Thursday, April 20, 2023

మన బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 331 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  మన బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు.  🍀*

*వాళ్ళు నువ్వు ఎట్లా పెంచితే అట్లా పెరుగుతావు ' అంటారు' కానీ మనం బాధల్లో పెరిగాం, దుఃఖంలో పెరిగాం. కానీ ఎవరూ మనకు బాధల్ని దు:ఖాల్ని యివ్వలేదు. కారణం మనం యితరుల మీద బాధ్యతని తోసేస్తాం. అదే మనకు మరింత దుఃఖకారణం. నీ జీవితానికి సంబంధించిన పూర్తి బాధ్యతని నువ్వే తీసుకో. దానికి బాధ్యత యితర్ల మీద వేయడం దారుణం. మొదట్లో 'నా నరకానికి కారణం నేనే' అని అంగీకరించడం కష్టమే. కానీ అట్లా ఆమోదిస్తే తలుపులు తెరుచుకుంటాయి. కారణం నా నరకానికి నేనే కారణమయితే నా స్వర్గానికి కూడా నేనే కారణమన్న సంగతి తెలిసి వస్తుంది.*

*ఆగ్రహాన్ని సృష్టించుకున్న వాణ్ణి. ఆనందాన్ని సృష్టించుకోలేనా అని గ్రహిస్తావు. బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు. అప్పుడు నువ్వు పాట పాడవచ్చు. ఆట ఆడవచ్చు. జీవితాన్ని ఉత్సవం చేసుకోవచ్చు. నీ జీవితం అనుక్షణం పండగవుతుంది. నిన్నెవడూ ఆటంకపరచలేడు. అది మనిషి ఆత్మ గౌరవం. దేవుడు వ్యక్తిత్వమున్న వాళ్ళని గౌరవిస్తాడు. కారణం వ్యక్తిత్వమున్న వాళ్ళు బాధ్యతని తీసుకుంటారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment