- వి . లక్ష్మిశేఖర్ .... - 20.04.2023.
[4/27, 09:49] +91 73963 92086: హరిఓం ,
అందరి దృష్టిలో ఐశ్వర్యం అంటే ధనం మాత్రమే.కానీ ధనం మనిషి బ్రతకడానికి ఒక మీడియా మాత్రమే.ఏమి సాధించాలి, అన్నా ధనమే కావాలి, కాబట్టి ధనం మాత్రమే శాశ్వతం అని మనుష్యులు అందరూ దాని చుట్టూ తిరుగుతూ తమ జీవితాన్ని వృధాగా చూసుకుంటున్నారు.కానీ వాస్తవానికి మానవ జన్మ ఉత్తమైనది,మరియు ఎంతో గొప్పది మరియు దర్లభమైనది.నేను శరీరం కాదు పరమాత్మ నుండి ఉద్భవించిన ఆత్మ శకలాన్ని నేను చేసిన సృష్టి ఈ సంపదలు,నేను జీవించడానికి సృష్టి చేసిన వసతులు, నేను కోరుకుంటే ఇవన్నీ నావద్దనే ఉంటాయి.నేను వాటికోసం ప్రతీ నిత్యం ప్రాకులాడవలసిన పని లేదు, నేను కోరుకున్నా తక్షణమే అవి నాముందు ఉంటాయి , అన్న జ్ఞానం మరిచాడు.కారణం ఏమంటే తాను ఆత్మ స్వరూపం అనిమరచి ,తాను శరీరం అని తలచి ధనం ఎక్కడో ఉంది తాను దానిని సంపాదించడానికి ఎంతో ప్రయాస పడలి, నిరంతరం కష్టపడాలి అని అనుకుంటూ తన యొక్క నిజ తత్వాన్ని మరచి తాను సృష్టించిన ధనం చుట్టూ తిరుగుతూ బ్రతుకుతున్నాడు. తాను సృష్టించిన దానికోసం తానే పరిగేడుతున్నాడు.ఇది విచిత్రం.తాను ఎవరో, పరమాత్మ ఎవరో తెలుసుకొనన్నంత వరకుఈ జంజాటం తప్పదు.తాను శరీరం కాదు , ఆత్మను అని తెలుసుకుంటే చాలు తనకు కావలసినవి అన్ని తనవెంట ఉంటాయి.
మనిషి – ఆత్మ – పరమాత్మ ఇవన్నీ………
నేను ఎవరు ,నా గమ్యం ఏమిటి పరమాత్మ అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు అని తెలుసుకోవాలి.
అణువులకు పరిమితమైన స్థితి లో జీవులు ,ఉన్నపుడు భగవంతుడు సృష్టి చేశాడు. మనకు (జీవులకు) ఉపాధి చేకూర్చాడు. అయితే నేను ఎవరు? ఈ శరీరమా? కాదు అది ఉట్టి ఉపాధి మాత్రమే. మరి నేను ఎవరు? మనసా? కాదు. బుద్దా? కాదు మరి శరీరమూ కాదు,ఎందుకంటే శరీరం అనేది ,మనకున్న అనుభూతి కారకం. మరి నేను ఎవరు? నాశనం లేని ఒక అంశ. భగవంతుని అంశ. అదే ఆత్మ..........
భగవంతుని తో ,దైవంతో ,పరమాత్మ తో , పూర్ణాత్మతో (మీరు ఏ పేరు ఐనా పెట్టుకోండి )వేరుపడి, అనేక ఉపాదులలో జీవించి, చివరకు మానవ జన్మ తీసుకున్నాము. ఈ జ్జన్మలో మనం జీవిస్తూ , ఆనందంగా ఉంటూ, అనుభవాన్ని పొండుతూ ,పరమాత్మ లో ఐక్యం పొందడం ఈ ఆత్మ తత్వం. ఆ క్రమంలోనే ఇప్పుడు మనమున్నాం.
మరి మనం ఏమి చేయాలో అర్థం కాక, ఈ సాంసారిక జీవితం లో కొట్టుమిట్టాడుతూ కేవలం కోరుకుంటే వచ్చే అశాశ్వతమైన వాటిని శాశ్వతంగా భావించి, శాశ్వత శివ సాయుజ్యాన్ని గుర్తించలేక ఉత్తమ జన్మ ఐన మానవ జన్మను వృదా చేసుకుని ఇదే గతిలోనో అధోగతిలోనో తిర్యక్ జన్మలలో తిరుగుతూ ఉంటాము. ఇది కాదు మన గమ్యం.
అజ్ఞానం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది, అజ్ఞానం అంటే చీకటి .చీకటి లోనే వెలుగు విలువ తెలుస్తుంది. అపనమ్మకం నుండి నమ్మకం పుడుతుంది. ఇది ఈ జ్ఞానాన్ని గురువు ద్వారా మాత్రమే తెలుస్తుంది.మరి ఆ గురువు? మీ అంతరాత్మే మీ గురువు. మీరు మీ గురుంచి తెలుసుకోవాలి అని అనుకున్న తక్షణమే మీ అంతరాత్మ బాహ్య గురువుని మీ ముందు ఉంచుతుంది. బాహ్య గురువు మీ లోనికి పంపుతాడు.ఆయన కూడా మీకు మీ అంతరాత్మకు ఒక మీడియా మాత్రమే... అసలు గురువు, దైవం మీ పుర్ణాత్మే .. అదే మీ అంతరాత్మగా నిలిచి ఉంది... నేను ఆత్మ స్వరూపం , నేను బ్రతకడానికి ఈ శరీరం ఒక మీడియా గా తీసుకున్నాను, నేను బ్రతకడానికి నాకు వసతులు కావాలి అని అనుకున్నంత మాత్రాన మనకు అన్ని వనరులు,వసతులు ఏర్పడుతాయి. కానీ నేను శరీరం అని అనుకుంటే మాత్రం మనం వాటిని సంపాదించడానికి నిరంతరం కష్ట పడుతూనే ఉండాలి, వాటి వెంట పరిగెడుతూనే ఉండాలి, అవి మనకు అందకుండా పోతూ మనల్ని పిచ్చి వాళ్ళుగా చూస్తూనే ఉంటాయి.
పాపం – పుణ్యం.
ఇవి రెండూ పరస్పర సంబంధం లేని బ్యాంకు అకౌంట్లు లాంటివి. పాపం కష్ట కారణమైతే, ఐశ్వర్యం పుణ్య కారణం. ఇలా పాప, పుణ్యాల సమీకరణ లో మాయా ప్రపంచం చాలా అందంగా కనిపించి మనలను గుడ్డి వాళ్లను చేస్తుంది. ఎది చేసినా మన గమ్యం మారరాదు. మారితే మరికొంత కాలం ఇక్కడే , ఉండవలసి వస్తుంది.మరలా, మరలా జన్మను తీసుకోవలసినదే....మరి ఈ కర్మను సరిగా చేయడం ఎలా?
సులభమైన మార్గం మన కోసం, మన పూర్వీకులైన ఋషులు చెప్పిఉన్నారు. అదే భక్తి మార్గం. భక్తి నవ విదాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, పరమాత్మకు నివేదనం నవవిధ భక్తి మార్గాలు. ఈ మార్గంలో మనం అరిషడ్వర్గాలను జెయించాలి. జయిస్తాం కూడా...
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములు అరిషడ్వర్గాలు. ఈ ఆరింటినీ అదుపులో ఉంచడమే జయించడం అంటే. అప్పటికి గానీ తెలియదు ఆత్మ పరమాత్మ వేరుకాదు. రెండూ ఒకటే అని... ఇదే అద్వైత సిద్ధాంతం. మనసు ప్రమేయంతో ఎప్పుడూ ఆత్మ పరమాత్మనే తలుస్తూ అన్నింటికీ ఆ దేవ దేవుడే కారణంగా అని తలిస్తే ఇక ఎ బాదలూ బదనాయాలూ ఉండవు. అంతా ఆత్మానందం. పరమానందం.
జనన మరణాలు దైవాధీనాలు. మరణం శరీరానికే గానీ ఆత్మకు కాదు. శరీరంలో చైతన్యం ఉన్నంత కాలం మనసు శరీరానికి అనుసంధానమై ఉంటుంది. బుద్ధి కర్మానుసారి అంటారు. మనస్సు మనిషిని పరి పరి విధాలుగా ఆలోచింపచేసి అనేక సుఖ దుఃఖాలకు కారణమౌతుంది. జీవమున్నంత వరకు మనస్సును మంచి మార్గంలో ఉంచడానికి దర్మాచరనే ముఖ్యం.
[4/27, 09:49] +91 73963 92086: దర్మాచరనను శాస్త్రాలద్వారా తెలుసుకొనవచ్చు. కష్టతరమైనా ధర్మాన్ని అనుసరించాలి. అదే సులభ మార్గం.
దేవ విధిలో భాగంగా ప్రాణమున్నంత కాలం దర్మాచరణ పాటిస్తే, ప్రణాళిక సక్రమంగా సాగినట్లే. సుఖ దుఃఖాలకు పరమాత్మే కారణమని నమ్మితే అసలు సమస్యే లేదు. ఎన్ని జన్మలెత్తినా విసిగి వేసారే పని లేదు. అంతా సంతోషమే. అంతా ఆనందమే. నిత్యానందం. పరమానందం.
మరి ఈ జన్మలోనే ఈ విషయం మనకు తెలిసింది కాబట్టి ఈ రోజునుండి, ఈ గంట నుండి ఈ క్షణం నుండే మనం భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుందాం...మన పూర్ణాత్మతో మమేకమై ఉందాం....నిరంతరం ఆయనతో ఉంటే చాలు అన్ని మనం కోరకుండానే అన్ని ఆయనే మనకు సమకూరుస్తాడు.అంటే మరలా ఆయన ఎక్కడో ఉన్నాడు అని అనుకోకండి.మీలోనే ,మీలానే లోపల,బయట ,అన్నిటి లోనూ అందరిలోనూ , అంతటా మీరు కోరుకున్న వాటన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు.మీరు కురుకున్నా, కోరుకున్నా మీకు యెప్పుడు,అవసరమో అన్ని వాటంతట అవి వాటికవే అన్ని సమకూరుతాయి..... - - 🙏🙏 ....
No comments:
Post a Comment