"ఊరకనేఉండు" మనసుతో దేనిని అన్వేషించకు. Don't prepare just be #MUSTWATCH
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x60IUKSPiXI
Transcript:
(00:05) మీ నిదస్థితి అది చాలా స్పష్టంగా ఉందది. అది చాలా నేరుగా ఉందది అది మీ హావ భావ వ్యక్తీకరణ తోటి సంబంధం లేకుండా మీ మనసు యొక్క స్థితిగతులతోటి సంబంధం లేకుండా మీ సహజత్వము ఆ కంప్లీట్ జాయ్ఫుల్ స్టేట్ అది చాలా నాచురల్ గా ఉందంటున్నాను ఒక పువ్వు ఎంత సహజంగా అయితే వేరబోస్తదో మీ హృదయం అంత స్వచ్ఛంగా విరబోయబడతా ఉంది. అది ఇప్పుడు కూడా అది వచ్చే జన్మకో మరు జన్మకో కాదు ఆధ్యాత్మికత తాలకు చివరి అంకం ఏమీ లేదు
(00:58) అన్న విషయం మీ అందరికీ తెలుసా తెలియదా ఏంటది ఆధ్యాత్మికత తాలకు చివరి అంకం ఏంటి ఏమీ లేదు అనే విషయం మీకు అందరికీ తెలుసా తెలిీదా అందరికీ తెలుసుగా ఆ విషయం మరి దేనికోసం ప్రయత్నిస్తున్నారు మీరు అంటే మీకుేదో కావాలన్నమాట అయితేనే ఆ నా లోపలికి వెళ్తే ఏమీ లేదు అన్న విషయం ఎవరికీ తెలియదా అసలు అక్కడ ఏమీ లేదు చాలా నిర్మలంగా ఉంది అసలు ఏమీ లేదు అక్కడ ఏ జీవుడు దేవుడు ఎవ్వరితో గొడవ లేకుండా మీరు మీరుగా చాలా సహజంగా ఉన్నాను నాకు ఏమీ లేదు అన్న విషయం మీకు తెలుసా తెలియదా అందరికీ ఎందుకు తెలిీదో బోడి మందికి తెలుసు.
(01:49) ఆ మరి ఏమీ లేనప్పుడు మీరు మీరుగా ఉండకుండా ఎందుకు ఇంత కదులుతున్నారు అంటే మీకుఏదో కావాలన్నమాట అయితే అంటే మీరు సహజంగా లేరున్నమాట అయితే అసహజంగా ఉన్నామ అన్నమాట అయితే మీ ఆసక్తి ఇక్కడ బద్దల అవుతుంది అంటున్నాను నేను అది మీ అహంకారం ఇక్కడ బద్దల అవుతుంది. మీరు కాని అంశాల్ని మీరు ప్రశ్నించినంత మాత్రం చేత మీ అహంకారం ఎప్పుడు బద్దలు కాదు మీరు ఎప్పుడు నిర్ధారిస్తూనే ఉంటారు మీరు ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు మీరు ఎప్పుడు జడ్జ్ చేస్తూనే ఉంటారు.
(02:28) నూటికి నూరు శాతం మీరు ఎప్పుడు ప్రస్తావిస్తానే ఉంటారు మీరు ఎప్పుడు నూతనతను సృష్టిస్తూనే ఉంటారు ఇప్పుడు మీరంతా మీ ప్రవర్తన ఏదైతే ఉందో ప్రవర్తనని మార్చుకుందాం అనుకుంటున్నారు మీరు మీరంతా ఏంటి ఆ మీ ఆసక్తిని ఒక్కసారి ప్రశ్నిద్దాం అనుకోవటంలే అసలు మీకు ఏదో ఒక ఆసక్తి ఉంటేనే కదా మీరు ప్రవర్తిస్తారు అంటే మీరు కానిది ఏదైతే ఉన్నదో దానిని మారుద్దామని చూస్తున్నారు తప్ప అసలు మూలం దాకా వెళ్ళటం లేదు.
(03:05) అందుకే నేను మీరు ఎంత రాంగ్ పాతిలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నాను. నేను చెప్పేది పర్ఫెక్ట్ పాత అని నేను చెప్పడం లేరు చెక్ చేసుకోండి. ఆ నా అనుభవం నాకు చాలా స్పష్టంగా ఉందన్న విషయం నాకు తెలుస్తుంది ఎందుకంటే నాకు దుఃఖం లేదు కాబట్టి అలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అంటున్నాను నేను మీరేం చేస్తున్నారంటే ఈ పని మంచిది కాదు ఈ పని చేస్తే మంచిదే అంటున్నారు.
(03:31) కానీ మంచి చెడులు దేని వల్ల వస్తున్నాయి మీ ఆసక్తిని అనుసరించి వస్తున్నాయి కదా మీ ఆసక్తిని ప్రశ్నించడం లేదు. అంటే మూలాన్ని ప్రశ్నించకుండా ఆ పై పైన ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రశ్నించి విచారించి నేను ఒకప్పుడు చాలా బ్యాడ్ పొజిషన్లో బ్యాడ్ గా ఉండేవాడిని ఇప్పుడు చాలా గుడ్ అయ్యాను అని చెప్తున్నారు అంతే అంటే మిమ్మల్ని మీరు ఏమార్చుకుంటున్నారు అయితే మిమ్మల్ని మీరు మబ్బి పెట్టుకుంటున్నారు అయితే ఆ అంటే ఒక అసహజత్వానికి సహజం అనేటువంటి ఒక పూత పూసుకుంటున్నాం అన్నమాట అయితే మనం ఆ మీ నిజస్థితి మిమ్మల్ని ఎక్కడికి కదలనివ్వదు అంటున్నాను నేను మీ నిజస్థితి యొక్క ఆనందం ఏదైతే ఉందో
(04:15) ఆనందం యొక్క స్పష్టత మిమ్మల్ని దేని గురించి ఆలోచింపచేది అంటున్నాను నేను మీ నిజస్థితి మీ ఆసక్తిని మొత్తం పూర్తిగా విద్వంసం చేస్తుంది అంటున్నాను నేను మీ నిజస్థితి అది చాలా స్పష్టంగా ఉందది అది చాలా నేరుగా ఉందది అది మీ హావ భావ వ్యక్తీకరణ తోటి సంబంధం లేకుండా మీ మనసు యొక్క స్థితిగతులతోటి సంబంధం లేకుండా మీ సహజత్వము ఆ కంప్లీట్ జాయ్ఫుల్ స్టేట్ అది చాలా నాచురల్ గా ఉంది అంటున్నాను నేను ఒక పువ్వు ఎంత సహజంగా అయితే విరబోస్తదో మీ హృదయం అంత స్వచ్ఛంగా విరబోయబడతా ఉందిది అది ఎప్పుడు కూడా అది వచ్చే జన్మకో మరు
(05:01) జన్మకో కాదు ఈ సదా ప్రస్తుతాన్ని వదిలేసి వచ్చే జన్మ కోసం పాటుపడు అనేటువంటి ఆధ్యాత్మిక హీనత కలిగినటువంటి వాళ్ళు అందరూ పూర్తిగా నశించిపోతేనే తప్ప ఈ దౌర్భల్యం నుంచి ఈ జాతి విముక్తి పొందదు అంటాను నేను వచ్చే జన్మ కూడా ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఈ సదా ప్రస్తుతం తలకు వైభవాన్ని నువ్వు అనుభవించినప్పుడు వచ్చే జన్మలు నీకు ఉండేటువంటి కర్మలు నీకు ఉండేటువంటి విషయ జ్ఞానాలని గురించి చర్చించడం అది హీనులు హీనులు హీనుల్ని తయారు చేయడానికి పుట్టినటువంటి ఈ పెట్టుడు గురువులందరూ చేసేటువంటి పని అది
(05:49) నేరుగా ఎప్పుడైతే నువ్వు నేరుగా నీ సహజత్వాన్ని నీ సహజత్వానికి అడ్డుపడుతున్న దాన్ని నువ్వు ఎప్పుడైతే నేరుగా ప్రశ్నించావో ఆ రోజు నువ్వు విముక్తిని పొందుతావు అంటున్నాను. నీకు కావలసింది విడుదల దేని నుంచి విడుదల అంటే నీవు కానటువంటి నీవు పెంచి పోషించుకున్నటువంటి ఆసక్తి నుంచి విడుదల కావాలి నీకు నీకు దేవుడి నుంచి విడుదల అక్కర్లేదు మీకు ఎవరికీ ఏ దేవతల గురించి విడుదల అక్కర్లేదు ఏ శాస్త్రాల గురించి విడుదల అక్కర్లేదు మీకు ఇవన్నిటికీ అజ్ఞాతంగా ఒకటి దాక్కొని ఉంది దాని పేరు ఆసక్తి ఏంటది ఆసక్తి ఆసక్తి వల్లే మనిషి విచ్చిన్నం అయిపోతున్నాడు ఆసక్తి వల్లే మనిషి
(06:25) దుఃఖానికి మోసం అవుతున్నాడు ఆసక్తి వల్లే మనిషి తన సహజమైనటువంటి సుందరమైనటువంటి తన దివ్యత్వాన్ని తను కోల్పోతున్నాడు. మీ ఆసక్తిని మీరు ఎప్పుడైతే నేరుగా ప్రశ్నిస్తారో మీకు ఆనందం తాలకు విజ్రమడ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నాను. మీ అనుభవాలు అభిప్రాయాలు అన్నీ కూడా మీ మంచి చెడులను సూచిస్తున్నాయి ఇక్కడ మీరు మంచిగా ఉంటే చాలా సుప్రీమ్ స్టేట్ అనుకుంటున్నారు.
(07:00) మంచిగా ఉండడం ఎంతో చెడుగా ఉండడం కూడా అంతే అదేం సుప్రీమ్ స్టేట్ కాదు నీ నిజస్థితికి సంబంధించినవి కాదు అవన్నీ నీ గుణములు తనకు విశ్లేషణకు సంబంధించిన అంశాలు అవి దాని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మీరంతా పెద్ద ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రాప్ లో ఉన్నారు అంటాను నేనైతే దానినుంచి నిన్ను ఎవ్వడు బయటకి తీసుకురాలేడు ఎందుకంటే ఆ ట్రాప్ నే నువ్వు ఒక గొప్ప మహా సౌదం కింద వర్ణించుకుని దానికోసమే జీవిస్తున్నావు కాబట్టి వాస్తవికత అలా లేదు అది నేను
(07:45) మాట్లాడినట్టుగా లేదు మీరు వింటున్నట్టుగా లేదు అది ఎప్పుడైతే మీ ఆసక్తి బద్దలైపోతుందో ఎప్పుడైతే మీ నిర్ధారణలన్నీ బద్దలైపోతాయో ఆ రోజు నీకు ఆ సహజ సుందరత్వం నీ హృదయం నుంచి అది నేరుగా ప్రకటించుకుంటుంది అన్నది నీకున్న అడ్డల్ల ఆసక్తి ఒక్కటే మీ ఆసక్తే మీకు ద్వందాన్ని సృష్టిస్తుంది మీ ఆసక్తి మీకు భయాన్ని కల్పిస్తుంది మీ ఆసక్తి మీకు బంధాన్ని సృష్టిస్తుంది అక్కడి నుంచే మీకు దుఃఖం వస్తుంది.
(08:29) మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు మీరు దుఃఖం నుంచి విడుదల పొందాలి అంతే మీకు డిప్రెషన్ ఉంది లోపల మనందరికీ సంసారంలో చాలా డిప్రెషన్ ఉంటది ఈ డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఎక్కడికి వస్తున్నాం స్పిరిచువాలిటీ లోకి వస్తున్నాం మరి స్పిరిచువాలిటీ లో ఒక డిప్రెషన్ ఉంది మళ్ళ దీనికంటే డబుల్ ఉంది ఇంకా సంసారంలో డిప్రెషన్ ఉన్నవాడికి కొంత ఆదరణ ఉంటదేమో తప్ప స్పిరిచువల్ గా డిప్రెషన్ ఉన్నవాడికి ఎక్కడ ఆదరణ ఉండదు వాడు పాడు సంకనాకపోవడమే అయిపోయింది వాడి బతుకు ఇకప్పుడు ఏ దేవుడు ఏ గురువులు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు మీ దగ్గర నువ్వు సత్యాన్ని ఇప్పుడే తెలుసుకోవాలి
(09:13) ఇక రేపు తెలుసుకుంటాను అంటే అవకాశం లేదు మీ నిజ స్థితి తాలకు వైభవాన్ని నువ్వు నేరుగా ఇప్పుడే ఇప్పుడే దాని గురించి ంచి విచారణ చేయాలి రేపు తెలుసుకుంటాను అంటే అవకాశం లేదు. రేపు అన్నదానికి లేదు ఎక్కడ అంటే వచ్చే సెకండ్ లేదు ఈ ప్రస్తుతంలోనే ఉంది విషయం అంతా అంటున్నాను నేను మీరు రేపటి గురించి కాదు ఒక పావు గంట గురించి కాదు ఈ ప్రస్తుతంలోనే మిమ్మల్ని మీరు నేరుగా ప్రశ్నించుకోవాలి అంటున్నాను నేను ఎందుకు ఇదంతా అక్కడి నుంచి మొదలవ్వాలి మీకు మీ దుఃఖం కచ్చితంగా మీకు సత్యం దగ్గరికి తీసుకెళ్తదినూటికి నూరు శాతం కానీ ఈ మధ్యలో మీరు ఈ దుఃఖం
(09:57) పేరుతోటి ఓదార్పులకు బాగా కోరుకుంటారు. ఇది ఎప్పుడైతే ఓదార్పుక వెళ్ళారో మీ దుఃఖం సచ్చిందాక తీసుకెళ్తది. ఇక్కడ డ్రాప్ అయిపోతుంది మళ్ళీ కొత్త దుఃఖాన్ని అనుభవించడానికి మీరు మళ్ళీ కొత్త యోహ రచన చేస్తారు. మీరు ఎంతసేపు దేవుని అర్థం చేసుకోవడం గురువుని అర్థం చేసుకోవడం కాదు మీ మైండ్ పాటర్న్ అర్థం చేసుకోండి. ఎప్పుడు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు మీరెవరి గురువుల్ని దేవుని చూసి మీరేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ సహజత్వానికి సంబంధించిన మూలాలన్నీ పసిపిల్లల్లో ఉంటాయి.
(10:41) పసిపిల్లలు చూడండి ఎలా ఉంటారో వాళ్ళు మా నాన్న వాళ్ళు ఉంటారు. మనమంతా ఆ మృదువైనటువంటి నవ్వు ఏదైతే ఉందో ఆ నవ్వును మరిచిపోయి మన యుగాలు గడిచిపోయాయి అంటున్నాను నేను మన పెదాలన్నీ కూడా ఆ మృదువైనటువంటి సహజమైనటువంటి ఆ మృదుత్వాన్ని కోల్పోయాయి మన పిదాలన్నీ మన పెదాలన్నీ అంటున్నాను నేను ఆ మృదుత్వాన్ని కోల్పోయాయి మనం పుట్టిన ప్రతి పిల్లల్ని కూడా మళ్ళీ
(11:27) మనం ఆ బానిసత్వంలోకి తేయడానికే కొత్త వ్యోహ రచన చేస్తున్నాం అంటున్నాను నేను ప్రతి కులం ప్రతి మతం ప్రతివాడు కూడా ప్రతి హిందువు ప్రతి ముస్లిం ప్రతి క్రిస్టియన్ ప్రతి జైనుడు ప్రతి బుద్ధిస్ట్ వాడు మైండ్ పాటర్న్ ద్వారాగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రచన చేశాడు వాడి కులం పేరుతో వాడి మతం పేరుతో అందరూ అలాగే ఉండాలనేటువంటి మూర్ఖత్వంలోకి తీసుకెళ్తున్నారు అందరూ ఏ మనిషికి స్వేచ్ఛ లేదు ఎవ్వరికీ ఆనందం తాలకు వైభవం తెలియదు.
(12:09) తెలియడానికి అవకాశం ఎక్కువ ఉంది ఆల్రెడీ నువ్వు పుట్టగానే నువ్వు నువ్వు నువ్వు ఇది అని డిక్లేర్ చేస్తుంటే కుల మత ప్రస్తావన తీసుకొస్తుంటే మీకు తెలియకుండానే మీరు ఎంత వినాశనాన్ని సృష్టించుకుంటున్నారో చూడండి అసలు మీ సహజ జీవన వైభవాన్ని మీరంతా ఎంత కాలరాసుకుంటున్నారో చూసుకోండి మీ సహజమైనటువంటి ఆనందాన్ని ఈ భౌతిక పరమైనటువంటి కేవలము మనుషులు సృష్టించుకున్నటువంటి ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్ లో పెట్టి మీ సహజత్వాన్నంతా పూర్తిగా మీరు కాలరాస్తున్నారు అంటున్నాను నేను మీ నిజస్థితి ఒక అపూర్వమైనటువంటి మహా సహజ సహజత్వపు వైభవం అంటున్నాను నేను
(12:56) మీరు మీకోసం కాకుండా మీరు ఇతరం కోసం జీవిస్తున్నారు అంటున్నాను ప్రతివారు మీ కులం కోసమే జీవిస్తున్నారు మీకోసం మీరు జీవించట్లేదు మీ మతం కోసమే మీరు జీవిస్తున్నారు మీకోసం మీరు జీవించట్లేదు మీ ప్రాంతాల కోసం మీరు జీవిస్తున్నారు తప్ప మీకోసం మీరు జీవించట్లేదు ఈ దౌర్భాగ్యం 64 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ లేదు ఒక్క మనిషికి మాత్రమే ఉంది ఈ దౌర్భల్యం ప్రతివాడు తన ఆనందాన్ని పూర్తిగా కాలరాసుకుంటున్నాడు.
(13:22) కాల రాసుకొని వెళ్లి దేవుడి దగ్గర నుంచో దేవతల దగ్గర నుంచో గురువుల దగ్గర నుంచో సద్గురువుల దగ్గర నుంచో దాన్ని పొందుదాం అనుకుంటున్నాడు ప్రతివాడు తన హీనతను తాను సృష్టించుకుంటున్నాడు ఇక్కడ నువ్వు ఇదేది కాదు నువ్వు ఈ వర్గానికి సంబంధించినటువంటి వాడు కాదు ఈ కులబత జాతి వ్యవస్థకు సంబంధించినటువంటి వాడు కాదు యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ నువ్వు హ్యూమన్ అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు హ్యూమన్ కాదు నీకు జెండర్ లేదు యు ఆర్ ప్యూర్ బీయింగ్ యు ఆర్ అల్టిమేట్ బీయింగ్ పరిపూర్ణమైన మహా స్వేచ్ఛవు నువ్వు కేవలం నువ్వు కాని అంశములు ఏవైతే ఉన్నాయో
(14:09) కానీ అంశాలను నువ్వు ప్రోత్సహిస్తున్నావ అంటున్నాను నేను ఉన్నదాన్ని ఉన్నదో జరుగుతుంది జరుగుతుంది దాన్ని జరగనివ్వండి అందులోకి మీరు వెళ్ళకండి అంటున్నాను నేను నువ్వేమి శివుడు సొత్తువు కాదు నువ్వేమి విష్ణువు సొత్తు కాదు నువ్వు ఎవరంటే అది పూర్తిగా నువ్వే నువ్వు ఒక్కడవు మాత్రమే అంతే మిగతా అదంతా పూర్తి విభాగం ఇదంతా పూర్తి విచ్చిన్నత మీ ఆధ్యాత్మికత మీ ఏకాంత వైభవాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది అంటున్నాను నేను మీ ఆధ్యాత్మిక మీకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించగలగాలి మీ ఆధ్యాత్మికత ఏకత్వాన్ని ప్రసాదించగలగాలి.
(14:52) మీ ఆధ్యాత్మికత కళంకాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలగాలి. మీ ఆధ్యాత్మికత కొత్త ప్రశ్నలని రేకెత్తిస్తుంది. మీ ఆధ్యాత్మికత కొత్త అసహనాన్ని పుట్టిస్తుంది. మీ ఆధ్యాత్మికత మినీ కల్ట్ లేదా ఒక బిగ్గెస్ట్ కల్ట్ క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను ఇక్కడ పూర్తిగా నువ్వే కోల్పోతున్నావ్ అంటున్నాను. నువ్వు ఆలోచించాలి నీ గురించి నువ్వు ఆలోచించాలి నీ ఆనందం గురించి ఆలోచించాలి నీ సహజత్వం గురించి ఆలోచించాలి నీ సహజ జీవన వైభవాన్ని ఎప్పుడు ఇక్కడ ఇలా చాలా స్వేచ్ఛగా పరమ స్వేచ్ఛగా అందిపుచ్చుకోవాలి నువ్వు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎప్పుడూ
(15:36) చూడకూడదు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ పక్కోడు కూడా మీకు ఎందుకండి మీరు ఎప్పుడు ఎవరిని సంస్కరిందమని ఎప్పుడు చూడొద్దు అర్థమవుతుందా సంస్కరణ అనేటువంటి ఊబిలోకి మీరు ఎవరు అసలు వెళ్లద్దు నువ్వు ఎప్పుడు ఇండివిడ్యువల్ నువ్వు నువ్వు ఎవడి మీద ఆధారపడకు నువ్వు ఎప్పుడు మీరు ఆధారపడుతున్నారు మీరు ఆధారపడుతున్నారు కాబట్టే మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు మీకు ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు మీకు స్వేచ్ఛ విషయం తీసి పక్కన పెట్టండి ఎవరికీ స్వతంత్రత కూడా లేదు ఏదో రకంగా సాగిలపడి ఆ అమరత్వాన్ని అందుకోవాలని చూస్తారు ఇది పెద్ద మూర్ఖత్వం అంటున్నాను నేను
(16:21) మీరు ఎవరు ఏ జీవి ఎవరికీ కూడా ఎవరికీ వంగి వంగి దండాలు పెట్టవలసిన అవసరం లేదు ఎవరి అనుగ్రహానికి మీరు పాత్రులు కాదు. ఎవరి అనుగ్రహం కోసం మీరు అర్ధించవలసిన అవసరం లేదు అనుగ్రహం అపారంగా మీ హృదయంలో ఉంది. అది మీ దగ్గర నుంచి మేలుకుంటుంది అది అనుగ్రహం అంటే ఏంటో తెలుసా ఒక ప్రత్యేకమైనటువంటిది కాదు ఈ సదా ప్రస్తుతము తాలకు సన్నిధి ఏదైతే ఉన్నదో దానికి అనుగ్రహం అని పేరు అంతే మీరు ఏమనుకుంటున్నారు ఇలా టచ్ చేస్తే ఏదో వచ్చేస్తది అనుకుంటున్నారు.
(16:54) అర్థమవుతుందా ఆ టచ్ చేసేవాడికి ఏమనా ఎలర్జీ ఉంటే అలర్జీ వస్తది మీకేం రాదు వచ్చినట్టు మీరు మానసికంగా అనుభూతి చెందుతున్నారేమో చూసుకోండి మీకు ఏమీ రాదు ఎవరు టచ్ చేస్తే ఏమి రాదు ఎవరు చూసినా ఏమి రాదు ఏమి రాదు ఎవరైతే సదా ప్రస్తుతంలో ఉంటారో ఆ ప్రస్తుతం తనకు సన్నిధి ఏదైతే ఉంటదో ఆ సన్నిధిలో మీరు కాసేపు అలా వాలితే చాలు మీకు ఆనందం కలుగుతుంది.
(17:29) ఆనందం క్రియకు సంబంధించింది కాదంటున్నాను నేను మీరు పడి ఉంటే అన్ని వస్తాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే అన్ని వస్తాయి. ఇది కాకుండా మీరు ఏది చేసినా ఏది రాదు నువ్వు నువ్వుగా ఉండడానికి మీరు ఎప్పుడైతే కొత్త వ్యోహ రచన చేయకుండా ఉంటారో మీరు మీరుగా ఉండడానికి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఆదర్శంగా తీసుకుంటారో మీతో మీరు ఎంతసేపు ఏకాంతో మీతో మీరు ములిగి ఉంటారు
(18:17) మీ ఆనందం యొక్క తాళం చెవి మీకు ఎక్కడ దొరుకుతుంది అంటున్నాను నేను జీవితం ఉన్నది జీవించడానికి మాత్రమే అది కేవలం జీవించడానికి మాత్రమే అనుభవించడానికి కాదు అభివృద్ధిని చాటడానికి కాదు వ్యక్తీకరించడానికి కాదు ప్రకృతిలో ఏ జీవరాశి చేయనటువంటి పనులన్నీ ఒక్క మనిషి ఒక్కడు చేస్తాడు. మిగతావి ఏవి కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు దేంట్లకి ఉంటది ఆ పూటకి మిమ్మల్ని మీరు నేరుగా అర్థం చేసుకోమంటున్నాను అందుకే నేను మీరంతా ఎవరో ఒకరి దగ్గర వదిగి ఉండడానికే
(19:04) చూస్తున్నారు తప్ప మీ హృదయంలో వదడానికి వదగడానికి సముఖంగా లేరు అంటున్నాను భయం దీనికి కారణం ఏంటి భయం ఒంటరిగా ఉంటే ఏమైపోతా అన్న భయం ఆ ఒంటరిగా ఉంటే ఏమైపోతావో అన్న భయం మీకు మళ్లా మళ్లా చెప్తున్నాను బాగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికత అంటే భవిష్యత్తుని బలి చేయడం అది ఆధ్యాత్మికత అంటే ఏంటి భవిష్యత్తుని బలి చేయడం అది అలా బలి చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అలా ఉన్నవాడికి ఇది ఒకవేళ అటువంటిది అటువంటి తీవ్రత ఎవరికైనా
(19:50) ఉంటే వారికే తప్ప ఇది మిగతా మిగతా వారికి ఎవరికీ ఇది కాదు. మీరు ఎవరు ఇక్కడికి వచ్చి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకండి మీరు అనుకున్నట్టుగా లేదు సత్యం మీరు సత్యాన్ని ఎలాగ అనుభవిస్తున్నారు అంటే అది ఒక పూలమాలల్లోని మీరంతా సత్యాన్ని ఎలా అనుభవిస్తున్నారు అంటే ఒక దీప ప్రమిదిలోని మీరంతా సత్యాన్ని ఎలా అనుభవిస్తున్నారు అంటే మహాత్ముల ఫోటోలు ఆ నేను మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను మీరు అనుకున్నట్టుగా వాస్తవం ఎలా లేదు మీ జీవితాన్ని బలి చేసుకోకండి.
(20:29) మీరు అనుకున్నట్టుగా లేదు వాస్తవం ఎప్పుడూ మీకు ఎవరికీ నచ్చదు. నేను మరే మరలా చెప్తున్నాను నేను మీరు అనుకున్నట్టుగా సత్యం లేదు అది చాలా కఠినంగా ఉంది. ఆ వాస్తవికత అది మీ జీవన విధ మీరు ఇప్పుడు ఏదైతే మీరు జీవిస్తున్నారని అనుకుంటున్నారో దానికి పెను ప్రమాదం కింద ఉందది. వాస్తవికత మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా పతనం చేస్తది. మీ బంధాన్ని కాలరాస్తది.
(21:02) మీ అనుభవాన్ని అభిప్రాయాలని విచ్చిన్నం చేస్తది. మీరు అనుకుంటున్న దేవుళ్ళు మీరు అనుకుంటున్న దేవతలు మీరు అనుకుంటున్న క్షేత్రాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తిగా గాలిలో దూలి రేణువుల్లా కలిసిపోతాయి అంతటి ప్రమాదకరం సత్యం దయచేసి మీరు దాని జోలికి రావద్దు. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు ఈ ఆధ్యాత్మికత పేరుతో మీరు అనుకుంటారు ఇక్కడికి వస్తే ఏదో పొందుతాం ఏదో పొందుతామ అట మీరు పొందిది సచ్చింది ఏమ ఉండదు మీరు అసహనాన్ని మూట కట్టుకుంటారు పోయి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటారు ఆ ప్రశాంతతను
(21:37) మీరు ఎప్పుడూ అనుభవించలేదు ఈ ప్రశాంతతని 10 మందితోటి సత్సంగాల పేరుతో 10 మందితో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఓ పీడను అంటకట్టుకుంటారు మీరు అనుభవం లేకుండా ఎవరు దేని గురించి మాట్లాడొద్దు అది మీ సమయాన్ని మీరు పూర్తిగా దుర్వినియోగం చేసుకోవడమే అది మీరు అనుకున్నట్టుగా లేదు ఇది ఇది ఎక్కడ అంతు చిక్కని విధంగా ఉంది ఇదంతా ఉందా అంటే ఉన్నట్టుగా ఉంది లేదా అంటే లేనట్టుగా ఉంది ఇది ఇదంతా చాలా సహజంగా ఉంది దట్ సేమ్ టైం అది చాలా మర్మ గర్భంగా కూడా ఉందది.
(22:17) అది ఏకకాలంలో అది పూర్తిగా మీ ఇంద్రియాలన్నిటిని విచ్చిన్నం చేస్తుంది. మీ స్పృహ ఉవ్వెత్తిని ఎగిసిపడి మీ దేహ పరుదులని చెరిపేస్తది అది మీ గాడ్ ని అది పూర్తిగా విచ్చిన్నం చేస్తది. మీ రిలేషన్స్ ని కంప్లీట్ గా విచ్చిన్నం చేస్తది. మీ అనుభవాన్ని మీ అభిప్రాయాన్ని మీ ఆధ్యాత్మికతని మీ కులమత జాతి ప్రస్తావన అన్నిటిని పూర్తిగా విచ్చన్నం చేస్తది అది అది ఒక అమృతమైన మహా విస్ఫోటనం అది మీరు అనుకున్నట్టుగా లేదుఅది మీరెవ్వరు దాని భార్యని పడకండి మీరు మీ సమయాన్ని పూర్తిగా వృదా చేసుకుంటున్నారు మీ కుటుంబాన్ని పూర్తిగా
(23:02) నిర్లక్ష్యం చేసుకుంటున్నారు ఈ ఆధ్యాత్మికత అనే పేరు పెట్టుకొని మీ పిచ్చిని ప్రదర్శిస్తున్నారు మీరంతా మీరేదో అనుకుంటున్నారు మీరు అనుకున్నట్టుగా లేదుఇది ఇది మహా ప్రళయంగా ఉంది. మీరేదో ఆరాకోర జ్ఞానంతో ఏదో ఇలాగ మనక ఏదో ఒంటికి ఏదో పూసుకొని ఏదో చెప్తున్నట్టుగా లేదు ఇదంతా కూడా ఎవరో ఉన్నారు నూటికి కోటికి వాళ్లే పూర్తిగా అంతర్ముఖులు అవుతున్నారు.
(23:29) అందరి పరిస్థితి అలా లేదు మీకు ఏదైనా అత్యవసరం అయితే నేరుగా మీరు ఉన్న చోటనే ఎటువంటి ప్రయాణాలు లేకుండా ఎటువంటి పలకరింపులు లేకుండా మీ ఏకాంతాన్ని మీరు ఉన్న చోటనే కల్పించుకోవచ్చు. మీ ఆధ్యాత్మికత ఎక్కువ బరువెక్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ ప్రయాణాలు చేయడం వల్ల వచ్చింది సమస్య అంతాని అటు ఇటు తిరగడం వల్ల వచ్చింది సమస్య అంతా నాకు అర్థం అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో నేను సత్యం చెప్పలేను ఇక్కడ నుండి ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చి నాలుగు ఐదు మాసాలు అవుతుంది నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు దాదాపు 60 70 మంది అయిపోయారు. ఇక నన్ను మీరు
(24:09) సత్యం చెప్పనివరు మీ ఆలోచనలోనుంచి పుట్టినటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మికతనే మీరు నా దగ్గర నుంచి కోరుకుంటారు అలా చెబితేనే మీరు నన్ను ఇక్కడ సుఖంగా ఉండనిస్తారు తప్ప లేకపోతే మీరు ఎవరు నన్ను సుఖంగా ఉండరు ఎవరు మీరు ఎవరో నన్ను సత్యం చెప్పనివరు ఇన్ ఫ్యూచర్ లో నాకు ఆ విషయం తెలుస్తుంది స్పష్టంగా మీకు ఎవరికీ సత్యం అక్కర్లేదు దాని పేరు మీద ఏదో గొప్ప నాటకం కావాలి మీకు మిమ్మల్ని మోసం మోసం చేసేటువంటి గురువులే మీకు కావాలి మీకు సత్యం ఎవడిక అక్కర్లేదు దాన్ని అందుకునే స్టాండర్డ్ ఇది కాదు అంటున్నాను నేను అది నేను మళ్లా మళ్ళా చెప్తున్నాను జీవితం
(24:53) పూర్తిగా నాశనం అయిపోతుంది నాశనం చేసుకోవద్దు మీరు స్వేచ్ఛగా ఉండండి మీరు ఆనందంగా ఉండండి మీకు ఎలా బాగుంటే అలాగే ఉండండి. దీన్ని అలవరుచుకుందాం అని చూడద్దు ఇది మీ సహజ జీవనంలో ఉంది ఇదంతా మీరు జీవించట్లేదు మీరు జీవించినంత వరకు కూడా నేను ఎన్ని చెప్పినా మీకు అది అర్థం కాదుఅది ఎందుకంటే మీరు ఇప్పుడు త్యాగం అనేటువంటి అంశాన్ని బాగా చూసుకోవాలి ముందు మీరు త్యాగం కావాలి మీకు ఇదంతా వదులుకోవాలి మీరు ఆ అంటే మీరు అడగొచ్చు మేము దేన్ని వదులుకోవాలి అని మీరు ఒకటి కాదు మీ తల మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయో అన్ని వదులుకోవాలి ఇప్పుడు అంతా పోగేసుకున్నాం మనం ఒకటి రెండు కాదు
(25:36) ఈ ప్రయాణం అయిన తర్వాత ఆ ప్రయాణం ఆ ప్రయాణం అయిన తర్వాత ఈ ప్రయాణం ఇక్కడి నుంచి 10 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు ఉంటే అక్కడ 20 రోజులు ఇంకో చోట ఇంకో చోట ఏదో పిచ్చి మనిషికి ఉన్న చోట సుఖంగా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా ఆ మీ గురువు దగ్గర ఒక దీపం పెట్టుకొని ఆ గురువు దగ్గర దీపం పెట్టుకొని హాయిగా ఆ ఎక్కడైతే దీపం పెట్టారో అక్కడ తలవాల్చి నేరుగా పడుకొని విశ్రమించిన వాడు ఎవడైనా ఉన్నాడా మీకు ఎందుకు ఆనందం కలగాలి మనం చేస్తున్నదే తప్పు మళ్ళీ అందులో అర్హత చూడడం ఒకటి ఈ ఆధ్యాత్మికతకు అర్హతో పని లేదండి బాబు దానికి పని లేదు అసల
(26:19) అర్హత అనేటువంటిది ఇంకొకటి నిర్ధారించింది అది అది మీది కాదు అది మీరు కాని అంశాన్నే మీరు పూర్తిగా దాన్ని మీరు దానితో మీరు తాదాత్మత చెందు ఉన్నారు న్నారు సపోజ్ నేను వచ్చాను నువ్వు భక్తిగా ఉండట్లేదు అన్నాను అది ఎవరి స్టేట్మెంట్ నా స్టేట్మెంట్ అది నీది కాదు నువ్వ ఏం చేస్తున్నావ్ అయ్యో నేను భక్తిగా ఉండట్లేదు భక్తిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావ్ అంటే నువ్వు వదులుకొని ఇంకో దాని కోసం పరితపిస్తున్నావ్ ఎక్కడికక్కడ విభాగం జరిగిపోతుంది అంటున్నాను నేను ఎప్పటికప్పుడు విభాగం జరిగిపోతుంది అంటున్నాను నేను ఈ విభాగం చేయడంలో ఆ గురువులే ముందు
(26:54) ఉన్నారు అంటున్నాను మళ్ళీని వాళ్ళే చెప్తున్నారు ఇలా ఉండద్దు ఇలా ఉండి ఇలా ఉం ఉండద్దు ఎలా ఉండు అని ఎక్కడికి వద్దు ఎవ్వరి దగ్గరికి వద్దు నువ్వు నువ్వుగా ఉండు ఎక్కువ వద్దు కొన్ని రోజులు ఉండు ఆ సహజంగా ఉండు హాయిగా ఉండు నీకు ఏది తోస్తే అలాగ ఉండు ఆ చక్కగా రోజు మంచి పుస్తకం చదువుకో రోజు ఒక రెండు మూడు కిలోమీటర్లు వాకింగ్ చేసుకోండి మీకు ఏది తోస్తే అది చేయండి ఎదటి వాడిని పరిగణలోకి తీసుకోవద్దు ఎవరికీ సలహాలు ఇవ్వద్దు ఎవరి దగ్గర నుంచి సలహాలు కోరుకోవద్దు అర్థమవుతుందా అసలు ముందు ఈ ముక్తి అన్న ప్రస్తావన నుంచి ఆత్మజ్ఞానం అన్న ప్రస్తావన నుంచి బయటికి
(27:37) రండి దేనినుంచి ముక్తి ఆత్మజ్ఞానం అనే ప్రస్తావన నుంచి బయటకి రండి ముందు మీరంతా సరదాగా ఉండమని చెప్పట్లేదు సహజంగా ఉండండి సహజంగా ఉండండి ఆ తగినంత భోజనం తీసుకోండి తగినంత బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వండి ఆ ఈ చల్లగాలిని ఆస్వాదిస్తూ హాయిగా కూర్చోండి అలా మీరు ఒక్కళ్లే కూర్చోండి మళ్ళీ దీన్నివాట్ లో అందరికీ పంపకండి నా అదృష్టం నేను ఇక్కడికి వచ్చి పడ్డాను అది ఇది అని పెట్టకండి మీ లైఫ్ ని ఎందుకు షేరింగ్ లో పెడతారు ఈ జీవితం ఎవరిది ఇది మీది ఇది దాన్ని స్వేచ్ఛగా ఎలా ఆస్వాదించాలో చూడండి ముందు
(28:24) మీరు ఏదైతే అమరత్వం అమరత్వం అనుకుంటున్నారో అది మీకు తతి చేరువుగా ఉన్నది మీరు జీవించట్లేదు మీరు జీవించట్లేదు కాబట్టి అది దూరమైపోతుంది భారం అయిపోతుంది. అది మీతో కలిపి ఉంది అది మీరేమంటున్నారు దాన్ని విడిగా అనుభవిస్తాను అంటున్నారు మీరు ఏది జరగటం లేదా చెప్పండి అది మీతో కలిపి ఉందా అది మీతో అది ఎలా ఉంది అది మీతో కలిపి ఉంది మీరు ఎలా చేస్తున్నారు దాన్ని విడిగా అనుభవిందాం అంటున్నారు ఎలా కుదురుతుంది మీరు సమిష్టిని ఎలా విభాగం చేస్తారు అసల అసలు ఆ సమిష్టిని ఎలా విభాగ పరుస్తారు మీరు మీరు దాని దాన్ని పొందాలంటే మీరు దీన్నంతా
(29:16) కోల్పోవాల్సిన అవసరం లేదు అర్థమైందా దీని మీద ఉన్న ఆసక్తి పడిపోతే సరిపోతుంది మీరు మొత్తానికి మూలానికే మొత్తం దాన్ని తుది ముట్టించేద్దాం అని చూస్తున్నారు ఆ మీ సొంత ఆలోచనలు పెడుతున్నారు ఇక్కడ అంటున్నాను నేను అది నేను అందుకే లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏం చెప్పానంటే మీరు దేన్ని అనుభవిందాం అనుకుంటున్నారో తెలుసా ఆ ఊహాత్మక చైతన్యాన్ని అనుభవిస్తున్నారు మీరు మీరు ఊహించుకున్న చైతన్యం అది ఆ దాన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తున్నారు అది అది అది అది అది డిక్లర్ చేస్తున్నారు ఆ నిన్ను నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావో నాకు
(30:00) అది అర్థం కాదు అసల నీ నుంచి నువ్వు విడిపడితేనే నువ్వు పదం డిక్లేర్ చేయాలి అంతే కదా అది ఎంత సమతుల్యంగా ఉందో చూడండి మీరు ఎంత విభాగ పరుస్తున్నారో చూడండి
No comments:
Post a Comment