💖💖💖
💖💖 *"534"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి బోధ !"*
*"శ్రీరామచంద్రుడు : బ్రహ్మము శుద్ధము, అతని నుండి మాయ పుట్టుట ఏమి ? అతనినే మాయ కప్పుటేమి !?"*
*"వశిష్ట మహర్షి : గాఢ వైరాగ్యమున్న శుద్ధమనసులో ఈ ప్రశ్న జనించదు. నిజమును అద్వైత వాదంలో జీవ, ఈశ్వర, మాయకు తావులేదు. తనలో తాను మునుగగా, వాసనలు పూర్తిగా నష్టమై ఈ ప్రశ్నలకు సందివ్వవు.*
*"శ్రీరామచంద్రుడు : ఆత్మ నుండి జీవుడేట్లు కలిగినాడు ?"*
*"వశిష్ట మహర్షి : నీ యదార్ధస్థితిని తెలుసుకో, నీకీ ప్రశ్న రాదు. తాను వేరని ఎవరైనా ఎందుకు అనుకోవలె ? పుట్టుక పూర్వం తానెట్లున్నాడు ? చనిపోయిన తర్వాత ఎట్లుండబోతాడు ? ఇట్టి ప్రశ్నలతో కాలం వృధా పోవటం ఎందుకు ? నిద్రలో నీ రూపేమి ?* *నిన్ను నీవొక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు ?"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment