Saturday, April 29, 2023

క్షణం విత్తం క్షణం చిత్తం* *క్షణం జీవితమావయోః* *యమస్య కరుణా నాస్తి* *తస్మాత్ జాగ్రత జాగ్రత*

 🌹*క్షణం విత్తం క్షణం చిత్తం*
*క్షణం జీవితమావయోః*
*యమస్య కరుణా నాస్తి*
*తస్మాత్ జాగ్రత జాగ్రత*🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

💕~క్షణం భాగ్యం, క్షణం భోగం. జీవితమే క్షణ భంగురం.యమునికి దయ లేదు. కనుక జాగరూకతతో వ్యవహరించు.
🌺జీవితం క్షణ భంగురం, అందులో భోగం క్షణమే, భాగ్యమూ క్షణమే! యముడు కరుణ లేనివాడు, అయ్యో వీడు ధర్మాత్ముడు కొద్ది కాలం ఉండనిద్దాం, వీడు దుర్మార్గుడు వీణ్ణి తొందరగా తీసుకుపోదామనుకోడు. సమయం వచ్చిన వెంఠనే ఎవరైనా సరే ఏ అవస్థలో ఉన్నా సరే పాశం తగిలించి జీవిని తీసుకుపోవడమే ఆయన కర్తవ్యం. అందుకే ఆయనకు సమవర్తి అని పేరు. అటువంటి యముడు ఎప్పుడు వస్తాడో తెలియదు. తస్మాత్ జాగ్రత్త.
💕జీవితంలో జరిగేవాటిని, జరగుతున్నవాటిని వాటిని గురించిన హెచ్చరిక ఇది. 
🌺మొత్తంగా చూస్తే జీవితం క్షణభంగురం, నీ తరవాతేమీ లేదు, నీతోనే అన్నీ ఉన్నాయి, గుర్తించు.
💕నరులనుకూడా జంతువులన్నారు కదా !
‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అని. జీవులన్నీ జంతువులే!అందులో నరజన్మ దొరకడమే గొప్ప! 
ఈ శ్లోకాలలో క్షణభంగురమైన జీవితకాలంలో జరిగేవాటి గురించిన పరివేదన గురించి చెప్పేరు.
❤️ *యావత్కాలం భవేత్కర్మ
తావత్తిష్టంతి జంతవః
తస్మిన్ఖ్షణే వినస్యంతి
తత్ర కా పరివేదనా*
💕~ఈ ఉపాధిలో (ఈ శరీరంతో) కర్మపరిపాకం ఎంతకాలముందో అంతకాలమే మానవులు జీవిస్తారు. కర్మ పూర్తైన మరుక్షణం మరణిస్తారు. ఇది సర్వ సహజం, దాని గురించిన పరివేదన వద్దు.
🌺 “ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా!” ఇది గంజాయి దమ్ము కొట్టిన బైరాగి పాట కాదు, సత్యం. 💕మానవులు మూడు కర్మలతో ఉంటారు. 
🌺సంచితం,ప్రారబ్ధం,ఆగామి. 
💕ఒకటి పుట్టుకతో కూడా తెచ్చుకున్న మూట. 
💕రెండవది ఈ జన్మలో పోగిచేసుకున్న మూట. 
💕మూడవది జీవితాంతానికి ఉండిపోయిన నిలవ, మరుజన్మకి తోడొచ్చేది. 
❤️జన్మ రాహిత్యం కావాలంటే మూట ఉండకూడదు. దాన్ని సాధించడం అంత తేలిక కాదు! 
💕పుణ్యమో పాపమో ఎంతో కొంత సంచిమొదలు తప్పదు. సంచి దులిపేస్తే, అది సాధిస్తే పరమ పదమే! జన్మ రాహిత్యమే! ఈ ఉపాధిలో అంటే ఈ శరీరంతో చేయవలసిన పని పూర్తైన వెంటనే, ఈ శరీరం నశిస్తుంది, దానికి చింతిల్లనవసరమే లేదు.
❤️ *ఋణానుబంధ రూపేణా
పశు పత్ని సుతాదయః
ఋణ క్షయే క్షయంయాంతి
తత్రకా పరివేదనా.*
🌺~ఎంత ఋణానుబంధం ఉన్నదో అంతకాలమే పశువుగాని,పత్నిగాని,
సుతులు మొదలైనవారు మనతో ఉంటారు. మనతో ఋణానుబంధం పూర్తికాగానే వెళిపోతారు. 
ఈ సహజప్రక్రియను అర్థంచేసుకోకుండా చింతించడం ఎందుకు?
💕~పశువులు,పత్ని,సుతులు మొదలైనవారంతా ఋణానుబంధం ఉన్నంత కాలమే మనతో ఉంటారు. మనకి వారుగాని, వారికి మనంగాని ఉన్న ఋణం తీరిన తరవాత వారి దారిన వారు చెల్లిపోతారు. ఇది ఎంతకాలమో తెలియదు. 
💓ఎవరు ఎవరికి బాకీ తెలియదు. మన సంతానమంతా, మనకి బాకీదార్లు. అందుకే పెద్దలు పిల్లల చేతినుంచి డబ్బు తీసుకోడానికి ఒప్పుకోరు. పక్కన ఉంచమంటారు. ఈ బాకీలు ఏ రకమైనా కావచ్చు. 
💝కొంతమంది మంచిమాట చెప్పి కూడా తిట్లు తింటుంటారు. ఇలా మంచిమాట చెప్పేవారంతా బాకీదార్లు. వారు అలా మంచిమాటలు చెప్పి హెచ్చరిక చేయక మానలేరు. 
💕కాలంతో బాకీ తీరిపోతుంది, ఆ తరవాత ఇలా మంచిమాట చెప్పేవారు కూడా జీవితంలో దొరకరు. ఆతర్వాత చింతించీ లాభంలేదు🕉️🚩🕉️

No comments:

Post a Comment