*బాహ్య ముఖం vs అంతర్ముఖం*
1)ఆకాశం ఖాళీ గా ప్రశాంతంగా వుంది.
మనస్సు ఏ ఆలోచన లేక నిశ్చలంగా వుంది.
2)ఆకాశం మీదకు నలువైపుల నుండి మేఘాలు వస్తున్నాయి.
మనస్సులోకి విషయాలు జననేంద్రియాల ద్వారా జొరబడు తున్నాయి.
3)ఆకాశంలో మేఘాలు నల్లగా తయారు అవుతున్నాయి.
మనస్సులోని విషయాల చుట్టూ రాగ ద్వేష మోహాలు ముసురు తున్నాయి.
4)ఆకాశం ఏ క్షణంలో అయినా వర్షించడానికి తయారై వుంది.
మనస్సు ఏ క్షణంలో అయినా డిప్రెషన్ లో పడిపోనుంది.
5)ఆకాశం ఉన్నట్లుండి గాలులతో, మెరుపులతో, గర్జిస్తూ, వర్షిస్తుంది.
మనస్సు ఒక్కసారిగా ఆలోచనలతో, ఉద్వేగాలతో , అల్లకల్లోలంగా మారిపోయింది.
ఆకాశాన్ని గమనించడం బాహ్య ముఖం అయితే.
మనస్సు ను గమనించడం అంతర్ముఖం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment