🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"535"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*""ఏకాగ్రతను ఏ విధంగా కుదుర్చుకోవాలి ?""*
*"గురువు అనుగ్రహంతో లభించే దైవజపం శ్రద్ధగా సాగితే మనసుకు ఒకే విషయాన్ని ఆలోచించటం అలవాటవుతుంది. దీనివల్ల ఏకాగ్రత కుదురుతుంది. ఇప్పటికే మన మనకు అనేక విషయాల్లో ఏకాగ్రత కుదురుతూనే ఉంది. ఆ ఏకాగ్రత మనసు ఇష్టపడే విషయాల్లో మాత్రమే ఉంది. సినిమా చూసేటప్పుడు, పేపర్ చదివేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనం ఏకాగ్రతతోనే ఉంటున్నాం. మనసు ఇష్టపడే విషయంలో కాకుండా మనం అనుకున్న విషయంలో ఏకాగ్రత సాధించటం నేర్చుకోవాలి. సంఘటనల ద్వారా సంతోషదుఃఖాలలో ఏది వస్తే దాన్ని మనం అనుభవిస్తున్నాం. మనసు ఏకాగ్రత సిద్ధించి అనుకొన్న విషయంలో నిలపగలిగితే వచ్చే సంతోషదుఃఖాలను పైకి అనుభవిస్తూనే మనసు అంతరంలో ఆనందాన్ని పొందగలుగుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment