[4/7, 17:18] Ramana Samuham: అరుణాచలం గిరిప్రదక్షిణను దేవతలు యోగులు చేస్తూ ఉంటారు ఇది నిజమేనా? ఈ గిరిప్రదక్షిణ చేసే సమయంలో ఏ కోరిక కోరవద్దు అని అంటారు ఎందుకు?
[4/7, 17:20] Ramana Samuham: స:అరుణగిరి మొత్తం కొన్ని లక్షల సంవత్సరాలు అగ్నితో మండి మండి కేవలం ఉపసానలో తారాస్థాయికి చేరిన వాళ్ళు మాత్రమే ప్రదక్షిణ చేసేట్టు ఉండేది.తర్వాత వివిధ రూపాల్లో మారి ఈ కలియుగానికి రాతి శిలలతో ఉన్నది సామాన్య మనుషులు,రాజులు,మహా భక్తులు,జంతువులు ప్రదక్షిణ చెయ్యడానికి కరుణతో పరమేశ్వరుడు ఇలా దర్శనమిస్తున్నాడు.అస్సలు ప్రదక్షిణ కి ఫలితం ఏ విధంగా వస్తుందో వివరించుకుందాం.ఇప్పుడు అరుణాచలం గిరిని 8కి.మీ. ఇంకా 2671అడుగుల ఎత్తుతో ఒక పెద్ద అగ్ని(మంట)మండుతున్నట్టు ఊహించుకోండి.దానిలో ఏ పదార్థాలను అయినా వెయ్యండి కాలి బూడిదగా మారి ఆవిరైపోతుంది.అరుణాచలంని రెండు విధాలుగా భావిస్తుంటారు భక్తులు ఒకటి అగ్నితో మండే అగ్ని లింగంగా భావిస్తారు ఇంకా జ్ఞానం ప్రసాదించే జ్ఞానాగ్ని గా భావిస్తుంటారు అందుకే ఎన్నో వేల, లక్షల భక్తులకు జ్ఞానం త్వరగా పొందడానికి వీలుగా ఉంటుంది ఈ అరుణగిరి.ఇప్పుడు మీరు పరమేశ్వరుడు చెప్పినట్టు ప్రదక్షిణ చేస్తుంటే శరీరం వేడెక్కుతుంది(మనం ఏ రకమైన వ్యాయామం చేసిన శరీరం వేడెక్కి చెమటలు పడతాయి)శరీరం అగ్నికి(ప్రదక్షిణ చేసాక) సూచకంగా మారిపోతుంది.ఈ 14కి.మీ. నడిచేవాళ్ళకి పూర్వజన్మ కర్మలు,కర్మల ఫలితాలు కర్మ ఫలితాలకు వచ్చే వాసనలు శరీరం 4గంటల నుంచి 8లేదా10గంటల శ్రమతో కష్టపెడుతున్నాడు.మనం చేసిన పాపం పోవాలంటే కష్టం అనుభవంలోకి ఖచ్చితంగా రావాలి.ఇంకా పుణ్యం కూడా పోతుంది అంటున్నారు కదా అదెలా అంటే ఇది అగ్ని కొండ అని భావనతో తిరుగుతుంటారు అంత పెద్ద అగ్నిలో ఏ చిన్న పురుగు నుంచి పెద్ద చెట్లు,జంతువులు,మనుషులు,తినే పదార్థాలు,తినని పదార్ధాలు,వస్తువులు సైతం వేసినా కాలి బూడిదైపోతారు.మనకు చేసిన పాపాన్ని అనుభవంలోకి తేవాలంటే మనల్ని కాల్చేస్తే ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళరు.అగ్ని వేటినైనా కాల్చి బూడిద చేస్తుంది.పాపాలు,పుణ్యాలు మన శరీరాన్నీ అడ్డుపెట్టి తీసేస్తున్నాడు.ఇంకా చెప్పాలంటే మనం మనస్సుతో,నోటితో అంత సేపు(పైన చెప్పిన సమయం)స్తోత్రం,నామ జపం,శివుడితో సంబంధం ఉన్న ఏవైనా కథలు మనస్సు కూడా దహించుకుపోతుంది.అదెలాగంటే మన మనస్సుతో ఏ విషయాన్నైనా ఎక్కువ సేపు ఏకాగ్రతతో ఆలోచిస్తే అది మాయం అయిపోయింది(రమణ మహర్షి నేను ద్వారా లోకానికి అందించిన సందేశం కూడా ఇదే అహంకారంతో నేను ఒక స్వరూపంగా భావించి దైవ స్థితికి దూరమైపోతున్నాం).దీన్నే నిర్విరామంగా చేసే ధ్యానం అంటారు.ఈ స్థితిని అనుభవించాలి తప్పితే మాటలతో చెప్పలేం.మనస్సు,శరీరం కూడా ఈ ప్రదక్షిణ పూర్తి చేసేసరికి భగవత్ స్థితి తప్ప ఇంకోటి ఉండదు.అందుకే ఇది పూర్ణంగా ప్రదక్షిణ అయిపోయేసరికి గాఢ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతాం.ఇలా చేయగా చేయగా భగవత్ స్థితి కలిగి అదే జ్ఞానం తనంతట తానుగా పరమేశ్వరానుగ్రహంగా(పరమేశ్వరుడు అని సంపూర్ణ విశ్వాసంతో చేసినవాళ్ళకి)సమస్త పాప,పుణ్యల కర్మ క్షయం జరిగి మరో జన్మ లేకుండా పరబ్రహ్మ స్థితి పొందుతారు.శ్రీకృష్ణుడు భగవద్గీత లో "జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం"అని ఒక శ్లోకం లో చెప్తారు.దాని అర్ధం ఏంటంటే జ్ఞానం ఉదయించిన జీవుడు దైవ స్వరూపంగానే భావింపబడతాడు.భగవంతుడికి జనన,మరణాలు ఉండవు అని శాస్త్రం(వేదం) చెప్తుంది(ఇది పెద్ద వివరణలే అది ఇంకోసారి చెప్పుకుందాం).జ్ఞానం ఉదయించినవాడికి కర్మలు,కర్మ వాసనలు ఇవేం ఉండవు అన్ని కాలిపోతాయి.అవేం లేనప్పుడు ఇక జన్మ ఏది,జన్మించేవాడు ఎవరు అలా అంతా అద్వైత భావనలో(రెండో జీవుడు,వస్తువు ఉండవు) అలా సహజ స్థితిలో ఉండిపోతాం ఈ గిరి ప్రదక్షిణ వల్ల తెలియక పోయినా,తెలిసి అయినా జీవుడు అదే స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు.అందుకే ఈ గిరి ప్రదక్షిణ అంత గొప్పది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అరుణాచల శివ
No comments:
Post a Comment