Sunday, April 23, 2023

అరుణాచలంలో ప్రధాన దైవం ఎవరు? అరుణాచల గిరిప్రదక్షిణ ఎవరు ముందు చేశారు? ఎందుకు చేశారు?

 [4/9, 17:02] Ramana Samuham: అరుణాచలంలో ప్రధాన  దైవం ఎవరు?  అరుణాచల గిరిప్రదక్షిణ ఎవరు ముందు చేశారు? ఎందుకు చేశారు?
[4/9, 17:04] Ramana Samuham: స:అరుణాచలం లో ప్రధాన అధిష్టాన దైవం సకల లోకాలకు తండ్రి అయిన పరమేశ్వరుడు,సదా శివుడు.ఆ గిరి రూపంలో జనులందరికీ దర్శనమిచ్చేది ఆయనే.ఈ గిరికి మొట్టమొదటి ప్రదక్షిణ చేసింది సకల లోకాలకు తల్లియైన జగజ్జనని అయిన పార్వతీదేవి.దీనికి కారణం సకల జగత్తుకు కాంతులు ఇచ్చేవి ఆ పరమేశ్వరుడు కళ్ళు ఎందుకంటే ఆయననే వెలుగులకు కూడా వెలుగైన వాడు అలాంటి పరమేశ్వరుడి కళ్ళను ఆ తల్లి పరిహాసంగా తన చేతులతో కొన్ని క్షణాలు మూసింది.వారికి ఆ కొద్ది సమయం ఇక్కడ జగత్తులో కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి.జగత్తులో కాంతి లేక జీవులు విలవిల్లాడిపోయాయి.దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొమ్మని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పగా కొన్ని వందల సంవత్సరాలు భూమి మీదకు వచ్చి సాధారణ మనిషి వలే తన రూపం మార్చుకుని కంచి లో కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసింది.తర్వాత అక్కడి నుంచి అరుణాచలం వచ్చి ఇక్కడ ఆ ప్రాయశ్చిత్తం కోసం ప్రదక్షిణ చేసింది.చివరగా పార్వతి అమ్మవారికి శివుడు పవలకుండ్రు మీద దర్శనం ఇచ్చి నీ తప్పుకు పాప ప్రక్షాళన అయ్యిందని తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చి అర్ధ నారీశ్వరుడైయ్యాడు.అప్పటి నుంచి ఈ అరుణగిరి అర్ధనారీశ్వర కొండగా(ఈ గిరి సగ భాగం శివుడు  సగ భాగం అమ్మవారు) కూడా గుర్తించబడింది.

No comments:

Post a Comment