Sunday, September 3, 2023

బువ్వ కొద్దీ బుద్ధి!!

 🎻🌹🙏"బువ్వ కొద్దీ బుద్ధి!!"....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿పూర్వం ఒక శివభక్తుడు కాశీ నడిచి వెళుతూ, ప్రతీరోజు చీకటి పడేటప్పటికి దగ్గర్లోని గ్రామంలో ఎవరో ఒక గృహస్తు ఇంట ఆశ్రయం సంపాదించి అతిధిగా ఉండేవాడు._ 

🌸అలాగే ఒకరాత్రి ఒక గ్రామంలోని ఇంట ఆశ్రయం సంపాదించాడు.
ఆ రాత్రి ఆ ఇంట భోజనం చేసి పడుకున్న శివభక్తుడికి, ఆ ఇంటి ముందు కట్టి ఉన్న 'ఆవు' కనిపించింది. 
ఆ ఆవుని దొంగతనంగా తీసుకుపోవాలనే ఆలోచన ఆ భక్తుడికి కలిగింది. 

🌿ఇంట్లోని వారందరూ నిద్ర పోగానే, ఏ మాత్రం చప్పుడు లేకుండా, ఆవుని తీసుకుని బయలుదేరాడు. 
ఉదయానికి ఆవుతో సహా ఒక చెరువు వద్దకు చేరుకుని, అక్కడ ఆవుని కట్టి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసాడు...

🌸అప్పుడు అతనికి రాత్రి తాను చేసిన పాపపు పని గుర్తుకు వచ్చింది. 
వెంటనే పశ్చాత్తాప పడుతూ, ఆ ఆవును తీసుకుని ఆ గ్రామంచేరి, ఆవును ఆ ఇంటి యజమానికి అప్పగించి 

🌿"అయ్యా, నన్ను క్షమించండి, ఆవును దొంగలించాలన్న దుర్భుద్ది ఎలా కలిగిందో  నాకు అర్ధం కాలేదు. 
ఉదయం కాలకృత్యాలు తరువాత నాపని నాకే చాలా సిగ్గుగా అనిపించింది" అన్నాడు.

🌸ఆ ఇంటి యజమాని శివభక్తుడికి నమస్కారించి "అయ్యా! అది మీ తప్పు కాదు, 
నేను ఒక దొంగను, రాత్రి మీరు తిన్నది నేను దొంగలించి తెచ్చిన డబ్బుతో తయారుచేసిన భోజనం. 
దాని ప్రభావంతో మీకు దొంగ బుద్ధి కలిగింది.

🌿కాలకృత్యాల తరువాత దాని ప్రభావం మీలో పూర్తిగా పోయింది, అందువల్ల ఆవును తిరిగి తీసుకువచ్చారు" అన్నాడు. 

🌸అప్పుడు శివభక్తుడు సంతోషించి, అక్కడి నుండి బయలుదేరాడు. 
ఆందుకే ... వంట చేసే ముందు కావలసినవి...

🌿పాత్ర శుద్ధి,
పాక శుద్ధి,
భావ శుద్ధి
ఇదంతా అయ్యాక , బగ్వద్ అర్పితం వుండాలి, అప్పుడే ఆ పదార్థము ప్రసాదంగా మారుతుంది ...
మనం తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందని...

🌸ఎట్టి ఆహారమో - అట్టి ప్రవర్తన,
ఎట్టి ప్రవర్తనో అట్టి - అట్టి జీవితం,
ఎట్టి జీవితమో - అట్టి మోక్ష సాధన...స్వస్తి..🚩🌞🙏🌹🎻

🙏సర్వే జనాన్ సుఖినోభవంతు🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment