Saturday, April 29, 2023

*పిల్లలకు సంస్కారం బోధిస్తే… “సుఖంగా” ఉంటారు.* *గుర్తుంచుకొండీ……….* *పిల్లలు… చెప్తే వినరు… పెద్దలు ఆచరిస్తుంటే(చేస్తుంటే) చూసి.., నేర్చుకుంటారు..!*

 కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక *అగరుబత్తి* డబ్బాను కానుకగా ఇచ్చాడు.. 
 
  అది చూసిన తల్లి… ముఖం చీదరించుకుని.., “మీ నాన్న ఎప్పుడూ ఇంతే… మహా పిసినారి..!” అంటూ లోపలికి వెళ్లి, మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది. 

     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని గదిలోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది.
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది. 
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.
ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది.. 

    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది.. 

      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  “నీ తండ్రిగా నీకు కానుక” ఇవ్వాలని చాలా ఆలోచించాను.. 

     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు.. 
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా పిసినారి అనుకుంటున్నావ్ కదా.?!
కాదు.. కాదు.!!

     “*మీ అమ్మ*”, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు *“అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో”*.., నువ్వుకూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..!

    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక.. 

     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి *“సంస్కారవంతమైన ఇంటి నుండి “* మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం… నిజంగా మేము ధన్యులం..!” అంది.

*పిల్లలకు సంస్కారం బోధిస్తే… “సుఖంగా” ఉంటారు.*

*గుర్తుంచుకొండీ……….*
*పిల్లలు… చెప్తే వినరు… పెద్దలు ఆచరిస్తుంటే(చేస్తుంటే) చూసి.., నేర్చుకుంటారు..!*
(అది… మెట్టినింట, *పుట్టింటి గౌరవం* నిలపాల్సిన “ఆడ”పిల్లలైనా.., మనకు *వృద్ధాప్యంలో/నిస్సహాయ పరిస్థితుల్లో తోడుగా* ఉండవలసిన “మగ”పిల్లలైనా.

No comments:

Post a Comment