*_చెట్టుని నరికినా అది తిరిగి చిగురిస్తుంది._*
*_చంద్రుడు క్షీణించినా తిరిగి వృద్ధి చెందుతాడు._*
*_కష్టాలు వచ్చినా, అపజయాలు ఎదురైనా బాధపడకూడదు ఎందుకంటే_*
*_కష్టాలు లేకుండా ఫలితాలు రావు._*
*_వర్షాలు పడకుండా పంటలు పండవు. బాధపడకుండా ఎవరూ విజయం సాధించలేరు._*
*_విజయం సాధించిన వారందరూ బాధపడినవారే అన్నమాట కేవలం నోటిమాట కాదు, ఉన్నమాటే.!_*
*_విజయాన్ని తెలిపే ప్రతీ కథలోనూ అపజయాన్ని గురించిన కథ దాగి ఉంటుంది._*
*_చరిత్రను అధ్యయనం చేస్తే విజయాన్ని తెలిపే కథలన్నీ అపజయాన్ని కూడా తెలిపేవిగా ఉంటాయి._*
*_విజేతలందరూ అపజయాలను సోపానాలుగా చేసుకొని విజయభవనంలోకి ప్రవేశించినవారే అందుకే కష్టే ఫలి అన్నారు పెద్దలు._*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🦚🙇♂️🦚 🌹🌹🌹
No comments:
Post a Comment