*ఓం నమః శివాయ*:
*🧘♂️శ్రీ గురు స్తోత్రం🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*1)అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- సమస్త విశ్వమంతటా చర-అచర వస్తువులన్నింటి యందు వ్యాపించిన పరమాత్మ తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువునకు నమస్కారములు.*
*2)అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |*
*చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- అజ్ఞానాంధకారంతో నిండిన నాకు జ్ఞానమనే కాటుక పెట్టి అంతః నేత్రం తెరిచిన సద్గురువునకు నమస్కారములు.*
*3)గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |*
*గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- పరమాత్మ తత్త్వరూపాన్ని అంతః దర్శనం చేయించిన సద్గురువే బ్రహ్మ గురువే విష్ణువు మరియు పరమేశ్వరుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమయిన సద్గురువునకు నమస్కారములు.*
*4)స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- స్థిరమైన, అస్థిరమైన అనగా నిరంతరం చలించే జీవులతో సహా చరాచర జగత్తు అంతటా వ్యాపించిన పరమాత్మ తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురుదేవునికి నమస్కరించుతున్నాను.*
*5)చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- పరమానందరూపుడై ముల్లోకాలలోని సకల చరాచర ప్రాణులలో వ్యాపించిన పరమేశ్వరుని తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువునకు నమస్కారములు.*
*6)సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |*
*వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- సకల వేద విదులు విరాజిల్లే పాదపద్మములు కల వేదాంత కమలంలో(వేదాంత కమలంలో ఆశీనుడవడం అనగా వేదాంతం ప్రతిపాదించిన బ్రహ్మ తత్త్వాన్ని ఔపోసన పట్టిన బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడని అర్ధం) ప్రకాశిస్తున్న సద్గురువునకు నమస్కారములు.*
*7)చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |*
*బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- నిరంతర చైతన్యుడు, శాంతస్వరూపుడు, అంతరిక్షం కంటే అతీతుడు (అనగా- హద్దులు లేనివాడు), నిర్మలుడు, సకల నాదాలకు (హత-అనాహతనాదాలకు) అతీతుడయిన సద్గురువునకు నమస్కారములు.*
*8)జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |*
*భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- పరమాత్మ తత్త్వరూపాన్నే ఆభరణంగా ధరించి, జ్ఞానపీఠాన్ని అధిరోహించి జిజ్ఞాసువుకు భక్తి-ముక్తి ప్రసాదించు సద్గురుదేవునికి వందనాలు.*
*9)అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |*
*ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- అనేక జన్మల నుండి ప్రోగు చేసుకొనిన కర్మ బంధనాలన్నింటినీ నాశనం చేయు ఆయుధమైన ఆత్మజ్ఞానం ప్రసాదించిన సద్గురు దేవునికి నమస్కరించుతున్నాను.*
*10)శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |*
*గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- దరిదాపు లేని భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న నాకు తన చరణామృతాన్ని ప్రసాదించి తత్త్వసారాన్ని తెలియచెప్పి భవసాగరం నుండి రక్షించిన సద్గురుదేవునికి ప్రణామాలు.*
*11)న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |*
*తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- తత్త్వజ్ఞానం లేకుండా పరమాత్మ ప్రాప్తి అసంభవం. ఆ తత్త్వజ్ఞానం, తద్వారా చేయు తపస్సు కన్నా వాటిని ప్రసాదించు సద్గురువువే అధికమయినవాడు (శ్రేష్ఠుడు). తత్త్వజ్ఞానం ప్రసాదించిన సద్గురువునకు నమస్కరించుతున్నాను.*
*12)మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |*
*మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- నాలోని ఆత్మవై, సకల జీవుల ఆత్మయై, నాకు నాధుడవై, సకల జగత్తుకూ నాథుడవై జగద్గురువుగా విలసిల్లుతున్న సద్గురుదేవునికి నమస్కారములు.*
*13)గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |*
*గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||*
*భావం:- ఆది-అంతమూ గురువే. గురువే పరమ దైవం. సద్గురువు కృపా-కటాక్షమూ లేకుండా పరమపద ప్రాప్తి అసంభవం. మోక్ష మార్గం సులభతరం చేసిన సద్గురువునకు నమస్కారములు.*
*14)బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ |*
*ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతంభావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||*
*భావం:- నిత్యం శోకరహితుడై బ్రహ్మానందంలో లీనమై అజ్ఞాన అంధకారానికి తావు లేక జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్న, ఆకాశ సమానంగా (ఎల్లలు లేకుండా సకల ప్రదేశాలలో భాసిస్తూ) తత్త్వమసి ఆదిగా గల ఉపనిషద్వాక్యాలు లక్ష్యంగా గల (అనగా- సద్గురువు శిష్యులకి లౌకిక లక్ష్యాలు కాక కేవలం అలౌకిక లక్ష్యాలనే నిర్దేశిస్తారు) ఏకమై, నిత్యమై, విమలరూపుడై, సకల క్రియ, కర్మలకు సాక్షీభూతమైన, భావాలకి అతీతుడయిన, సత్వ, రజో, తమో గుణాలకి అతీతుడయిన సద్గురుదేవునికి వందనాలు.*
*15)త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |*
*త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ||*
*భావం:- దేవదేవా – నీవే నా తల్లివి. నీవే నా తండ్రివి. నీవే నా బంధుడవు. నీవే నా మిత్రుడవు. నీవే నా విద్యవు (జ్ఞానమువు). నీవే నా సంపదవు. (బలమువు, శక్తివి). నీవే నా సర్వస్వమును.*
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment