🎻🌹🙏 భక్తుడు భగవంతుని పై - ఎలాంటి విశ్వాసం కలిగి వుండాలి....??
🌿త్రిజటుడు అనే బీద బ్రాహ్మణుడు, రాముడు అరణ్యానికి వెడితే తిరిగి వచ్చేవరకూ నేను బ్రతుకు తానే లేదో అని, ఎన్నో శ్రమలకోర్చి, రాముని దర్శించుకున్నాడు...
🌸ఆసమయంలో రాముడు తన సమస్తమూ, దానం చేస్తున్నాడు, రాముడు ఆ బ్రాహ్మణుని కూడా ఏమి కావాలో కోరుకో మన్నాడు,
🌿రామా! నీ దర్శన స్పర్శన సంభాషణలే నాకు చాలు అన్నాడు...
🌸నాయనా! నీ ప్రేమను నేనందు కొన్నప్పుడు, నా ప్రేమను నువ్వు అందుకోవాలని, ఆ వృద్ధుని ఆలింగనం చేసుకున్నాడు, దయామయుడు
శ్రీ రాముడు...
🌿ఆ వృద్ధుని చేతిలో చిన్న కఱ్ఱ ఉంది, అది విసర మన్నాడు శ్రీ రాముడు...
రామాజ్ఞను అనుసరించాడు, కఱ్ఱను విసిరి వేశాడు, కేవలం శ్రీ రామచంద్రుడు పై ప్రేమతో...
🌸విసిరిన కఱ్ఱ సరయూనది అంతా చుట్టు ముట్టి, తిరిగి వచ్చిందట...
రాముని స్పర్శ వల్ల అనంతమైన శక్తి వచ్చింది, అనగా అనేక గోవులు, భూములు, భవనములు ఆ బ్రాహ్మణుని స్వాధీనమై పోయాయి...
🌿ఇంత బరువు నాకెందుకు రామా, అని వృద్ధుడు పలుకగా ...
బ్రాహ్మణోత్తమా! ...
🌸ఇది నీ జన్మాంతర ప్రాప్తి, నేను అరణ్యానికి వెడు తున్నానని తెలిసీ రాలేకపోయిన వారెంతోమంది వున్నారు....!
🌿కనుక నీ భావమే నా ప్రేమకు మూల కారణం అన్నాడు, ఈవిధంగా త్యాగము, దానము రెండూ ప్రధానమనే ఆదర్శాన్ని రామ తత్వం బోధించింది...
🌸భగవంతునికి ఏది కొంత సమర్పించినా చాలు, అది సంపూర్ణమైన విశ్వాసంతో వుండాలి, ప్రేమతో సమర్పించాలి, అంతా ఆయనదే అనే భావంతో వుండాలి ...
🌿దానికి మనకు వెయ్యి రెట్లు అధికంగా తిరిగి ఇస్తారు... అది ఎప్పుడు మరిచి పోకూడదు...స్వస్తీ..🚩🌞🙏🌹🎻
No comments:
Post a Comment