*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 69 / DAILY WISDOM - 69 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 9. అన్ని సత్యాల సత్యం 🌻*
*ఉపనిషత్తు మనల్ని ఆచారాల నుండి ఆరాధనలకు, ఆపై ఆధ్యాత్మిక భావనలకు తీసుకువెళుతుంది. ఆలోచనకు బాహ్యం నుండి అంతరానికి మరియు అంతరం నుండి విశ్వానికి క్రమంగా ఆరోహణ ఉంది. మనము ఈ బాహ్య ప్రవర్తనా విధానాలనుంచి అంతర్గత మానసిక విషయాల్లోకి వెళ్తాము. ఈ మానసిక విషయాలే బాహ్య ప్రవర్తనలకు కారణం. అప్పుడు ఈ మానసిక కారకాలకు సైతం కారణమైన అస్తిత్వం గురించి ధ్యానిస్తాము.*
*మనం బయట చేసేది మన మనస్సులో ఏమనుకుంటున్నామో దాని వల్ల నిర్ణయించబడుతుంది. మన మనస్సులో మనం ఏమనుకుంటున్నామో అది మన నిజస్వభావాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇక్కడ బాహ్య నామ,రూప కర్మల స్థాయి నుంచి అంతర్గత ఆలోచనా విధానాల వరకు ధ్యానం వృద్ధి చెందుతుంది. అక్కడ నుంచి తన స్వంత ఆలోచనా విధానాల నుంచి విశ్వ ఆలోచనా ప్రక్రియలకు, అక్కడనుంచి అన్ని ఉనికిలకు కారణమైన, ఉపనిషత్తుల్లో సత్యస్య సత్యంగా చెప్పబడిన విశ్వ అస్తిత్వం లోకి ఎదుగుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 69 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 9. The Truth of All Truths 🌻*
*The Upanishad takes us from ritualistic concepts to religious adorations, and then to spiritual visualisations. There is, again, a gradual ascent of thought, from the outward to the inward, and from the inward to the Universal. We withdraw from the outward mode of behaviour to the inward psychological factors which determine these external modes of behaviour, and then we contemplate the Being that is precedent even to psychological behaviour.*
*What we do outside is determined by what we think in our minds, and what we think in our minds is conditioned by what we are in our true selves. So, there is a process of the rise of contemplative action from the outer realm of name, form and action to the inward thought-processes of the individual, and to thought process in general, leading to ‘being’, not merely to the individual’s apparent being, but to the Being of all beings, which the Upanishad would describe as satyasya satyam, or the Truth of all truths.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment