*_ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం!!._*
*_ఇది మనిషిలోని చింతలన్నింటినీ ఏరిపారేసి మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది._*
*_" ఓ భగవంతుడా.!! కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం._*
*_ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే..._*
*_నేను నీ వాడను, నీవు నా వాడవు._*
*_నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు._*
*_నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను._*
*_ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను._*
*_" దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి"._*
*_అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి._*
*_ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి._*
*_"ఇదే నిజమైన శరణాగతి,_*
*_ఇట్టివాడు భగవంతునకు అత్యంత ప్రియమైనవాడు"._*
*_ప్రపంచంలో వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు.!!_*
🙏🙏🙏 🪷🕉️🪷 🙏🙏🙏
No comments:
Post a Comment