Saturday, April 29, 2023

శ్రీ రమణీయం - 30🌹 👌అంతర్దర్శనమే దివ్య చక్షువు👌

 [4/28, 10:17] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 30🌹
👌అంతర్దర్శనమే దివ్య చక్షువు👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

🌈 30. అంతర్దర్శనమే దివ్య చక్షువు 🌹

✳️ మన కళ్ళు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు. కనిపించే ఈ బాహ్య ప్రపంచాన్ని విశ్లేషిస్తే దీనితో మనసంబంధం అంతా మనసులోనే జరుగుతుందని తెలుస్తుంది. అంతరేంద్రియంగా ఉన్న మనసు లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని అనుభవించలేం. మన పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం ద్వారా విషయాలను గ్రహించటం చేత మనసు తాను దేహాన్ని అని భావిస్తుంది. దేహస్మృతివల్ల ఏర్పడ్డ దేహభావన మన సత్యమైన ఉనికిని తెలుకోనివ్వటంలేదు. అందుకే శ్రీరమణ భగవాన్ ఇలా చెప్తున్నారు. *“దేహస్మృతి లేకపోతే ప్రపంచం లేదు. మనసులేక పోతే దేహస్మృతిలేదు. చైతన్యం లేకపోతే మనసు లేదు. సత్యవస్తువు లేకపోతే చైతన్యంలేదు.”* 

✳️ మనకీ, ఈ ప్రపంచానికి మూలంగా ఉన్న సత్యవస్తువును తెలుసుకోవటమే ఆత్మ విచారణ. సత్యవస్తువు ఈశ్వరుడిగా ఉంటే అందుండి వెలువడిన చైతన్యం మన దేహంగా, మనసుగా ప్రకృతి యావత్తుగా మారింది. చైతన్యం యొక్క ఒక కిరణం మన మనసు. దాన్ని మనం ప్రస్తుతం ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవించటం కోసం ఉపయోగిస్తున్నాం. సృష్టిలోని సకల ప్రాణులు ఇదే చేస్తున్నాయి. మరి మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ మనసు ద్వారా బాహ్య ప్రపంచంతో పాటు అంతర్ముఖం కాగలగటం. అంటే, వివేకంతో నిరంతర విశ్లేషణ ద్వారా ఈ జగత్తుకీ, తనకీ మూలంగా ఉన్న ఒక సత్య పదార్థముందని మనిషి గ్రహించగలడు. దాన్నే అంతర్దర్శనమని, ఆత్మ దర్శనమని అంటారు. 

✳️ భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి అనుగ్రహించిన దివ్య విశ్వరూప సందర్శనం అంతా అతని అంతరంగంలోనే జరిగింది. కనుకనే... కృష్ణుడి విశ్వరూపం అర్జునుడు తప్ప వేరెవ్వరూ చూడలేకపోయారు. మనిషి ఆధ్యాత్మిక సాధన అంతా అంతర ప్రయాణమే తప్ప బాహ్య ప్రయాణము కాదు. ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మగా ఉండటమేనని శ్రీ రమణ భగవాన్ చెప్తున్నారు. 

✳️ మనకి బాహ్యవస్తువులన్నింటినీ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటానికి అలవాటుపడి ఆత్మని, దైవాన్ని కూడా అలాగే తెలుసుకోవాలని చూస్తున్నాం. దాన్నే సాపేక్ష జ్ఞానం అంటారు. మనని మనం ఇప్పుడు దేహం అనుకుంటున్నాం. అందుకే ఆత్మని గురించి ప్రశ్నిస్తున్నాం, వెతుకుతున్నాం. దేహాన్ని నడిపే మనసుగా, మనసుని నడిపే చైతన్యంగా, చైతన్యానికి మూలమైన ఆత్మగా మనలని మనం తెలుసుకున్నరోజు ఈ ప్రశ్నరాదు. మనం ఉన్నట్లు మనకి తెలియడానికి ఏ ఆధారం కావాలి.. మనం ఉండటమే ఆత్మను తెలుసుకోవటం. మన కళ్ళు ఉన్నట్లు మనకు తెలియాలంటే అద్దం కావాలా? అని భగవాన్ ప్రశ్నిస్తున్నారు. మన ఉనికి మనకి తెలుస్తుంది. మనని (శరీరాన్ని) జీవింపచేసేది, మరణింపచేసేది ఎవరో అదే మన ఉనికి. నువ్వేకాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి నిజస్వరూపం ఆ ఉనికే. అన్నింటిలో అంతర్లీనంగా ఉండి నడిచే ప్రాణాన్ని మనం చూడలేము. ప్రాణం అంతరేంద్రియమైన మనసుకు మాత్రమే గోచరమయ్యేది. శవం ప్రాణం గురించీ ఆత్మగురించీ అడగదు. ప్రాణమే దేహంలో చేరి ప్రాణ స్వరూపం ఏమిటని అడిగేలా చేస్తుంది. అదే మాయ. 

✳️ మనకి బాహ్యవస్తు జ్ఞానంతో మమేకత ఏర్పడింది. ప్రతి ప్రాణి యొక్క, వస్తువు యొక్క సత్య స్వరూపం తెలిస్తే తప్ప ఈ అజ్ఞానం పోదు. అందుకే ముందు మన స్వస్వరూపం మనం తెలుసుకోవాలి. అదే ఆత్మదర్శనం. ఈ విశ్వమంతా నిండి ఉన్న చైతన్యం తెలుసుకోవటమే పరమాత్మ దర్శనం. తానే ఆత్మ అయివుండి దాన్ని అన్వేషించటం మాయ. దాన్నే దైవలీలగా శాస్త్రాలు చెప్తున్నాయి. విషయాలతో మమేకత చెందకుండా మనసుని గమనిస్తే దైవమే మన మనసుగా, తనువుగా, ఇంద్రియాలుగా, ప్రపంచంగా మారిందని అర్థం అవుతుంది. ఇదంతా భగవంతుని ఆట దాన్ని ఆక్షేపించటానికి నువ్వెవరు. ఆట ఏమిటో తెలుసుకుంటే, దానికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వం పోయి శాంతి వస్తుంది. అదే ఆత్మ విచారణ చెప్పే సులభ సాధన. 

✳️ మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనలద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం. మనలో ఉండి గుండెను నడిపేది, రక్తప్రసారం చేయించేది అంతా మనసే. మనసు యొక్క పూర్తి స్వరూపం తెలిస్తే దాని మూలం ఏమిటో తెలుస్తుంది. నిశ్చలంగా ఉన్నపుడు ఉండే నీ ఉనికే నీ నిజస్వరూపం. నిశ్చలంగా అంటే, నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటివాడ్ని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి పూర్తిగా నీకు నువ్వుగా ఉండటం. ఆత్మయే చైతన్యంగా మారి 'నేను ఫలానా' అని గిరిగీసుకోవటమే 'అహం'. అంతకుమించి ‘అహం’ అంటూ ప్రత్యేకంగా లేదు. మనం 

✳️ మంచివాడు, చెడ్డవాడు అని చెప్పేది దేహాన్ని, ప్రాణాన్ని కాదు. వారి వారి మనసునే. దొంగకైనా, యోగికైనా ప్రాణం, దేహం అలానే ఉన్నాయి. మార్పు అంతా మనసులోనే ఉంది. కిరాతకుడైన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారినపుడు దేహం, ప్రాణం మారలేదు. మారింది మనసు మాత్రమే. మంచి ఫ్యాన్, చెడ్డఫ్యాన్ అనేది దానిలో ఉన్న కరెంట్ కాదు అది పనిచేసే తీరు మాత్రమే.
[4/28, 10:17] +91 73963 92086: బాహ్యదృష్టితో దేహాన్ని చూడగలుగుతున్నాం గానీ ప్రాణాన్నే చూడలేక పోతున్నాం. అందుకే మనకి అంతర్దృష్టి అలవడాలి. అపుడే అందరిలోనూ తానే ఉన్నానన్న కృష్ణుడి స్వరూపం తెలుస్తుంది. కృష్ణుడు తాను రూపం అనే ఉద్దేశ్యంతో ఆ మాట అనిఉంటే మనందరిలో స్కానింగ్ తీస్తే కృష్ణుడు కనిపించాలి. డాక్టర్ ఆపరేషన్ చేస్తే కృష్ణుడు కనిపించాలి. కానీ అలాలేదు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు ఆమాట చెప్పింది ప్రాణ స్వరూపంగా. అందరిలో ఉన్న ప్రాణమే కృష్ణుడు. మనలో ఉన్న ఆ ప్రాణాన్ని చూడలేము కనుక ఒక రూపంలో ఆయన్ని పూజిస్తున్నాం. కృష్ణుడ్ని పెనవేసుకుని ఉన్న 'రాధ' మనలోని ప్రాణ 'ధారే’. మనమందరం ప్రాణధారులం (ప్రాణాన్ని ధరించాం) అందరం ఆయన రాధలమే. మనలో ఉన్న మనసుని గ్రహింపు శక్తిగా గుర్తించిన రోజు మనలోని కృష్ణుడు ఏమిటో తెలుస్తుంది.

✳️ మనం అన్నం వండుకొని తిన్నా, మరొకరు వండింది తిన్నా రెండింటిలో తినటం ముఖ్యం. అలానే భక్తి ద్వారా విగ్రహారాధనలలోనూ, ఆధ్యాత్మిక సాధనలో, అంతరంగంలోనూ తెలుసుకొనేది ఆ పరమాత్మ ప్రాణ స్వరూపాన్నే. ఆత్మ,  దైవానికి భిన్నమైతే దైవానికి ఆత్మలేక పోలేదని శ్రీ రమణ భగవాన్ అంటున్నారు. మనం పూజించే రాముడు, కృష్ణుడు కూడా మనలాంటి దేహాలు మాత్రమే అయితే పూజించటం ఎందుకు. మనం పూజించేది వారిమనసులను. కృష్ణుడు, రాముడు ఒకే విష్ణు అంశలైనా జీవన విధానాలు భిన్నంగా ఉన్నాయి. అందుకే మనందరిలోనూ ఆ పరమాత్మే ఉన్నా జీవితాలు వేరు వేరు. 

✳️ *అద్దం అనే వస్తువు గుణం ఒక్కటే. కానీ అందులో ప్రతిబింబించే విషయాలు వేరు. అందుకే వేల కొద్ది అద్దాలను మనం వేరు వేరు అనుకుంటున్నాం. మంగలి షాపులో ఉన్నా, నగలషాపులో ఉన్నా, దేవాలయంలో అద్దాల గదిలో ఉన్నా,  అద్దం చేసే పని ఒక్కటే. ఉపయోగాలు వేరువేరు. అందరిలోనూ ప్రాణం అద్దంలాగా ఒకే తత్వంతో ఉంది. కాకాపోతే స్వచ్ఛంగా కనిపించేది ఒకటి, మసిబారింది ఒకటి, సక్రమంగా ఉంది ఒకటి. మూలపగిలింది మరొకటి. అలానే మనందరి లోనూ ఉన్న ప్రాణం ఒక్కటే అయినా అజ్ఞానంతో కప్పబడిన ప్రాణం, జ్ఞానంతో ప్రకాశించే ప్రాణంగా తేడా ఉంది. అజ్ఞానం, జ్ఞానం రెండూ మనసువే.*

✳️ దైవం కేవలం చేతనలేని సత్య వస్తువే అయితే మన ప్రార్థనకు ప్రయోజనం ఉండదు. మనం కలుషిత మనసుతో అనుకుంటే కాని పనులు ఆ చైతన్యానికి ఏకరువు పెడితే ఎలా అవుతున్నాయి. మనం వందసార్లు అనుకున్నా కానిపని పెద్ద ఆఫీసర్ ఒక్కసారి అనుకుంటే అవుతుంది. మనం భగవంతుని విగ్రహం ముందు మన కోర్కెలను తెలుపుతాం. అవి ఎలా తీరుతున్నాయంటే భక్తితో మన మనసు చేసే సంకల్పాలు మనలో (ఆ విగ్రహంలో) ఉన్న చైతన్య స్థాయిని తాకుతాయి. కనుక అక్కడ భగవత్ శక్తి వలన పనులు జరుగుతాయి. నాస్తికుడికి తాను దేహం అనుకోవటం చేత ఆ భావన గానీ అనుభూతిగానీ ఉండదు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు🙏
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment