💖💖💖
💖💖 *"537"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనసు సంతోషాన్ని, ఆనందాన్ని బయటి నుండి పొందుతుందా ? తనలోనుండే తాను పొందుతుందా ??"*
*"ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు మనసు ఆనంద పడుతుంది. ఈ ఆనందంలో దృశ్యం తాలూకు సంతోషంతోపాటు మనసు ఆ విషయంపై నిలిచినందువల్ల వచ్చే శాంతి కూడా కలిసి ఉంటుంది. సంతోషపడాలంటే మనసుకు మరొక విషయం కావాలి. కానీ తనలోనేవున్న శాంతిని పొందటానికి నిలకడగా ఉంటే చాలు. మనం ఏదైనా పనిలో లీనమైనప్పుడు జరిగేది అదే. మనసు నిలకడలో దాని నుండి అదే ఫలాన్ని పొందుతుందన్న విషయాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజు ప్రతి పనిలోనూ ఆ శాంతిని గుర్తించి ఆనందంగా జీవించవచ్చు. ఎందుకంటే మనసులో ఆ ధ్యానం జరుగని క్షణం ఏదీ ఉండదు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment