Saturday, April 29, 2023

మానవ జీవితం త్యజ .. భజ ఈ రెండు లక్షణాలు లేకుండ వీలు కాదు. ముక్తి కోరే వారు ఏది త్యజించాలో ఏది భజించాలో తెలియాలి.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

మానవ జీవితం త్యజ .. భజ ఈ రెండు లక్షణాలు లేకుండ వీలు కాదు. ముక్తి కోరే వారు ఏది త్యజించాలో ఏది భజించాలో తెలియాలి. 

విషయాను కంపనం.. అనుకంపనం విషయం వస్తే నిలబడ లేరు. 

నీకు తల్లీ తండ్రీ స్వరూప జ్ఞానం.. ఆత్మ జ్ఞానం .. విషయాలు రాగానే మరపుకు వెల్లాయి. 

మానవ జీవితమంతా జననం నుండి మరణం వరకు .. తత్కాలవత్ వచ్చి పోయేవన్నీ విషయాలే. 

తత్కాలవత్ మాత్రమే మనో బుధ్ధులలో వచ్చేది ఏదైనా విషయమే. 

ఏ ఇంద్రియ పాటవమైనా ... ఆ ఇంద్రియాన్ననుసరించి ఆ ఇంద్రియం కదులుతూ ఉంటుంది. 

జ్ఞానం పోవటం కూడా ప్రాణం పోవటం తో సమానంగా భావిస్తారో వారే ముక్తి పధంలో పయనిస్తారో వారే ముక్తి పధంలో ప్రయాణిస్తారు. 

క్షమ ..ఆర్జవం.. దయ... సంతోషం.. సత్యం ... క్షమాగుణం... ఋజువర్తనం .. దయ.. సర్వ భూతహితే రతా: 
దయ.. నాకుపయోగపడితే సహాయం చేస్తాను అధమ ధర్మం. 

తోషం... సంయక్ తోష: ఇతి సంతోష: .. సంతుష్టినందక పోతే సంతోషం లేదు. 

తుష్టి.. పుష్టి మానవ జీవితానికి చాలా అవసరం. 

sound mind and sound body
స్వామి వివేకానందులు 

సంతృప్తిగా జీవించేవారు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. 

గండూషం .. పుక్కిలించి బయటకు వదిలివేయటం 
పీయూషం.. నమిలి తిని భుజించి జీర్ణం చేసుకుని శక్తిగా రూపాంతరం చెందేవి. 

మానవుడు అమృతత్వాన్ని పొందాలంటే ఈ సల్లక్షణాలను కలిగి ఉండాలి. 

ఇలాంటి పదహారు లక్షణాలు కలిగి ఉన్నవాడు శ్రీరామ చంద్రమూర్తి. 
ఎవరైతే ఈ అమృత లక్షణాలని పొందుతారో వారు ముక్తిని పొందుతారు. 

శబ్ద .. స్పర్శ.. రూప.. రస.. గంధాలనేవి పంచ విషయాలు 

మనసును బ్రహ్మం గా చూడాలంటే విషయాకర్షణ ఉంటే కుదరదు. 

మనలో సుఖమనే విషయాగ్ని .. చింత అనే రూపంలో జ్వాజ్వల్య మానంగా మనో బుధ్ధులను దహించి వేస్తున్నది. 

పరమాత్మ నీవు బ్రహ్మవనీ ... ముక్తుడవనీ ప్రతి ప్రారబ్ద కర్మానుభవంలో తెలుపుతున్నప్పటికీ నా ఇష్టాను సారం జర్స్గాలనుకునేవాడు ... నాలుగేళ్ళవాడు. 

ఏ జన్మలో ఉన్నది బ్రహ్మమనే నిర్ణయం అవుతుందో ఆ జన్మ ముక్తి హేతువు అవుతుంది. ..

ముక్తి సాధన హేతవే .. వారికే అష్టావక్ర గీత .. బంధ రాహిత్యం ఈ గ్రంధ లక్ష్యం. 

శరీరం అనారోగ్యం.. మలినమనస్కుడయ్యాడు.. అవివేకి అయ్యాడు ... చాటునుండి దాడి చేసే పులివలే ఇంద్రియాలు దాడి చేస్తాయి ..

చింతాగ్రస్త.. ౠణగ్రస్త.. శాపగ్రస్త.. న నిద్ర .. న సుఖం. 

హనుమంతుడు దివారాత్రాను సంధానం లేకుండా సూర్యుని వద్ద విద్య నేర్చుకున్నాడు .. అందుకే ఆయన సకల విద్యా పారంగతుడు. 

స్వామి నిర్భయానందులు సూర్యుడున్నంత సేపు నిద్ర పోకూడదు ... నిద్రను అధిగమించాలి. 

ముక్తి కావాలన్నవాడు తురీయాతీతాన్ని లక్ష్యించాలి .. అది కైవల్యాశ్రమం 

విద్యయా అమృతమశ్నుతే ... యా విద్యా సా విముక్తయే .. కైవల్యాశ్రమం చెప్పేది ఇదే 

సరైన విద్యార్ధి ప్రతి రాత్రి ... లింగోద్భవ సమయానికి శివార్చన చేస్తాడు ... అతడు శివానుగ్రహము పొందుతాడు. 

మన హృదయంలో చైతన్య స్ఫూర్తిని నింపే సమయం అర్ధ రాత్రి. 

సహజమైన జ్ఞానం కావాలంటే పగలు రాత్రి లేక .. తత్పరతను కలిగి ఉండాలి. 

గురువు చెప్పినట్లు చేసే వాడు .. స్థిరంగా ఉంటాడు ... వదలవలసిన సమయం వచ్చినప్పుడు ఏతత్ క్షణం వదిలెయ్యాలి. 

సఆధి నిష్ఠ అంటే విడుదల... పొందటం కాదు. 

నిత్భయానందుల శక్తిని చెప్పినవారు విశ్వాత్మ గారు. 

చైతన్యం... సూక్ష్మ శరీరం యొక్క వ్యాపక ధర్మం అంటే ఆరా 

చైతన్యం శరీరంగా కలిగి ఉండి జ్యోతిర్మయమైన జీవితం జీవించాలి .. స్వామి నిర్భయానందులు 

ముక్తుడైన వాని ప్రజ్ఞ బ్రహ్మాండ వ్యాప్త దేహాయ... 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 
అష్టావక్రగీత -14

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

No comments:

Post a Comment