Wednesday, October 23, 2024

****మూలం : కపాల మోక్షము అనే మోక్ష సాధనా గ్రంథం

 మూలం : కపాల మోక్షము అనే మోక్ష సాధనా గ్రంథం




సాధకుడు ఏఏ చక్రాల్లో ఉన్నాడో... ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి. అవేమిటంటే:

1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు

2.స్వాధిష్ఠాన చక్రము – ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు

3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4.అనాహత చక్రం -   ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం

5.విశుద్ధి చక్రము -  వివిధ రకాల శబ్దాలు వినబడటం

6.ఆజ్ఞా చక్రము -  ఓంకార నాదం వినబడటం

7. గుణ చక్రం -  త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం

8. కర్మచక్రం -  వివిధ రకాల ఆయుధాలు కనబడటం  త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం

9.కాలచక్రం-  ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం

10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం

11.సహస్రార చక్రం -  కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం

12.హృదయ చక్రం-  హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు
 ఇష్టలింగం రావటం

13.బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు 
త్రి గ్రంధులు -త్రిమూర్తులు దర్శనాలు


అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.          

1. మూలాధార చక్రము -  మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా  గాలిలో ఎగరడం

2.స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం

3.మణిపూరక చక్రము -  విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4.అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం

5.విశుద్ధి చక్రము -  చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం 

6.ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం

7. గుణ చక్రం -   పరోపకారార్ధం ఇదంశరీరం -  ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం

8. కర్మచక్రం -  ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం

9.కాలచక్రం-   చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట

10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం 

11.సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన

12.హృదయ చక్రం-   ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస

13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం
త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం.... 

No comments:

Post a Comment