Thursday, April 20, 2023

ఆత్మసాక్షాత్కారం నిన్నే ఒక క్షేత్రంగా, తీర్ధంగా, పరమపవిత్ర గంగానదిగా మారుస్తుంది!

 *శ్రీశివానంద గురుభ్యో నమః శ్రీనిసర్గదత్త మహరాజ్ వారి "ధ్యానములు" అనే గ్రంధంపై శివశ్రీ రమణ గురుదేవుల సత్సంగ ప్రసంగాల సారాంశమైన "నేనెవరు"(9) వ్యాససంపుటి నుండి సేకరణ* ది.18/04/23

*ఆత్మసాక్షాత్కారం నిన్నే ఒక క్షేత్రంగా, తీర్ధంగా, పరమపవిత్ర గంగానదిగా మారుస్తుంది!*

_మన స్వస్వరూపం మనకు అనుభవంలోకి వస్తే యాత్రలు క్షేత్రాలకు వెళ్లి మనం పునీతులం కావడం కాదు. మన సన్నిధే యాత్రలను, క్షేత్రాలను, తీర్థాలను పవిత్రం చేస్తుంది. అందుకే కుంభమేళ, పుష్కరాల్లో మహానుభావులు ఆయా నదులు, తీర్థాలను పవిత్రం చేయగలుగుతారు. నేనున్నాను అన్న తొలి చైతన్యాన్ని తెలుసుకున్న స్థితి వస్తే నేను లేని స్థితి వస్తుంది. ఆ స్థితే దివ్యత్వం. మన ఎరుక కన్నా పవిత్రమైనది, శక్తివంతమైనది, తెలుసుకోదగింది. కోరుకోదగింది ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆత్మసాక్షాత్కారం నిన్నే ఒక క్షేత్రంగా, తీర్ధంగా, పరమపవిత్ర గంగానదిగా మారుస్తుంది. గురువు ప్రతి పలుకు అధ్యాత్మిక సాధనకు అమృత గుళిక లాంటిదే. గరువు చేసే హాస్యంలోనూ తత్త్వబోధ ఉంటుంది. జ్ఞాని తనతో తానుంటారు. అందుకే వారి ప్రతి కదలిక సుందరంగా ఉంటుంది._


*శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్, శ్రీగురుధాం ధర్మ క్షేత్రం, బలుసుపాడు, జగ్గయ్యపేట మం. ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. srigurudham.org*

No comments:

Post a Comment