Sunday, April 23, 2023

'నీలోకి' నీ ప్రయాణం

 _*'నీలోకి' నీ ప్రయాణం*_
🪷🥀🌹🥀🌹🪷🥀🌹🥀🌹🪷

🪷 వేదాంతంలో 'కస్తూరీ మృగం' గురించిన ప్రస్తావన ఉంటుంది♪.  

🪷 కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు♪. ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది♪. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు♪.

🪷 మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు♪.

🪷 పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు♪. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది♪? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు♪. కనుక, కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు♪. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇస్తాడు♪.

🪷 ‘నా ప్రతినిధిగా దీనిని తీసుకుని వెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనినీ ముంచండి' అని కృష్ణుడు పాండవుల చేతిలో దోసకాయ పెడతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు♪.

🪷 అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది♪.

🪷 'అదేంటి బావా! ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని పాండవులు కృష్ణుడిని అడుగుతారు♪. దానికి కృష్ణుడు నవ్వి, 'బావా ఎన్ని గంగ లలో మునిగినా దీని చేదు పోలేదు చూశావా♪?' అంటాడు.

🪷 ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు♪. _*ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.*_

🪷 _*మనిషి ప్రయాణం బయటకు కాదు♪. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి♪. ప్రపంచమంతా తిరిగినా చివరకు మనిషి ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.♪*_

🪷 పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు♪. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు♪.

🪷 జ్ఞానం ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు♪. అది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి. దానిని గుర్తించి, కనిపెట్టి మసులుకునే వారే విజ్ఞులు♪.

🪷 భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయిబాబా ఇంకా ఎందరో మహా యోగులు ఉన్న చోట నుంచి కదల కుండానే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు♪. 

🪷 అరుణాచలమే తన ఆశ్రమంగా చేసుకుని రమణ మహర్షి జ్ఞానసిద్ధి పొందారు♪.
షిర్డీయే వేదికగా సాయిబాబా సిద్ధి పొంది భక్తజనులకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించారు♪. వీరంతా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగులు♪.

🪷 _*ప్రయత్నం చేస్తే మనమూ అలా కాగలం. కానీ, మనపై మనకు నమ్మకం తక్కువ. ఇంకా జ్ఞానం, దేవుడు.. ఎక్కడో ఉన్నారని నమ్ముతూ దేశాలు తిరిగే అమాయకత్వం మనది.*_

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


*సేకరణ:* 

No comments:

Post a Comment