🧘♂️ *సంతోషం* 🧘♀️
*సంతోషంగా ఉండాలన్న దృఢమైన నిశ్చయం మీకు సాయపడుతుంది. ఇబ్బంది అంతా మీ పరిస్థితులలోనే ఉందన్న తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అవి మారడం కోసం నిరీక్షిస్తూ ఉండకండి.*
*విచారాన్ని చిరకాలపు అలవాటుగా చేసుకోకండి; దానివల్ల మీరు, మీ తోటి వాళ్ళు బాధపడవలసి వచ్చేలా చేయకండి. మీరు సంతోషంగా ఉంటే అది మీకు, ఇతరులకు కూడా మేలు.*
*మీకు సంతోషం ఉంటే అన్ని ఉంటాయి; సంతోషంగా ఉండడమంటే ఈశ్వరుడితో ఏకీభావంతో ఉండడం. సంతోషంగా ఉండడానికి కావలసిన శక్తి ధ్యానం ద్వారా లభిస్తుంది.*
*శ్రీ పరమహంస యోగానంద / సఫలతా నియమం*
No comments:
Post a Comment