Saturday, December 20, 2025

 *_❤️కన్న తల్లి ఆశీర్వచనాలు లేకుండా ఎంత మంది దేవతలకు ఎన్ని మ్రొక్కుబడులు తీరిస్తే  ఏం లాభం???❤️‍🔥_* 
🚩🚩🚩❤️‍🔥❤️‍🔥🚩🚩🚩
 
*ఒక ప్రైవేటు కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న  ఒక వ్యక్తి, ఒకసారి తన సొంత పల్లెటూరిలో జాతర జరుగుతుండటంతో, గ్రామదేవతకు మొక్కులు తీర్చి, మిత్రులకు, బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాడు.*

*అందరితోపాటు వరుసకు మామ అయ్యే సుబ్బరామయ్య కూడా భోజనానికి వచ్చి, తిని వెళుతూ కాస్త దూరంలో నిలబడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు.* 

*“ఏరా..! ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారుగా.. సరేగానీ.....! ఇంతకూ మీ అమ్మ ఏదిరా..! కనపడటం లేదే....! ఎక్కడుందిరా...!” అని సుబ్బరామయ్య అడిగాడు.*

*“మా అమ్మకు ఈ మధ్య చాదస్తం ఎక్కువయ్యింది మావయ్యా..!, ఆమెతో వేగలేక ఒక ఆశ్రమంలో చేర్పించాను, అందుకే ఆమె ఇప్పుడు ఇక్కడికి రాలేదు” అని తాపీగా చెప్పాడు.*

*ఆ మాటలు వినగానే సుబ్బరామయ్యకు మనసు చివుక్కుమంది.*

*ఆయన ఇతని భుజం మీద చేయివేసి, “వంటలు బాగానే చేయించావ్.... తినడానికి చాలా మంది వచ్చారు. అంతా బాగానే ఉంది.* 

*కానీ కన్నతల్లికి పూటకు పిడికెడు అన్నం పెట్టడానికి, బరువని ఆశ్రమంలో చేర్పించి.... ఇప్పుడిలా ఎంతమంది దేవతలకు ఎన్ని మ్రొక్కుబడులు తీరిస్తే మాత్రం ఏం లాభం రా........! వందల మందికి విందు భోజనాలు పెడితే నువ్వు గొప్ప పుణ్యమంతా మూట గట్టుకుంటాననుకుంటున్నావా......?* 

*నీ కన్నతల్లి గుండె ఎంతగా గాయపడి ఉంటుందో... ఒక్కసారి ఆలోచించావా..?* 

*జీవితంలో ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో.......! కన్నతల్లి కంటే ఈలోకంలో ఏ దేవతా గొప్పది కాదు.*

*నువ్వు ఆమెను ఆశ్రమంలో చేర్పించావని నాకు ముందే తెలిసి ఉంటే, ఇక్కడికి వచ్చేవాడినే కాదు, నీ ముఖం చూసేవాడినే కాదు.*

*కన్నతల్లినే సరిగా చూసుకోలేనప్పుడు, ఎందుకురా నీకా ఉద్యోగం.... ఏం చేసుకుంటావురా....? ఆ డబ్బుతో...” అంటూ బాధతో, కోపంతో అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు సుబ్బరామయ్య.*

*ఆ వ్యక్తికి అయోమయంగానూ, అపరాధంగానూ అనిపించింది. ఆ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఆలోచనలో పడిపోయాడు.* 

*వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయారు.*

*కొద్ది సేపటికి తన తల్లిని చూడాలనిపించి...., ఆ వ్యక్తి ఆశ్రమం దగ్గరకు వెళ్ళాడు.* 

*అక్కడ అందరూ ఒక మంచం చుట్టూ నిలబడి చూస్తున్నారు.*
 
*ఏమైందో తెలియదు. మెల్లగా వెళ్ళి, చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు.* 

*తను చివరి చూపుకు కూడా నోచుకోకుండానే, తన కన్నతల్లి ఈ లోకాన్ని వీడటంతో..... ఎవరో గట్టిగా లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్లనిపించి, కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి కుప్పకూలి పోయాడు.*

✍🏻🚩 *—సుధాకర్ నాంబేటి, ("సర్వే జనాః సుఖినోభవంతు" ఫేస్బుక్ గ్రూపు అడ్మిన్)* 🚩
-----------------------
*_{సేకరణే: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏💘}_*

No comments:

Post a Comment