Sunday, April 23, 2023

శ్రీరమణీయం:అంతర్ముఖం అంటే ఏమిటి ? ఆ స్థితి ఎలా ఉంటుంది !?

 *

                 💖💖💖
       💖💖 *"531"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"అంతర్ముఖం అంటే ఏమిటి ? ఆ స్థితి ఎలా ఉంటుంది !?"*

*"తనలో తాను మునిగి ఉండటాన్ని అంతర్ముఖం అంటారు. వివరంగా చెప్పాలంటే.. మన మనసుకు ఏ వెలితి లేనిస్థితి వైరాగ్యం. ఏ విషయంలో మనసు వెలితి పడుతుందో అందులోనే మనకు మాయ ఎదురవుతుంది. అలా వెలితి ఏర్పడటమే మన బలహీనతలుగా కనిపిస్తాయి. ఏ విషయంలోనూ లోటు అనిపించని విరాగిని ఎవరూ మాయ చేయలేరు. మనకు ఆ స్థితిలేదు కనుక ఏ విషయంలో మనకు లోటుఏర్పడితే ఆ విషయంలో మాయ అవరిస్తుంది. వైరాగ్యం వచ్చిన మనసే శుద్ధమనసు. అంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న మనసు అని అర్ధం. అంటే ఏ విషయంలోనూ కించిత్ కూడా కదలని మనసు. దాన్నే అంతర్ముఖం అంటారు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment