[4/8, 16:54] +91 85198 60693: అరుణాచలం గిరి ప్రదక్షిణ మనుషులు జంతువులు మరియు దేవతలు చేస్తుంటారు మరి రమణ మహర్షి లాంటి జగద్గురువు చేయడం ఏమిటి? దీని అంతరార్థం ఏమిటి?
[4/8, 17:00] +91 85198 60693: స:ముల్లోకాల్లోని సమస్త శక్తి స్వరూపాలు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుంటాయి.కానీ భగవాన్ రమణులకు తాను తప్ప రెండవ వస్తువు,స్థితి లేదు అనే అద్వైత భావనలో రమించిపోతున్న మహా జ్ఞాని,పరమేశ్వర జ్ఞానాన్ని జనులందరికీ తేలికగా అర్ధమయ్యేట్టు చెప్పడానికి భూమి మీదకు వచ్చిన జ్ఞానాగ్ని, ఏకకాలంలో(ఒకటే సమయంలో)16లోకాలలో తన అవతార కార్యం నిర్వహిస్తున్నా అని ఆయనే స్వయంగా చెప్పిన గొప్ప సుబ్రహ్మణ్య అవతారం ఆయనకు ఆరుణాచల గిరి ప్రదక్షిణ వల్ల ఏ ప్రయోజనం లేదు.దాని వల్ల ఆయనకు శక్తి తగ్గదు శక్తి పెరగదు.ఆయనే పరబ్రహ్మము.ఆయనకు అష్ట సిద్ధులు దాస్యం చేస్తాయి.ఈ ప్రదక్షిణ వల్ల ఆయన ఇంకా పొందెదేమిటి.ఒకవేళ మోక్షం అనుకుంటే ఆయన చేతులతో పట్టుకున్న విత్తనాలు మొలకెత్తలేదు,ఆయన అనుగ్రహం పొందిన జీవులు మళ్ళీ పుట్టరు ఇది ఆయన చరిత్రలో జరిగిన సత్యాలు అందరికీ తెలిసిన విషయమే.ఆయన దగ్గరే మోక్షం కాచుకుని కూర్చుంటే ఆయనకు ఆ ప్రదక్షిణ వల్ల మోక్షం ఎందుకు.ఆయన ప్రదక్షిణ అంతరార్ధం ఏంటి అంటే ఆయనకు ఏదో వస్తుంది అని కాదు ఈ ప్రదక్షిణ మహాత్యం పుస్తకాల్లో మనిషి కంటికి కనపడని దైవ,ఋషి గణాలు చేస్తుంటారు అంటారు గాని మేమేమన్నా చూసామా అని కొందరూ బయల్దేరతారు ఈ ప్రదక్షిణ మహాత్యం తెలుసుకోవడానికి వాళ్ళు ఈ ప్రదేశానికి వస్తారు ఆహా దీని గొప్పదనం ఏంటి అట అని ప్రశ్నిస్తారు ఆలాంటి కాకమ్మ పురాణాలు మేము నమ్మము నమేట్టుగా ఎవరైనా ఈ ప్రదక్షిణ చేశారా అని చూపించాలి అంటే ఒక గొప్ప వ్యక్తిని ఉదాహరణకు చూపించాలి అదిగో అలా ఈ గిరి ప్రదక్షిణ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఆయన చేసి చూపించారు.ఈ విషయాన్నే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీత లో చెప్తాడు ఈ లోకమంతా ఏదైనా ఉత్తమమైన పని చెయ్యడానికి మహాత్ములను(ఉత్తమ పురుషులు) అనుసరిస్తుంది.దీని ద్వారా ప్రతి ఒక్కరు అంతటి గొప్పవాళ్ళు చేశారంటే మేము చేస్తాం అని బయల్దేరతారు అందుకే నాకు(శ్రీకృష్ణ భగవానుడు) ఏ కర్మ(పని)చేయడానికి లేకపోయినా లోకం కోసం చేస్తుంటాను అర్జునా అని వివరిస్తాడు.అందుకే భగవాన్ రమణులు ఈ ప్రదక్షిణ మహాత్యం గొప్పదనం అందరికి తెలియచెయ్యడానికి చేశారు తప్ప వేరే దేనికోసం కాదు.
No comments:
Post a Comment