00] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 27🌹
👌మన ఉనికే నిజమైన సంతోషం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

🌈  27. మన ఉనికే నిజమైన సంతోషం.🌹

✳️ మనం సుఖసంతోషాలను అవసరాలుగా భావిస్తున్నాం. మన జీవనానికి గాలి, నీరు, ఆహారం, వస్త్రాలు, ఇల్లు వంటివి నిజమైన అవసరాలు. వాటితో పాటు సుఖసంతోషాలను కూడా మన మనసు అవసరాలుగా భావిస్తుంది. నిజానికి మనకి దు:ఖంలేదు. కోరుకున్న సంతోషం దక్కలేదనే వెలితి దుఃఖంగా కనిపిస్తుంది. సంతోషాన్ని బయటి వస్తువుల నుండి పొందాలని, పొందిన సంతోషాన్ని శాశ్వతం చేసుకోవాలని మనసు ఆరాటపడుతుంది. అసలు మన ఉనికే తొలి సంతోషం అన్న విషయాన్ని మనం మరిచిపోయాం. ఇంకా ఏదో సంతోషం కోసం వెంపర్లాడుతున్నాం. సంతోషాన్ని ఉనికిగా మార్చుకోవాలనే ప్రయత్నంలో మన ఉనికే సంతోషంగా తెలుసుకోలేకపోతున్నాం. నిజానికి మనం జీవించి ఉండాలంటే సంతోషం అవసరమా? సృష్టిలో మనిషి తప్ప ఏ ప్రాణి సుఖసంతోషాలను కోరుకోవడంలేదు. కేవలం వస్తే అనుభవించి వదిలేస్తున్నాయి. ముందు మనమంటూ ఉంటేకదా... సంతోషంగా ఉండాలని కోరుకునేది! 

✳️ కోటి రూపాయలతో పడవలో ప్రయాణం చేసేవాడు ఆ పడవ మునిగిపోతుందనితెలిస్తే తాను బ్రతికి ఉంటే చాలనుకుంటాడు. అప్పటివరకూ తనకి సంతోషాన్నిచ్చినట్లు భావించిన సొమ్ములు ఇప్పుడు అతనికి ప్రాణంతో పోలిస్తే గడ్డి పోచతో సమానం. మన ఉనికే భగవంతుడు. మనచుట్టూ దివ్యానందమే ఉంది. కానీ సంతోషం కోసం సాగే మన వెతుకులాట దాన్ని మనకి దూరం చేస్తుంది. ఆధ్యాత్మికత అంటే సంతోషం కోసం వెతకడం కాదు. నీ ఉనికిలోని శాంతిని చదువు ఆపినా, తన తల్లిగురించి ఆలోచిస్తూ చదవడం మానేసినా జరిగేది గమనించడమే నిజమైన ఆధ్యాత్మికత. మన దుఃఖాన్ని వద్దని అనుకుంటాం. కానీ మనం సంతోషం కావాలని కోరుకోవడమే తొలి దు:ఖంగా ఉంది. అబ్బాయిని అమెరికా పంపించాలన్న ఆలోచన ఉంటే ఇక్కడ వాడికి ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా ఆ తల్లిదండ్రులకు దుఃఖం గానే ఉంటుంది. 

✳️ మనందరం దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు ఎలా ఉంటాడన్న విషయంలో మనకి ప్రత్యక్ష అనుభవం లేదు. అయినా ఏదో ఒక రూపంతో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పెద్దలు చెప్పిన మాటలే మనని అలా ప్రేరేపిస్తున్నాయి. మనకి చిన్నప్పటి నుండి దేవుడంటే అడిగింది ఇచ్చేవాడని, కష్టం వచ్చినప్పుడు రక్షించేవాడని, మన అవసరాలు తీర్చేవాడన్న భావన స్థిరపడింది. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడనీ, నీ ప్రార్థన వింటాడనీ, నమ్మకం బలంగా నాటుకుంది. నువ్వు అనుకునే దైవం ముందుగా నీలోనే ఉందని శ్రీరమణ భగవానుల జ్ఞానమార్గం చెప్తుంది. నువ్వు ప్రత్యేకించి భగవంతుడ్ని చేరుకోవడానికి ఆయన నీకు విడిగా లేడని బోధిస్తుంది. మనం దేవుడ్ని పూజించేటప్పుడు చెడు ఆలోచనలు వస్తుంటాయని బాధపడుతాం. నిజానికి ఆ చెడ్డ ఆలోచన ఎక్కడిది? నీ అహంభావనలో నుండి వచ్చిన తలపేకదా! అహంభావన అంటే 'నేను' అనే భావన. ప్రస్తుతం మనం 'శరీరమే నేను' అనే భావనలో ఉన్నాం. కనుక అదే మన అహంభావనగా ఉంది. ఈ దేహభావన పోతే మిగిలేది ఆత్మ భావనే. మనలోని చైతన్యమే జీవనం కోసం అహంభావనగా అవతరిస్తుంది. అలాంటప్పుడు అహంభావన నుండి పుట్టే ఏ తలపైనా ఆ చైతన్యానిదే కదా! దైవం నీకు వేరుగా ఉన్నాడని నువ్వు భావించినప్పుడే నువ్వు కోరుకోవడం. దేవుడు వరమివ్వడం.  అపుడు నువ్వు కోరుకోవడం. దేవుడు వరమివ్వడం నువ్వు కోరుకోవడం. దేవుడు వరమివ్వడం అనే భావన ఉంటుంది. ఈ అహంభావన, నీలో ఉదయించే తలపులు ఏవీ నీ ఆత్మకు భిన్నమైనవి కాదని భగవాన్ స్పష్టం చేస్తున్నారు.

✳️ నీటిలో పుట్టే బుడగ ఆ నీటికి భిన్నమైంది కాదు. బుడగ నీటికి నష్టాన్ని కలిగించదు. అలాగే తాను పగలటం వల్లకూడా ఆ బుడగకు ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే బుడగగా ఉన్నా పగిలినా తాను అంతకు మునుపు ఉన్న నీటిరూపాన్నే అది పొందుతుంది కాబట్టి. మన అహంభావన కూడా ఆ బుడగలాంటిదే. అది మనలో ఆత్మగా ఉన్న దైవానికి భిన్నంగా లేదు. అది పోతే వచ్చే నష్టంకూడా లేదు. నువ్వు బయట ఉన్నాడని భావించే దైవం నీ గురించి ఆలోచించాలని, నీతో మాట్లాడాలని నువ్వు కోరుకుంటావు. కానీ నీలోని ఆలోచనలు, వ్యక్తమయ్యే మాటలు మాత్రం ఆ దైవానివేనని గుర్తించలేకపోతున్నాం. చెడు ఆలోచనలు వస్తున్నాయని మనసుని తప్పు పడుతున్నాం. మన ఆలోచనలు అన్నీ బ్రతకటానికే. బ్రతుకే ఆలోచన కదా! మరి బ్రతికే ఆలోచనలు వద్దని అనుకుంటే ఎలా? చెడ్డ ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా నీది కాదనుకో. దాన్ని ఆలోచనగానే ఉంచి అది నీలోని అహంభావనదే కదా అని గుర్తించు. అప్పుడు నీలో అనవసరమైన తలపులు ఆగిపోతాయి. తలపులను కార్యరూపంలో పెట్టేముందే అవి మనలోని చైతన్యం తాలుకూ ప్రతిస్పందనలేనని గుర్తించు. అప్పుడు అసలు ఏ ఆలోచనా నిన్ను వేధించదు. మన ప్రతి ఆలోచన వెనుక దేవుడున్నాడని గుర్తించడమే జ్ఞానమార్గం. మంచిఆలోచనలు ఎందుకంటే చెడు ఆలోచనలను ఆపడానికి మాత్రమే. మనం చేసే పూజలు, జపాలు కూడా అంతే. అనవసరమైన ఆలోచనల భారాన్ని తగ్గించడానికే.
[4/24, 07:00] +91 73963 92086: ✳️ బస్టాండుకు బయలు దేరి మధ్యలో స్నేహితుడితో మాట్లాడుతూ ఆలస్యం చేశావనుకో ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోతుంది. అప్పుడు స్నేహితుడితో మాట్లాడాలన్న ఆలోచన వచ్చినందుకు బాధపడతావు. నువ్వు మిస్ అయిన బస్సుకి ప్రమాదం జరిగిందని తెలిస్తే ఆ ఆలోచనే నీకు మంచిదిగా తోస్తుంది. మంచి చెడు ఆలోచనలు మన భావనలోనివే. నిద్రపోయేవాడికి దేవుడు గుర్తుకు వచ్చి మెలకువ వచ్చినా, దెయ్యం గుర్తుకు వచ్చి మెలకువ వచ్చినా జరిగింది నిద్రాభంగమే. పరమ శాంతికి ఏ తలపైనా అడ్డమే. చిన్న పిల్లాడికి దేవుడంటే ఏమిటో కూడా తెలియదు. మనమే నేర్పుతాం. ఆ నేర్పటంలోనే దైవాన్ని స్వార్ధానికి ఉపయోగించుకోవాలని నేర్పుతున్నాం. దేవుడి ఆలోచనలు మంచిదే కానీ శాంతి పోందాలంటే అదికాదు కావాల్సింది. అసలు ఆలోచనాశక్తే దేవుడని తెలియాలి. పరీక్షకోసం చదివే విద్యార్థి సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటే... అది విద్యాభంగం. తల్లి ఆరెండింటినీ వద్దనే అంటుంది. తల్లికి ఇష్టమైన పని చేయడం ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. తల్లి గురించి ఆలోచించడం ఆమెను ప్రేమించినట్లుకాదు. అలాగే మనలోని దైవం శాంతిరూపంలో ఉంటే దాన్ని భంగపరిచే ఏ ఆలోచన అయినా దైవానికి వ్యతిరేకమే. 

✳️ చీకట్లో నడుస్తూన్నప్పుడు భయంవేస్తే దైవాన్ని తలుచుకుంటాం. కానీ భయపడతూనే ఉంటాం. అందుకు కారణం.. దైవం మనకి దూరంగా ఉన్నాడన్న భావన. నీలోనే దైవం ఉందన్న భావన, అసలు నీవే దైవస్వరూపానివన్న సత్యం నిన్ను భయరహితుడిని చేస్తుంది. చీకట్లో ఉన్నప్పుడు దూరంగా ఉన్న స్నేహితుడి కన్నా దగ్గరగా ఉన్న శత్రువే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. పిల్లాడు అద్దాల పెట్టెలో ఉన్న జిలేబి కావాలనుకోవడం, నువ్వు దైవాన్ని కావాలను కోవడం ఒక్కటే అయితే ఎలా? దైవాన్ని చేరుకోవాలంటే మంచి ఆలోచనలే నిచ్చెన కదా! అని ఒక భక్తుడి ఆలోచన. అసలు నీతోనే ఉన్న దైవాన్ని చేరుకోవడమేమిటి? అందుకు నిచ్చెనతో పని ఏమిటని భగవాన్ ప్రశ్నిస్తున్నారు. నువ్వు జీవించి ఉండటమే దైవం నీతో ఉందనటానికి గుర్తు. ఇష్టం, అయిష్టం వల్ల సంతోషం, దుఃఖం వస్తున్నాయి. ఇంటినే సినిమా థియేటర్గా మార్చాలన్న తపన ఎంత పెద్ద టి.వి. ఉన్నా నీకు సంతోషాన్ని ఇవ్వదు. నీ సంతోషానికి నీ ఇష్టాయిష్టాలే అడ్డుగా ఉన్నాయి. దేవుడిచ్చిన జీవితాన్ని ఆనందంగా స్వీకరించడంలోనే జీవన మాధుర్యం ఉంది. మన తాతముత్తాతలు మనకి ఏమిచ్చారని వాళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నాం. నీ జీవితానికి వాళ్లు కారకులనే కదా! వారిని గౌరవిస్తున్నాం. మరి దైవంపై కూడా అలాంటి గౌరవమే ఉండాలి. పెద్దలు చూపిన జీవన విధానంలో ఆంతర్యం అర్థం చేసుకోలేకపోతున్నాం. అవగాహనతో అనుసరించాల్సిన విషయాలను గుడ్డిగా అనుసరిస్తున్నాం. ఉపనయనం సమయంలో చెవులు కుట్టించుకోడానికి ఇష్టపడని మనం, మైఖేల్ జాక్సన్ చెవుల పోగులు చూసి అనుకరించే పరిస్థితి ఏర్పడింది. మన వేదపండితుడిని చూసి ఇతర దేశాల వారు అనుసరిస్తుంటే, వారిని మనం అనుకరిస్తున్నాం. 

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment