చలాచల బోధ:--
అనుబంధ చతుష్టయములో విషయము అంటే బ్రహ్మ విద్య; సంబంధం అంటే నేనుకు -బ్రహ్మకు ఎటువంటి సంబంధం ఉంది అనేది.దుఃఖ నాశనము మరియు ఆనంద ప్రాప్తి.అంతే కాదు, శరీరం ఉన్నా పోయినా నిత్య వర్తమాన ఆనంద స్వరూపమై,జనన మరణ రహితమై కాలాతీతమై ఉండిపోవడమే ప్రయోజనము.ఇక నాల్గవది అధికారిత్వము.అనగా బ్రహ్మ విద్యను శ్రవణం చేసి అర్థం చేసుకొనుటకు యోగ్యత.అర్థం చేసుకోవడమే కాకుండా తగిన సాధనలు చేసి శరీరమే నేను అనే జీవితమును విడచి పెట్టి ఆత్మ లక్షణాలను తనపై ఆపాదించుకోవడము.దాని కోసం సాధకుడు తన పూర్వ స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టి,ఒక విధమైన నూతన జీవించ వలసి ఉంటుంది.మారుమనస్సును పొందవలసి యున్నది.ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా శమాది షట్క సంపత్తిలో ఉన్నది.విషయము నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా అవగాహన అయి, నిశ్చయ జ్ఞానం కలిగింది.వైరాగ్యాభ్యాసము వలన జనన మరణ రాహిత్యమునకు మార్గం దొరికింది.శమాది షట్క సంపత్తి వలన జీవ భావాన్ని వదలి ఆత్మ భావనలో జీవించడానికి సిద్ధమైనాడు.తీవ్ర మోక్షేచ్ఛ సాధకుని విముక్తునిగా చేయగలదు.కావున సాధన చతుష్టయ సంపత్తి కలవాడే బ్రహ్మ విద్య బోధింపబడటానికి యోగ్యుడు లేక అధికారి.ఇటువంటి అధికారిత్వమే అనుబంధ చతుష్టయములోని నాల్గవ అంశము.
ఇంతటితో అనుబంధ చతుష్టయము గురించిన బోధ సమాప్తము.
ఆత్మానాత్మ వివేకమును బోధించడమును ప్రారంభించుకుందాము.
సశేషం!
No comments:
Post a Comment