Sunday, April 23, 2023

రాముడు సందేశం from మహా జ్ఞానం (Messages from 40 masters)

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ---- అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️  *మాస్టర్ -- 13:--- రాముడు సందేశం*🕉️
🌸 *Part -- 3*🌸

🍀 విభీషణుడు, హనుమంతుడు ఇద్దరూ మాస్టర్లలో మాస్టర్లు. నాకు తెలిసింది మొత్తం నేర్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరూ నాలో నిద్రాణంగా ఉన్న దానిని తట్టి లేపడంలో సాయం చేశారు. నాలో నిద్రాణమైన ఆత్మ జ్ఞానం తమలోకి ప్రవహించే లాగా చేశారు. ఇవాళ వాళ్ళెంత గొప్ప స్థితిలో ఉన్నారంటే దాని రహస్యం. ఇదే! *“భూ కక్ష మార్పు (Axis changes)”* సమయంలో వ్యూహాత్మకంగా పనులు చేసే వారు వీళ్ళిద్దరే!

🏵️ ఇంక రాముడిగా నా జన్మ విషయానికి వచ్చినట్లయితే నేను మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే *"జీవితంలో ప్రతి విషయాన్నీ నేర్చుకోండి. మీ జీవితంలో మీరు దేనినైనా అసహ్యించుకుంటే ఆ విషయాన్ని గట్టిగా బయటికి చెప్పండి అప్పుడే ఆ అసహ్యం వెనుక ఏ భావన దాగివుందో అది బయటికి వస్తుంది. అలా ఒక్కసారి అసహ్యానికి కారణం బయటికి వచ్చేసిందంటే అంత వరకు దేనినైతే అసహ్యించుకున్నారో, ద్వేషించారో దాన్నే ప్రేమించడం మొదలు పెడతారు. దానితో సఖ్యతగా ఉండగలుగుతారు. దాని నుంచి మీరు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుంటారు. అలా కాకుండా దాని పట్ల మీకున్న ద్వేషాన్ని మీ మనస్సులోనే అణచి పెట్టుకున్నారనుకోండి. మీరు ద్వేషంలోనే బ్రతుకుతారు. నేర్చుకోవలసిన ఆ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోకుండానేపోతారు. 

☘️ ఇంక రెండవది రాముడిగా, రాజుగా నా జీవితం చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకానొక సమయంలో ఒక పనిని మాత్రమే చేయాలి. రాత్రిళ్ళు మీరు ధ్యానం చేస్తారనుకోండి, పగలు మీరు ధ్యానులు కాలేరు. అంటే నా ఉద్దేశ్యం నలుగురితో కూర్చుని ఇతర లోకాల గురించి చర్చిస్తున్నప్పుడో, లేదా వంట చేస్తున్నప్పుడో, లేదా ఆఫీసులో మీ బాసు ఎదురుగా ఉన్నప్పుడో మీరు ధ్యానం చేయకూడదు. భూలోకవాసులుగా మనం సమాజంలో రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంది. సంఘ జీవులుగా ఈ పాత్రలన్నింటినీ మనం చక్కగా పోషించాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం.

🌿 ఈ భూలోకాన్ని ఒక పాఠశాలగా అనుకుంటే భూలోకంలో భౌతికంగా జీవించేటప్పుడు *“ఆధ్యాత్మికత”* అనేది *“ పరిశోధనానంతర పరిశోధన (post doctoral research”)* లాంటిది. అటువంటి విద్యార్థి తక్కువ స్థాయి వాడు అయి ఉండడు కదా. అంటే మరీ చిన్న చిన్న విషయాలు కూడా అర్ధం కాకుండా ఉండవు కదా. అతనికి ప్రత్యేకించి ఇలాంటివి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా!

🌸 మాస్టర్ పత్రి శిష్యులుగా నేను ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా మీ అందరికీ స్పష్టం చేయదల్చుకున్నాను. మీరందరూ బ్రతకాలి. నిజంగా జీవించాలి. ఈ జన్మను చక్కగా అర్ధం చేసుకోవాలి. దీనిలోని సరదాలనూ, కూడా అనుభవించాలి. ఎందుకంటే మీ జీవిత నమూనాలలో చక్కగా బ్రతుకుతూ, జీవితాన్ని జీవించడంలో పాల్గొంటూ, అదే సమయంలో ఆధ్యాత్మికామృతాన్ని గ్రోలుతున్న వాళ్ళు ఈ మొత్తం ప్రపంచంలోకి కేవలం మీరు మాత్రమే. మీరు, మీ మాస్టరు పత్రీజీ ఇదే సాధనలో నాలుగు కాలాల పాటు బ్రతకండి. మా వైపు నుంచి మేమందరం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటాం.

🌼 గుడ్ లక్. గుడ్ బై. పిలవండి అంతే... రావణుడితో సహా మేము మీ కెవ్వరికైనా పలకడానికి సిద్ధంగా ఉంటాం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *మహా జ్ఞానం పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment