Tuesday, April 11, 2023

::::::నది. మనస్సు :::::

 *:::::::::నది. మనస్సు ::::::::::::::*
   1)నది ఎప్పుడూ ఒకే లాగా వుండదు. ఒకో సారి ఎండిపోయి వుంటుంది. కొన్నాళ్ళు వరదలతో ఉదృతంగా ప్రవహిస్తోంది. కొన్నాళ్ళు శాంతంగా నిలకడగా  మెల్లగా ప్రవహిస్తూంది .
   మనస్సు కూడా అంతే కొన్నాళ్ళు ఎమీ పట్టనట్లు ముభావంగా వుంటుంది. ఒకోసారి విపరీతమైన ఉద్వేగాలతో ఎగిరెగిరి పడుతుంది. అప్పుడప్పుడు శాంతంగా మౌనంగా వుంటుంది.
2)నది కి వరదలొచ్చినా, ఎండిపోయినా,నిలకడగా వున్నా అందుకు కారణాలు వున్నాయి.
మనస్సు శాంతిగా వున్నా, ఆందోళనగా వున్నా అందుకు కారణాలు వున్నాయి.
3)నది బురద తో మురికి కావచ్చు, కలుషితం కావచ్చు.
మనస్సు అకుశల ఆలోచనలతో దోష సహితంగా వుండొచ్చు.
4)నది కొండల్లో ప్రవహించే టప్పుడు హుందాగా, స్వేచ్ఛగా, తెల్లగా, పవిత్రంగా వుంటుంది.
మనస్సు శీలంతో,కుశల ఆలోచనలతో వున్నప్పుడు, ప్రశాంతంగా, ఏకాగ్రతతో,ప్రజ్ఞ తో, ప్రేమతో వుంటుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment