*_సరదా..సరదాగా..!_*
మాయదారి పెళ్ళికొడుకు
మొబైల్ చూసుకుంటూ
పెళ్ళికూతురు బదులు
ఆమె తల్లి మెడలో
కట్టేశాట్ట సూత్రం..
ఆ ఫోటో గ్రూపులో పెడితే
పెళ్ళికూతురు హడావిడిగా
లైక్ కొట్టేసిందట..
*_కాశీ మజిలీ కథలు ఇలాగే ఉండేవి.._*
++++++++++++++++++++
దారి చూపేది
దేవుడు మాత్రమే కాదు..
గూగుల్ మ్యాప్ కూడా..
*_ఆధునిక పరిజ్ఞానం_*
+++++++++++++++++++
నడిచి వెళ్లేవాడు బాటసారి..
పోలీసోడు బీటుసారి..
మిలట్రీ వాడు బూటుసారి
తాగుబోతు మాత్రం
బూతుసారి..!
*_నబూతో నభవిష్యత్.._*
++++++++++++++++++++
నీ సంతకం!
వేరొకరు పెడితే ఫోర్జరీ..
నువ్వే మర్చిపోతే
అప్పుడు నీకు అవసరం
బ్రెయిన్ సర్జరీ..!
*_వయసు పిలిచింది..!_*
++++++++++++++++++++
పేదోడి గుండె బలహీనంగా
లబ్ డబ్..లబ్ డబ్..
పెద్దోడి హార్ట్ శరవేగంగా
లబ్ డబ్బు..లబ్ డబ్బు..
ఇద్దరికీ వస్తే గుండె జబ్బు
ఉన్నోడికి అర్జంటుగా బైపాస్..
లేనోడికి మామూలు వైద్యంతో
టైం పాస్..!
*_ధనం మూలం విధం వైద్యం..!_*
++++++++++++++++++++
పైసలున్నోడు మామూలు జలుబుకు పెట్టే ఖర్చు
పైసల్లేనోడు
గుండె జబ్బుకు కూడా
పెట్టలేనంత..
*_ఉన్నోడికి జలుబూ జబ్బే..!_*
++++++++++++++++++++
ఈరోజు నిర్యాణం..
బంధువులకు రాత్రంతా
జాగరణం..
మర్నాడు సంస్కరణం..
మరుచటి రోజు సంస్మరణం..
రోజులు గడిచేపాటికి
నీ సొంత వారైనా
చేయరే నీ నామస్మరణం..
పైగా నీ ఆస్తుల కోసం రణం..
*_బంధువులే రాబందులు..!_*
++++++++++++++++++++
*_సురేష్..9948546286_*
*_..7995666286_*
No comments:
Post a Comment