హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏
విషయ త్యాగమా? సంగ త్యాగమా? కర్మ త్యాగమా? ఫల త్యాగమా?
వైరాగ్యం అంటే సంగ త్యాగం.. ఫల త్యాగం.
నీవు చేసే సర్వ కర్మలను నాకర్పించెదవేని ... పరమాత్మ .. ఇంతకన్న ఆప్త వాక్యం ఏమి ఉంటుంది.
నీవు ఏమి జీవనం జీవిస్తున్నావో ఆ జీవనాన్ని ఋషి వలే జీవించు.
సంగ త్యాగం .. ఫల త్యాగం.. కర్తృత్వ త్యాగం తో జీవించాలి ఋషి.
గురువుని తన హృదయంలో నిలుపుకోవటం ఉపదేశం
నీ హృదయంలో గురువు మేల్కొన్నాడ .. అది ఉపదేశం స్వామి నిర్భయానందులు అనేవారు .
గురువు హృదయంలో శిష్యుడు మేల్కొనటం .. గురువు శిష్యుని వెంబడించటం ... సిధ్ధించటం.
శరణాగతి కానివాడికి ఉపదేశం.
సదా మెలకువ కల నిద్రల లో
సదా సాథ్ రహో హే భగవాన్ .. భగవాన్ సత్య సాయి.
నేను అజ్ఞానిని అని నన్ను వదలకు ... నీ పాద కమల సేవయు .. నీ పాదార్చకుల తోటి నెయ్యము.. నితాంతాపార భూతదయ నాకు దయ సేయగదే నయముగ శ్రీ కృష్ణా!!
అశరీరవాణి తో మేల్కొనాలి శిష్యుడు... దేహాభిమానం సొరకాయ బుర్ర.. నీళ్ళు తాగటం జీవ చైతన్యం.
విచార సాగరం చదివితే వైరాగ్యం .. జ్ఞానం .. సాధన ఏది ప్రధానమో చెపుతుంది .. సాధన కూడా భోగమే.
గురువు అయస్కాంతం లాంటివాడు... శిష్యుడు సూది .. అలా గురువు ఎక్కడ ఉన్నా నిన్నాకర్షిస్తాడు.
పరమాత్మ అందరికీ గురువు .. సూర్య చంద్రాగ్నులు ప్రకాశింపచేయలేవు నా పరంధామమును.
అది కదా జీవనం .. ధ్యానం
జ్ఞానంతో ధ్యానం చేసే వాడికి అంతర్ ముఖం.. బహిర్ముఖం అన్న భేదం లేదు.
ప్రపంచం .. పరమాత్మ అన్న భేదం లేదు .. పరమాత్మకు భిన్నమైన వస్తువే .. ఆలోచనే లేదు.
సంగ రహిత: విజ్ఞాని: .. సంగ రహితుడు విజ్ఞాని. సాధన దశలో అన్నీ ఉంటాయి ,సిధ్ధి దశలో ఉండవు.
విషయాలను కాదయ్యా .. విషయాల పట్ల ఆసక్తి త్యజించు.
మనసు పోరు పెడుతుంది... ఆరాటపడుతుంది .. ఆసక్తి పడుతుంది... ఆసక్తి త్యాగం చెయ్యాలి.
గురువు ఏమి చెపితేఅది ఆచరించు.. గురువుకు శాస్త్రం నేర్పకు.
గురువు అనుభవంతో చెప్పింది పుస్తకం అవుతుంది .. పుస్తకంలో చెప్పింది విద్య కాదు.
నీ ఆసక్తిని విడిచే కార్యక్రమం లో నిన్ను ప్రవేశ పెడతారు. గురు కార్యం ప్రథమంచ ... స్వకార్యం ద్వితీయంచ.
అయ్యేదే చెపుతారు గురువు. ఈశ్వరారాధన వల్ల జ్ఞానాన్ని పొందాలి.
ముల్లోకాలు.. మూడవస్థలు .. త్రిపుటిని దాటాలి. ఎక్కడికక్కడ ఆసక్తి అడ్డం అవుతుంది .. త్యజించాలి.
తప్పక ఆసక్తి త్యజించాలి .. జ్ఞానాన్ని పొందగోరువారు.
భోగం కోసం యాచించకూడదు. ...రాగ ద్వేషాలతో జీవించటం .. హీనుడు.. దీనుడుచేసేపని .. విడువ దగినది .
గురువు గారికి ఇచ్చిన ఆతిధ్యం ... ప్రతి ఒక్క అన్నం మెతుక్కీ బాధ్యత వహిస్తాడు.. దివ్యమైన ప్ర్జని.. చైతన్యాన్ని వెదజల్లుతూనే ఉంటాడు ... బ్రహ్మనిష్ఠని మేల్కొలుపుతాడు.
సంగ త్యాగం- ఫలత్యాగం - మమకార త్యాగం- అహంకారత్యాగం. ... ఎక్కడకు వచ్చారో చూస్తారు గురువు.
నిష్కర్షగా చెప్పే గురువు లభించటం ఈశ్వరానుగ్రహము. గురువు చెప్పినట్లుగా జీవించటం శిష్యుడు పని.
అష్తావక్రగీతను వింటున్న కైవ ల్యాశ్రమ సత్సంగ సభ్యులందరూ.. తప్పక అంతర్ముఖంలో .. సంగత్యాగం.. ఫలత్యాగం.. మమకార త్యాగం.. అహంకారత్యాగం చెయ్యాలి ... ఇవి కలిగిన వారికే ఆత్మజ్ఞానం.
శ్రీ విద్యాసాగర్ స్వామి వారు
అష్టావక్రగీత -15
జై గురుదేవ 🙏
💐🌹💐🌹💐🌹💐🌹💐🌹
No comments:
Post a Comment