🌹ప్రశ్న :- నా ప్రమేయం ఏమి లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేను అనుభవిస్తే దాని వల్ల చెడు ఫలితాలుంటాయా?
🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-
అది కాదు విషయం. ప్రతిపనికీ ఫలితము ఉంటుంది. ప్రారబ్ద వశాన నీకేదైనా వస్తే నీవేమీ చేయలేవు దానికి.
వచ్చిన దానిని ఏ మమకారమూ లేకుండా, అదే ఇంకా ఎక్కవ కావాలనే కోరిక లేకుండా, తీసుకుంటే నీకే కీడూ వాటిల్లదు.
దాని వలన మళ్ళీ జన్మ నెత్త వలసి రాదు.
అట్లాకాక, ఎంతో ఆసక్తితో దానిని ఆస్వాదించి, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటే, మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది.
సేకరణ : నీ సహజస్థితిలో ఉండు, ఆంగ్లమూలము డేవిడ్ గాడ్ మ్యాన్ తెలుగు అనువాదము పింగళి సూర్యసుందరము
..... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్
No comments:
Post a Comment