*నాన్న గారు చెప్పిన శివరాత్రి మహిమ.....*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱 శివరాత్రి మొత్తము రుద్రశక్తే. ఎంత మనము అనుసంధానం చెందితే అంత శక్తి, సంవత్సర మొత్తమునకు సరిపడా వచ్చేస్తుంది. రుద్రుడు అలాంటివాడు. రుద్రులలో శంకరుడు సత్వగుణ సంపన్నుడు. రుద్రుడుని The cosmic will అంటారు. అంటే దివ్య సంకల్పము.
⚜️ పనులు కాకపోయినా, మనిషి లోపలికి బాగా చచ్చుబడిపోతున్నా రుద్రం చేసుకోమంటారు. అవరోధములను రుద్రుడు అతని చూపుతోనే భస్మము చేసేస్తాడు. ప్రకృతిపరంగా అది ఒక శక్తి. రుద్రాభిషేకం చేస్తే శక్తి పెరుగుతుంది. ఇందులో ఏ మాత్రము సందేహము లేదు. మనము ఏదైనా అధర్మముగా ప్రవర్తించినపుడు రుద్రుడు లోపల నుంచే బాణాలు వేస్తుంటాడు.
🔱 *"ఏకాదశ రుద్రులు"* అంటే... *ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు మనస్సు.*
⚜️ 11 సార్లు నమకము చదివినప్పుడు ఇంద్రియములు శుద్ధి అవుతాయి. శివ సంకీర్తన, శివస్మరణ చేయడం వలన చుట్టూ ఉన్న ప్రపంచము రోగరహితముగా, బాధారహితముగా ఉంటుంది.
⚜️ *హరహర మహాదేవ* 🔱
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
*సేకరణ:*
No comments:
Post a Comment