Wednesday, August 21, 2024

****ఎరుక – జ్వాల-రగిలించడం, ప్రజ్వలింపచేయడం...

 ఎరుక – జ్వాల-రగిలించడం, ప్రజ్వలింపచేయడం
Igniting self-awareness పుడుతున్న ప్రతీ ఆలోచనను, అనుభూతిని రాసుకోండి. మాటల వెనక ఉన్న అసూయ, ఈర్ష్య , కో పాలను, ఇంద్రియ స్పందనల వెనక ఉన్న ఉద్దేశాలను, ప్రతి చర్యలను రాసుకోండి. ఏ మాత్రం నిబద్దత ఉండని తెలివితో ఖండించకుండా, తీర్పులివ్వకుండా, తాదాత్మ్యత చెంద కుండా, దానిని పరీక్షించండి. అలా దానిని అధ్యయనం చేయడంలో అచేతన, చేతనతో సహకారంతో సమైక్యత వస్తుంది. సొంత స్థితి పట్ల అవగాహన కలిగి ఒక అంతరంగికమైన ఎరుక వస్తుంది. ఈ స్వీయ ఎరుక అనే జ్వాలలో, స్వీయ జ్ఞానం అనే జ్వాలలో ఆలోచనలకు, అనుభూతులకు, కోరికలకు, మాటలకు గల కారణాలు వెల్లడౌ తాయి. తద్వారా అవగాహన వస్తుంది. తన ఆలోచనానుభూతులు, తన ప్రతిచర్యలు మరియు ఉద్దేశాలు తక్షణమే ఎరుకలో ఉండేలా తగినన్ని రోజులు చేయాలి. ధ్యానం అంటే “నిరంతర స్వీయ ఎరుక” యే కాదు, నిరంతరం - స్వీయాన్ని , అహాన్ని , బంధాన్ని, తాదాత్మ్యతను, నిబద్ధతను, సంగత్వమును, కేంద్రాన్ని, నేను - భావమును వదులుకోవడం. వదులుకోవడం అంటే చేసేదేమీలేదు. నిబద్ధత, తాదాత్మ్యతల యొక్క ప్రమాదాన్ని గుర్తించి ఖందన, తీర్పు, సహకారం లేకుందా పరిశీలించడంలో నగ్నమైన ఎరుక - శుద్ధమైన ఎరుక నిలుస్తుంది. అంతరంగికమైన ఎరుక జ్వాల ప్రకాశిస్తుంది. అప్పుడు వివేకోదయపు ప్రశాంతత వెలుగు లోకి వస్తుంది. మనసును తాదత్మ్యతకు లోను చెయ్యని ప్రకృతిలోని సహజమైన వస్తువులను, విషయాలను పరిశీలించడం ద్వారా నిబద్దత నుండి బయటకు రావడం గమనించటం లేదా? అన్ని ఇంద్రియాల శక్తితో ఇంద్రియచలనాలను గమనించడం ద్వారా ఎరుకశక్తి వికసిస్తుందా? లేదా? ఒక విషయమును గాని, వస్తువును గాని, ఇంద్రియచలనాన్ని గాని పరిశీలించేటప్పుడు స్పర్శను, వాసనను, రుచిని, రూపును, వినికిడిని వీటన్నిటిని ఒకేసారి పరిశీలించగలిగితే ఏమి జరుగుతున్నదో గమనించారా? పరిశీలించే సమయంలో పూర్తి శక్తిని ఉపయోగించి గమనించినప్పుడు ఏమి జరుగుతున్నదో గమనించారా? పరిశీలకుడు తనను తాను గమనించడం ద్వారా ఎరుక జ్వలిస్తుందా? ఏదైనా కారణం వలన మనసు గాయపడితే, గాయ పడటం వలన పరిమితమైన స్వీయకేంద్రం ఏర్పడుతుందని, అది అత్యంత ప్రమాదమని అవగాహన కలగడంతోనే అంతర్ దృష్టి ఏర్పడి ఆగాయపు మచ్చ తుడిచివేయబడదా?, తదుపరి ఇంక ఏగాయమన్నా ఏర్పడుతుందా? ఏదైనా వాస్తవాన్ని చూచినప్పుడు నిజంగా తాకినప్పుడు ఎరుక వచ్చి వాస్తవంపైన నిజమైన చర్య తీసుకోవడం జరగుతుందా? లేదా? పరిమితమైన స్వీయతత్వము - అహము వలన ఏర్పడే అత్యంత ప్రమాదమును చూచిన వెంటనే ఆ పరిమిత కేంద్రము తుడిచివేయబడుతుందా? లేదా? ఆప్రమాదమును చూచారా లేదా? ఒక ప్రశ్న లేక ఒక సవాలు లేక ఒక సమస్య ఎదురైనపుడు, ఆలోచన సరైన పరిష్కారం చూపలేదని, ఆలోచన అత్యంత ప్రమాదకరమని తెలుసుకొని, అలాగే ఆగి అక్కడ ఉండి సావధానంగా గ్రహిస్తూ గమనిస్తూ ఉంటే – ఆ సమస్యపై అంతర్ దృష్టి పనిచేస్తుందా? లేదా? "నేనే ఈప్రపంచము - ఈప్రపంచమే నేను." దీనిని కేవలం నోటిమాటగా కాకుండా నిజమైన వాస్తవంగా చూచారా? అంతవరకు వచ్చారా? చూస్తే ఇంకా ఆ పరిమిత విడి వ్యక్తిత్వ కేంద్రము "నేను" నిలిచివుంటుందా? అనుసరించడం కాదు, విషయ జ్ఞానాన్ని ప్రోగుచేసుకోవడం కాదు. నమ్మడము, అంగీకరించడము, ప్రోగుచేసుకోవడము వలన ఉపయోగము లేదు. సమూలపరివర్తన లేదా జ్వాలను రగిలించడం జరగదు. నేరుగా ఎవరికి వారు వారి వారి - ఈ శరీర మనోనిర్మిత పరిక్షాకేంద్రము ( లాబ్ ) లో వారే పరిక్షించుకోవాలి. అప్పుడే సమూలపరివర్తన

No comments:

Post a Comment