Wednesday, April 5, 2023

అంతర్యామి: ధాన పుష్పం

 🪔🪔అంతర్యామి🪔🪔

         🏵️🏵️ధాన పుష్పం🏵️🏵️

🍁ప్రకృతిలో భాగమైన పూల మొక్కలు ఎల్లప్పుడూ
ధ్యానంలో ఉంటాయి. అలా ఉండటం వాటి సహజ
స్వభావం. పుష్పించడం వాటి అంతిమ లక్ష్యం. 

🍁అదే రీతిన మనిషిగా జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి జీవితలక్ష్యం- ప్రాకృతికంగా ధ్యాన పుష్పానికి అంతర్లీనంగాపరితపించడం. 

 🍁కాని, 
ప్రకృతి మొత్తం ధ్యానోత్సవం జరుపుకొంటూంటే,
 ఒక్క మనిషి మాత్రం అందుకుభిన్నంగా బతుకీడ్వటం విచారకరం. 

🍁తల్లిగర్భంలో ధ్యానక్రియతో సంపూర్ణ ఆకృతి దాల్చిన మనిషి బాహ్య ప్రపంచంలోకి అడిగిడగానే (పుట్టగానే) ధ్యానం తాలూకు ఎరుకను క్రమంగా మరచిపోవడం మొదలుపెడతాడు. 

🍁అందువల్లే మనిషి బాల్యమంతా నిండు ఆరోగ్యంతో, ఆనందంగా గడిపి- వయసు పెరిగి వృద్ధాప్యాన్ని సమీపిస్తుంటే అనారోగ్యానికో, అశాంతికో చేరువవుతుంటాడు. కోల్పోయిన ఆనందం తిరిగి పొందడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ధ్యానం ఉపకరిస్తుంది.

🍁 సుదీర్ణానుభవంతో పొందిన బుద్ధిబలాన్ని మనిషి కేవలం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడంకోసం | ప్రాపంచిక సౌఖ్యాలనిచ్చే వ్యామోహాల ఆకలి తీర్చడం కోసం వినియోగిస్తున్నాడే తప్ప- అసలైన అంతర్ జ్ఞాన విధివైపు దృష్టి సారించడానికి ఇష్టపడటంలేదు. 

🍁ఎంతో సాఫీగా సాగే సహజాతి సహజ జీవన గమ నాన్ని ఉరుకులు, పరుగులతో అత లాకుతలం చేసుకుంటున్నాడు. ప్రధా నంగా ఆయుఃప్రమాణం
గరిష్ఠంగా నిలవడానికి ఉపకరించే నిద్రా దేవతనూ
విస్మరిస్తున్నాడు. నిద్ర- మనిషికి ప్రకృతి ప్రసాదించిన
అత్యంత విలువైన వరం. 

🍁అది మనిషి జీవితకాలంలో సగ భాగం. 
🍁కాలం నిండుకున్నాక నీకు జన్మ ఇచ్చినవాళ్లు మృత్యువు ఒడిలోకి చేరిపోతారు. 
🍁నువ్వు జన్మ ఇచ్చినవాళ్లు బతుకుతెరువుకోసం దూరతీరాలకు వలసపోతారు. 
🍁నీ తోబుట్టువులూ ఎవరిదారి వారు చూసుకుంటారు. ముందో వెనకాలో ఆయుష్షు తీరగానే జీవిత ||భాగస్వామి కాలం చేయక తప్పదు.
 🍁కానీ, నిద్రమాత్రం జీవితాంతం నీ వెన్నంటే ఉంటుంది.

🍁ఉషోదయం, సాయం సంధ్యావేళల్లో ధ్యానం మంచిదని జీవితాన్ని పండించుకున్నవాళ్లు చెబుతారు. 
🍁మానసికంగా, శారీరకంగా శ్రమించి అలసిసొలసిన మనిషిని ప్రకృతే నిద్రలోకి జారుస్తుంది.
🍁 ఎందుకంటే, నిద్ర కూడా ధ్యానం లాంటిది. 
🍁దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం, ఆకలి అనిపించినప్పుడు ఆహారం సేవించడం, నిద్ర వచ్చినప్పుడు ఉపక్రమించడం...

🍁 ఇవన్నీ ప్రాకృతిక ప్రామాణిక ధార్మిక జీవనం కిందకే వస్తాయి. 
🍁ధ్యానం- ఎరుకతో కూడిన నిద్ర
🍁 నిద్ర- ఎరుకలేని ధ్యానం. ఈ రెండూ మనిషికి ప్రాథమికంగా ఆరోగ్యం సమకూర్చేవి.

🍁 బురదమయమైన ఒక నీటి కొలను | నిలకడ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ స్వచ్ఛమైన తేట నీళ్లతో కళకళలాడుతుంది. అదేరీతిన అనేకానేక ఆలోచనలతో సతమతమయ్యే మనసూ ఏ ఆలోచనా లేకుండా నిశ్చల స్థితికి చేరుకున్నప్పుడు- అది నిర్మలం అవుతుంది. ఫలితంగా దాని ప్రభావం శరీరంపైనా పడుతుంది.

🍁 కలతలే లేని కమ్మని నిద్రలో మనశరీరాలు పూర్తి విశ్రాంతిలో ఉంటాయి. 
🍁అప్పుడు ప్రకృతి అంతటా నిండిన విశ్వశక్తిని అవి తిరిగి పొందుతాయి. 
🍁అందువల్లే, ఉదయం నిద్ర లేవగానే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. చుట్టూ పరచుకున్న జీవితం కొత్త అనుభూతి కలిగిస్తుంది.🙏

-✍️ మునిమడుగుల రాజారావు

No comments:

Post a Comment