Wednesday, August 21, 2024

****చైతన్యం తన కథను తాను చెపుతుండడం గమనించారా? Consciousness reveals its story. J Krishnamurti Expose

 చైతన్యం తన కథను తాను చెపుతుండడం గమనించారా?
Consciousness reveals its story. J Krishnamurti Expose

1. పరిశీలించేటప్పుడు గమనించారా? మీరు పూర్తి సావధానత (అటెన్షన్)లో ఉంటే ఏమి జరుగుతుంది? పూర్తి సావధానతలో లేకుంటే ఏమవుతుంది?
2. మీరు దేనినో చూస్తున్నప్పుడు అది ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంటే, అప్పుడు మీరు పూర్తి సావధానతలో ఉన్నారు. కానీ అది ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరేగా కనిపిస్తుంటే మీరు పూర్తి సావధానతలో లేరు, అసావధానత(ఇనటెన్షన్)లో ఉన్నారు.
3.1. ఒక త్రాడును కానీ, ఏదైన చుట్టుకొని ఉన్న వైరును కానీ, ముడుచుకొని వున్న గోనెపట్టను కానీ చూసినప్పుడు “ఉన్నది ఉన్నట్లుగా” కాక ఇంకా ఏదో కల్పించుకొని కనిపిస్తే - ఒక పాము లాగా గాని, ఒక కుక్క పిల్లగా గాని, ఇంకేదైనా గాని కనిపిస్తే - ఆ పరిశీలనలో పూర్తి సావధానత లేదు.
3.2. ఒక శబ్దాన్ని కానీ, ఏదైన ధ్వనిని కానీ, ఏదైనా ఉపన్యాసంకానీ, విన్నప్పుడు “ఉన్నది ఉన్నట్లుగా” కాక ఇంకా ఏదో కల్పించుకొని వినిపిస్తే - వ్యంగంగాగాని, వేరేదేదోగాగాని, తిట్టినట్టో, పొగిడినట్టో గాని వినిపిస్తే - ఆ పరిశీలనలో – ఆ వినడంలో పూర్తి సావధానత లేదు.     
3.3. ఒక వాసన కానీ, గాలిని కానీ, దేనినైనా పీల్చినప్పుడు “ఉన్నది ఉన్నట్లుగా” కాక ఇంకా ఏదో కల్పించబడినదానిలా తెలిస్తే - ఒక మంచిసువాసనగా గాని, దుర్గంధంగా అనువదించబడి గాని, బాగున్నట్లో, బాగలేనట్లో, గతంతోపోల్చిచెప్పినట్లో తెలుస్తుంటే - ఆ పరిశీలనలో పూర్తి సావధానత లేదు. 
3.4. ఒక వంటకాన్ని కానీ, తిండిపదార్ధాన్ని కానీ, దేనినైనా తిన్నప్పుడు, “ఉన్నది ఉన్నట్లుగా” కాక తెలిసినదాన్ని గుర్తించిన రుచిగా గాని, రుచిలేనిదానిలా గాని, దానిలో అది లేదనో, తక్కువయిందనో, ఎక్కువయిందనో, గతంతోపోల్చినట్లో తెలుస్తుంటే - ఆ పరిశీలనలో పూర్తి సావధానత లేదు.   
3.5. శరీరంతో ఒక వ్యక్తిని గాని, ఏదైనా వస్తువును గాని, మరోదానిని గాని, దేనినైనా తాకినప్పుడు, “ఉన్నది ఉన్నట్లుగా” కాక ఏదో తెలిసిన గుర్తించిన వ్యక్తి స్పర్శగాగాని, ఏదో తెలియని గుర్తించలేని వ్యక్తి స్పర్శగాగాని, మెత్తగా ఉందనో, గట్టిగా ఉందనో, గతంతోపోల్చి అలాగనో ఇలాగనో తెలుస్తుంటే, తెలుసుకుంటుంటే - ఆ పరిశీలనలో పూర్తి సావధానత లేదు.  
3.6. భిక్షగాళ్ళను, రోగులను, అవిటివారిని, అభాగ్యులను చూసినప్పుడు, మనసులో ఒక వేదననను, భావనను, అనుభూతిని గమనించారా? పూర్తిగా సావధానతతో ఆలోచన లేకుండా పరీశీలిస్తే ఏమి జరుగుతుందో గమనించారా?
కాదు.. కాదు.. అక్కడ పూర్తి సావధానత లేదు. అసావధానత(ఇనటెన్షన్) ఉంది.  
5. అయితే ఆ పరిశీలనలో పూర్తి సావధానతలో ఉన్నప్పుడు ఇంకా ఏమి జరుగుతుందో మీరు గమనించారా? చైతన్యం తన కథను తాను చెపుతుండడం గమనించారా?    
7. ఎప్పుడు?
ఖండించడం, తీర్పు చెప్పడం, విమర్శచేయడం, ఆపడం, మరోదానిలా మార్చాలనుకొవడం, వచ్చినదాన్ని జుర్రుకోవడం, తాదాత్మ్యం చెందడం, కోరినది రావాలనుకోవడం, వచ్చినదాన్ని అంగీకరించడం లాంటివి చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా కనిపించినది కనిపించినట్లుగా పూర్తి సావధానతతో పరిశీలించినపుడు. 
8. ఆ పరిశీలనలో చైతన్యం (కాన్షియస్నెస్) తన కథను తాను చెపుతుంది. తనను తాను తెరచి చూపుతుంది.   తనకు తాను పూర్తిగా వికసిస్తుంది, విస్తరిస్తుంది, విస్తారంగా విపులంగా పరచి చూపుకొంటుంది.
9. అంటే మాటలలో, పదాలలో, వాక్యాలలో, మన భాషలో కాదు. మరి ఎలా? ఆలోచన జోక్యం చేసుకుంటే, ఆలోచన మధ్యలోకి వస్తే అప్పుడు మాటలు, పదాలు, వాక్యాలు, మన భాష వస్తుంది. లేకుంటే రాదు.
10. ఆలోచన ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది? ఆలోచన వేటిమధ్యలోకి మధ్యవర్తిగా వస్తుంది? మీ పరిశీలనలో మీరు కనుగొన్నారా? సావధానంగా గమనించారా?
11.  దేనినైనా, ఏ వస్తువునైనా చూసినప్పుడు మీరు (చైతన్యం), ఆ వస్తువును మొదట కలవడం, తాకడం, స్పర్శించడం (కాంటాక్ట్) జరుగుతుంది. అప్పుడు ఇంద్రియస్పందన(సెన్సేషన్) కలుగుతుంది. తదుపరి ప్రతిచర్య లేక చర్య. ఇది మీరు మీ లాబ్ లో గమనించారా?
12.  అంటే! ఇంద్రియస్పందన(సెన్సేషన్)కు, చర్యకు మధ్యలో ఆలోచన జోక్యం చేసుకుంటున్నది? అవునా? కాదా? ఇది మీరు చూస్తున్నారా? గమనిస్తున్నారా?  
13. గమనిస్తే - పూర్తి సావధానతతో గమనిస్తే - ఏమి జరుగుతుంది? ఆలోచన జోక్యం చేసుకోలేదు. అవునా? మీకు మీరు కనుగొనాలి. మీలాబ్ లో మీరు చూడాలి. ఇప్పుడే - ఈక్షణమే చూడాలి. చూశారా?   
13. A. ఆ పరీశీలనలో ఉన్నతమైన శుద్ధమైన ఎరుక వ్యక్తమవుతుంది. చైతన్యం - భావాల రూపంలో, అనుభూతుల రూపంలో, సంవేదనల రూపంలో - తన కథంతా చెబుతుంది. అంతా అయిపోయి సమూల పరివర్తన జరుగుతుందా? లేదా?
14. పూర్తి సావధానతతో పరిశీలన ఉన్నప్పుడు  - ఆలోచన మధ్యలోకి రానప్పుడు, మాటలు పదాలు ఆగినప్పుడు - చైతన్యం (కాన్షియస్నెస్) తన కథను తాను చెపుతుంది. తనను తాను తెరచి చూపుతుంది.   తనకు తాను పూర్తిగా వికసిస్తుంది, విస్తరిస్తుంది, విస్తారంగా విపులంగా పరచి చూపుకొంటుంది.  
15. తన గతాన్ని, తన అనుభవాలను, తన బాధలను, తన సంతోషాలను, తన గోడును, తన గాయాన్నంతా, గాయాలన్నింటిని, తనపై పడిన పూతలను, చిల్లులను అన్నింటిని, వాటికి తనకున్న విచారాన్ని, తన భావాన్ని, అంతటిని, అన్నింటిని, తన శరీరాన్ని అంతా, తన కథను అంతా - అనుభూతి రూపంలో ఇంద్రియస్పందనల రూపంలో విప్పి చూపుతుంది, విప్పి చెపుతుంది. 
16. మాటలలో కాదు, పదాలలో కాదు, అనుభూతి రూపంలో, ఇంద్రియసంవేదనల రూపంలో - భావాల రూపంలో – వేదనతో చైతన్యం (కాన్షియస్నెస్) తన కథను తాను చెపుతుంది? చూసారా? మీ లాబ్ లో? మీ లోపల పరిశీలించారా?  
17. భయము, కోపము, ఈర్ష్య, అసూయ, గాయాలు మొదలగు ఎన్నో నిలవచేయబడిన గత అనుభవాలన్నింటినీ కలిపి ఒక బొమ్మను చేస్తే - అదే చైతన్యం(కాన్షియస్నెస్). పేర్లు పెట్టి పదాలతో వేరుచేసి గుర్తించకుండా కేవలం అనుభూతుల సంవేదనల సమాహారముగా మాత్రమే గమనిస్తుంటే సావధానతతో మొత్తం కథ చెప్పేస్తుంది చైతన్యం. అయిపోతే అంతమవుతుంది.  
18. అలా చైతన్యం కథనంతా "అలా" వింటే, "అలా" చూస్తే ఏమి జరుగుతుంది? అలా వినేటప్పుడు అలా చూసేటప్పుడు ఏమి జరుగుతున్నది? మీ మనసులో? మీ బ్రెయిన్ లో? మీ శరీరంలో? గమనిస్తున్నారా? 
19. మీ లాబ్ లో? మీ శరీరంలో? మీ లోపల? "అలా" గమనిస్తున్నారా?  దయచేసి రండి చూడండి!!


No comments:

Post a Comment