Sunday, April 23, 2023

శ్రీరమణీయం: అసలు మన యదార్ధ నిజస్థితి ఏమిటి ? అదెలా ఉంటుంది !?

 💖💖💖
       💖💖 *"533"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"అసలు మన యదార్ధ నిజస్థితి ఏమిటి ? అదెలా ఉంటుంది !?"*

*"మన నిజస్థితి మనకు తెలియకపోవటమే మాయ. మన నిజ, యదార్ధ, సహజస్థితి శాంతే. మన మనసుకు రెండు రకాల భావాలు తెలుసు. ఒకటి సంతోషంగా ఉండటం. రెండోది దుఃఖపడటం. ఈ రెండూ కలగనప్పుడు మన మనసుకు ఒక స్ధితి ఉంటుంది. అంటే ఏ ఆలోచన కలగని స్థితి. పరీక్షలు వ్రాసిన విద్యార్థి ఫలితాలు వచ్చే రోజు వరకు నిర్లిప్తంగా ఉంటాడు. అది అతడి సహజత్వం. ఫలితాలు చూసినప్పుడు ఉత్తీర్ణుడైతే సంతోషిస్తాడు. లేదంటే దుఃఖిస్తాడు. ఈ రెండింటికీ మధ్య ఉన్న మొదటి స్థితే వాడి నిజస్థితి. అలాగే ఆధ్యాత్మికంగా నేను ఆత్మనా ? దేహాన్నా ? అనే ప్రశ్నలు కలుగని స్థితి మన యదార్ధస్థితి. శాంతిగా ఉండటం అంటే మనసుకు ఏ అశాంతి కలగకపోవటం. శాంతి ప్రత్యేకంగా వచ్చేది కాదు. శాంతే మన సహజస్థితి. అశాంతే వచ్చి పోతూ ఉంటుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
               

No comments:

Post a Comment