❤️గురువుని సేవించడమంటే
హృదయమును ప్రేమించడమే❤️
🙏🏻 సద్గురు రమణా...శరణం శరణం శరణం 🙏🏻
హరి హార మయము
సముద్రంలో మునిగిన కుండ వలె
నా బయటా లోపలా అంతా ఆత్మే నిండివున్నది.
ఆత్మలో మునిగిన కుండలే సకలజీవులు.
నాలో - నేను అంటే
నాలో అనేది అహం,
నేను అనేది దేహం,
1.అహంలో దేహం ఉంది,
2.దేహంలో అహం ఉంది,
మొదటి అహం పేరు ఆత్మ
రెండవ అహం పేరు మనసు.
"నేను" ఉన్నది
"నాలో ఉన్న సకలమూ" ఉన్నట్లున్నది.
కుండలో సముద్రం ఉండడం సత్యం,
సముద్రంలో కుండ ఉండడం పరమసత్యం.
నాలో ఆత్మ ఉండడం సత్యం,
ఆత్మలో నేను ఉండడం పరమసత్యం.
నేను పలానా ను అనేది సత్యం,
నేను బ్రహ్మమును అనేది పరమసత్యం.
ఎందెందు వెతకి చూచినా,
అందందే గలడు,
హరిమయముగాని ద్రవ్యము,
పరమాణువు లేదు.
నా శరీరం కోట్ల అణుసముదాయం...
నేను హరిమయము కానా?
ఇక సాధన దేనికి?
అన్వేషణ దేనికి?
కాలము, దేశము నాలోనివే,
దేవుడు, జీవుడు నాలోనివే,
నేను, నాది నాలోనివే.
జ్ఞానము, అజ్ఞానము నాలోనివే...
సుఖము, దుఃఖము నాలోనివే...
బంధము, మోక్షము నాలోనివే...
నన్ను విడిచి దేనికీ ఉనికి లేదు...
నేను తప్ప మరేదీ లేదు,
నేను మాత్రమే ఉన్నాను.
* * *
No comments:
Post a Comment