*:::::: విజ్ఞానం vs ఇంద్రియ విజ్ఞానం :::::::*
యుద్ధం చేసే వాడిని సైనికుడు అంటాం. కాపలా కాసే వాడిని కాపలాదారుడు అంటాం. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే వాడిని కూడా సైనికుడు అనే అంటాం. కాపలా లో ఉత్పత్తి కంటికి కనపడదు. పోగొట్టు కాకపోవడం అనే స్థితి అది.
ఇంద్రియ విజ్ఞానం ద్వారా ఏమిటి అన్నది తెలుస్తోంది.
విజ్ఞానం ద్వారా ఏమిటి అన్నది తెలియదు కాని తెలుస్తూ వుంటుంది. కాని ఏమిటి తెలుస్తోంది అని చెప్పలేము.
సైనికుడు కాపలాకాసి ఏమి సాధిస్తున్నాడు?
చక్షు విజ్ఞానం అనగా కంటి ద్వారా తెలియడం. కన్ను లేకుంటే చూడలేము.
విజ్ఞానం లేకుండా కన్ను ఉన్నా చూడలేము.
సైనికుడు లేకుండా యుద్ధం చేయలేము. యుద్ధం లేకున్నా సైనికుడు వుంటాడు. తెలుసు కునేది లేకున్నా విజ్ఞానం వుంటుంది. తెలుసు కున్నది ఏమిటో చెప్పాలి అంటే జననేంద్రియాలు తోడు అవ్వాలి. అప్పుడు అది ఇంద్రియ విజ్ఞానం అవుతుంది.
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment