Tuesday, April 25, 2023

ప్రశ్న :- ఎంత ప్రయత్నించినా, మనస్సు లోపలికి వెళ్ళదు. ఎందుచేత?

 🌹ప్రశ్న :- ఎంత ప్రయత్నించినా, మనస్సు లోపలికి వెళ్ళదు. ఎందుచేత?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

అభ్యాసము వల్లా, వైరాగ్యం వల్ల అది జరుగుతుంది.

కానీ నెమ్మదిగా ఫలిస్తుంది.

పొరుగువారి పొలాలలోకి వెళ్ళి గడ్డిని మేయటానికి అలవాటు పడ్డ గోవుని పాకలో ఉంచడం కష్టం.

మనస్సు అంతే.

పాలేరు ఆ గోవుకి ఎంత మంచి గడ్డిని ఇచ్చినా, మొదట్లో అది తీసుకోదు.

కాస్సేపటికి కొద్దిగా తీసుకుంటుంది.

అవకాశం రాగానే, తన స్వభావన్ననుసరించి బయటకి పోతుంది.

పాలేరు అట్లా ప్రలోభపెట్టగా, పెట్టగా పాకలో ఉండటానికి అలవాటు పడుతుంది.

ఇక దానిని కట్టేయకుండా విడిచినా, బయటికి పోదు.

మనస్సు అంతే, లోపలి ఆనందాన్ని చవిచూస్తే బయటకి వెళ్ళదు.


..... సేకరణ : నీ సహజ స్థితిలో ఉండు, ఆంగ్లమూలం డేవిడ్ గాడ్ మ్యాన్, తెలుగు అనువాదము పింగళి సూర్య సుందరము


.... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్

No comments:

Post a Comment